Telangana | గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. రూ.2500 కోట్లు విడుదల చేయనున్న కేంద్రం
Telangana | రాష్ట్రంలో (Telangana) నిధుల లేమితో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలకు (Grama Panchayathi) కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులను (Finance Commission Funds) విడుదల చేసేందుకు ఒప్పుకున్నది.
త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో (Telangana) నిధుల లేమితో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలకు (Grama Panchayathi) కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులను (Finance Commission Funds) విడుదల చేసేందుకు ఒప్పుకున్నది. రాష్ట్రంలోని గ్రామపంచాయతీల పాలకవర్గాలకు 2024 జనవరిలో గడువు ముగిసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సర్కార్ సమయానికి ఎన్నికలు నిర్వహించకపోవడంతో అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. అయితే గత డిసెంబర్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రేవంత్ సర్కార్ ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. పెండింగ్‌లో ఉన్న రూ.2500 కోట్లను విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది.
ఇందులో భాగంగా ఈ నెలాఖరులోగా రూ.వెయ్యి కోట్లను విడుదల చేయడానికి అంగీకరించింది. మిగిలిన రూ.1500 కోట్లను ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. దీనికి సంబంధించి విధివిధానాలను ప్రకటించింది. అవి పూర్తయిన తర్వాతే ఈ నిధులను పంచాయతీలు వాడుకునే అవకాశం ఉంది.
15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రతి గ్రామ పంచాయతీ ప్రత్యేక బ్యాంకు ఖాతాను ప్రారంభించాలని పేర్కొంది. ఆ ఖాతాను పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్‌లో నమోదు చేసి యూనిక్ ఏజెన్సీ కోడ్ పొందాలని, ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్లోనూ ఖాతాల వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేసింది.
నిధుల వినియోగానికి సర్పంచి (చెకర్), ఉప సర్పంచి (మేకర్) డిజిటల్ సంతకాలను నమోదు చేసి సంబంధిత ఎంపీడీవోల ద్వారా ఆమోదం పొందాలని తెలిపింది. ఈ ప్రక్రియకు క్లాస్-3 డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు తప్పనిసరని పేర్కొంది. సైనింగ్, ఎన్క్రిప్షన్ సౌకర్యంతో పాటు యూఎస్బీ టోకెన్ కూడా ఉండాలని వెల్లడించింది. అవసరమైన డిజిటల్ సంతకాలను పంచాయతీ అధికారులు జీఈఎం పోర్టల్‌లో నమోదు చేయాలి సూచించింది. పనులను ఈ-ప్రొక్యూర్మెంట్ లేదా ఇతర టెండర్ విధానాల ద్వారా నిర్వహించాలని అందులో పేర్కొంది.
పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి నిధులు రాకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడంలో అలసత్వం వహించడంతో గత రెండేండ్లుగా గ్రామాల్లో పరిపాలన స్తంభించిపోయింది. పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో కొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తమైంది. పంచాయతీ ట్రాక్టర్లో డీజిల్ కూడా పోయలేని దుస్థితి తలెత్తింది. పంచాయతీ కార్యకదర్శులు అప్పులు చేసి మరీ గ్రామాల్లో అరకొరగా పనులు నిర్వహించారు. తాజాగా పాలకవర్గాలు కొలువుదీరడం, నిధులు విడుదలకు కేంద్రం సరేననడంతో కాస్త ఉపశమనం లభించినట్లయింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



