Harish Rao | ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలి
Harish Rao | ఏ ప్రభుత్వమైనా, ఏ పాలకులైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే చాకలి ఐలమ్మ (Chakali Ilamma) స్ఫూర్తితో ఉద్యమించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
- ప్రభుత్వంలో ఎవరున్నా సరే పోరాడి పేదల పక్షాన నిలబడాలి
- అదే ఐలమ్మ మనకిచ్చిన స్ఫూర్తి
- దాన్ని మనందరం అందిపుచ్చుకోవాలి
- గజ్వేల్‌లో ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపు
Harish Rao | త్రినేత్ర న్యూస్: ఏ ప్రభుత్వమైనా, ఏ పాలకులైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే చాకలి ఐలమ్మ (Chakali Ilamma) స్ఫూర్తితో ఉద్యమించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పిలుపునిచ్చారు. పేదల పక్షాన, పీడిత ప్రజల పక్షాన నిలబడాలన్నారు. అదే ఐలమ్మ మనకు ఇచ్చిన స్ఫూర్తి అని కొనియాడారు. శనివారం ఐలమ్మ జయంతి సందర్భంగా గజ్వేల్‌లో ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. రజక సోదర సోదరీమణులకు, పెద్దలంతా కలిసి పాండవుల చెరువు ఎదురుగా ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు
ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం పెత్తందారుల మీద పోరాటం చేసి, పీడిత ప్రజల పక్షాన నిలిచిన వీరవనిత చాకలి ఐలమ్మ. అలాంటి వీరవనితకు సమైక్య రాష్ట్రంలో సరైన గుర్తింపు దక్కలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా చాకలి ఐలమ్మ జయంతిని జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అందరూ అధికారికంగా నిర్వహిస్తూ, ఐలమ్మ పోరాట స్ఫూర్తిని, పేదల పక్షాన ఆమె చేసిన పోరాటాన్ని మనందరం స్మరించుకుంటున్నాం.
గిట్టుబాటు ధర కోసం కొట్లాడింది..
నిజంగా ఐలమ్మ ఆ రోజుల్లో గడీల మీద చేసిన పోరాటం చాలా గొప్పది. రైతులు ఎంతో కష్టపడి పంటలు పండిస్తే.. ఆ పంటలకు గిట్టుబాటు ధర రాక పొడవటంతో పోరాటం చేసింది. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి చాకలి ఐలమ్మ భవన్ ఎక్కడ ఉందంటే మన గజ్వేల్‌లో ఉంది. దాన్ని మన కేసీఆర్ మనకు నిర్మించి ఇచ్చారు. ఈ విగ్రహాన్ని కూడా చక్కగా పాండవుల చెరువు ఎదురుగా ఏర్పాటు చేశారు. ఇంత మంచి ప్రదేశంలో ఒకవైపు పాండవుల చెరువు, ఒకవైపు మడేలమ్మ గుడి, మరోవైపు చాకలి ఐలమ్మ విగ్రహం. ఇలా మంచి లొకేషన్‌లో ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మా కౌన్సిలర్ నర్సింహారావు, పద్మాబాయి కూడా మంచి చొరవ చూపి దీని కోసం ఎంతో కృషి చేశారు. వారిని కూడా నేను అభినందిస్తున్నాను.
ఆసుపత్రిని కట్టిస్తే ఇంకా ఓపెన్ చేయలే..
ఈరోజు ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. గజ్వేల్‌లో పరిస్థితి ఏమైందంటే.. కేసీఆర్ వేసిన రోడ్లకు ఏదైనా గుంతలు పడితే కనీసం తారు పోసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కేసీఆర్ కట్టించిన బిల్డింగులకు కనీసం సున్నం వేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కేసీఆర్ వంద పడకల మహిళా, శిశు సంక్షేమ ఆసుపత్రిని కట్టిస్తే, ఆ దవాఖానను ఇప్పటిదాకా ఉపయోగంలోకి కూడా తీసుకురాని పరిస్థితిని మనం చూస్తున్నాం.
ఈరోజు కాళేశ్వరం మోటర్లు నడిపిస్తే, మల్లన్నసాగర్ నింపుకుంటే అద్భుతంగా నీళ్లు వస్తున్నాయి. నిజంగా పాండవుల చెరువు ఒకప్పుడు ఎండిపోయి ఉండేది. అటువంటి పాండవుల చెరువు ఈరోజు అద్భుతంగా కాళేశ్వరం నీళ్లతో కళకళలాడుతోంది. బతుకమ్మ పండుగ వస్తే ఇక్కడ నీళ్లు లేక, ట్రాక్టర్లతో నీళ్లు తెచ్చి గుంత నింపి బతుకమ్మలు వేసిన రోజులు ఉన్నాయి. అటువంటి పాండవుల చెరువు ఈరోజు కాళేశ్వరం జలాలతో కళకళలాడుతూ, నిండు నీళ్లతో నిండు కుండలా ఉండడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తోంది.
గజ్వేల్ రూపురేఖలు మారాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్ కావడంతో ఎంతో అభివృద్ధి జరిగింది. రైల్వే స్టేషన్ రావడం కావచ్చు, రైలు రావడం కావచ్చు, గోదావరి జలాలు రావడం కావచ్చు, ఆసుపత్రులు రావడం కావచ్చు ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగాయి. ఇంకా జరగాల్సిన అవసరం కూడా ఉంది.
చాకలి ఐలమ్మ మనకు స్ఫూర్తిగా నిలవాలి. ఐలమ్మ విగ్రహం పెట్టుకోవడం మాత్రమే కాదు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు జరిగితే, ఏ ప్రభుత్వమైనా, ఏ పాలకులైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే, ఐలమ్మ స్ఫూర్తితో మనం పోరాటం చేయాలి. ఆ ప్రభుత్వం మీద, ఆ పాలకుల మీద, అన్యాయం చేసిన వాళ్ల మీద పోరాడి పేదల పక్షాన, పీడిత ప్రజల పక్షాన మనం నిలబడాలి. అదే ఐలమ్మ మనకు ఇచ్చిన స్ఫూర్తి.
ప్రశ్నించకుంటే పట్టించుకోరు...
ప్రశ్నించకపోతే ఎవరూ పట్టించుకోరు. మన ఐలమ్మ కొంగు నడుముకు చుట్టి, తుపాకులకు వ్యతిరేకంగా, ఫిరంగి గుళ్లకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడింది. పేదల హక్కుల కోసం పోరాడింది. పేదల గొంతుకగా ఉద్యమించింది. కాబట్టి మనం కూడా ఆమె నుంచి తీసుకోవాల్సిన స్ఫూర్తి ఏమిటంటే ఎవరైనా మనకు అన్యాయం చేస్తే, మనకు తప్పు చేస్తే, అటువంటి వాళ్ల మీద పోరాటానికి సమాయాత్తం కావాలి. అదే చాకలి ఐలమ్మ మనకు ఇచ్చిన స్ఫూర్తి. దాన్ని మనం అందిపుచ్చుకోవాలి. ఎవరు మనకు అన్యాయం చేసినా, ఐలమ్మ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలి. మన హక్కులను కాపాడుకోవాలి అని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అని హరీశ్ రావు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

KTR | ప్యారడైజ్ సినిమా చూడబోతున్న కేటీఆర్ – చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌కు వెళ్తున్నానంటూ ట్వీట్
సెప్టెంబర్ 26, 2026

Two dies in Road Accident | ఔటర్‌పై పేలిన ట్రాలీ ఆటో టైరు.. ఇద్దరు కూలీలు దుర్మరణం
సెప్టెంబర్ 26, 2026

Harish Rao | హరీశ్ లేఖతో కదిలిన ప్రభుత్వం.. అనంతగిరి, రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాల్సిందే.. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి డిమాండ్
- ●Indian Railways | దసరా, దీపావళికి 102 ప్రత్యేక రైళ్లు.. బుకింగ్ ఎప్పుడు అంటే?
- ●Stock Recommendation | ఈ 3 స్టాక్స్‌పై బ్రోకరేజీల నజర్.. టార్గెట్, స్టాప్‌లాస్ ఇవే..
- ●KTR | ప్యారడైజ్ సినిమా చూడబోతున్న కేటీఆర్ - చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌కు వెళ్తున్నానంటూ ట్వీట్
- ●Telugu University | తెలుగు విశవ్విద్యాలయం-2026 ప్రతిభా పురస్కారాలు
- ●spurious liquor | నాగాలాండ్‌లో కల్తీ మద్యం కలకలం.. 19 మంది మృతి

Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాల్సిందే.. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి డిమాండ్

Indian Railways | దసరా, దీపావళికి 102 ప్రత్యేక రైళ్లు.. బుకింగ్ ఎప్పుడు అంటే?

Stock Recommendation | ఈ 3 స్టాక్స్‌పై బ్రోకరేజీల నజర్.. టార్గెట్, స్టాప్‌లాస్ ఇవే..

KTR | ప్యారడైజ్ సినిమా చూడబోతున్న కేటీఆర్ - చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌కు వెళ్తున్నానంటూ ట్వీట్





