త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Agniveers | అగ్నివీర్ల‌కు గుడ్‌న్యూస్‌.. ప‌ద‌వీ కాలాన్ని రెండేళ్లు పొడిగించిన కేంద్రం

Agniveers | అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్ అయిన అగ్నివీర్ల (Agniveers) ప‌ద‌వీ కాలాన్ని అదనంగా మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలపరిమితి పూర్తయిన తర్వాత ఆసక్తి కలిగిన అగ్నివీర్లందరికీ సాయుధ దళాల్లో తమ సేవలను కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి తెలిపారు.

D

National | Published On Nov 4, 2026, 3.46 pm IST

Agniveers | అగ్నివీర్ల‌కు గుడ్‌న్యూస్‌.. ప‌ద‌వీ కాలాన్ని రెండేళ్లు పొడిగించిన కేంద్రం
Advertisement

Agniveers | అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్ అయిన అగ్నివీర్ల (Agniveers) ప‌ద‌వీ కాలాన్ని అదనంగా మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధ‌వారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అగ్నివీర్‌ల ప్రస్తుత 4 ఏళ్ల సర్వీస్‌ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించింది. ఈ విషయాన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి (N. S. Raja Subramani) అధికారికంగా ప్రకటించారు.

అగ్నిపథ్ నిబంధనల ప్రకారం.. 25 శాతం మంది అగ్నివీర్లను ప్రతిభ ఆధారంగా రెగ్యులర్ సర్వీసుల్లోకి తీసుకుంటారు. మిగిలిన 75 శాతం మంది నాలుగేళ్ల స‌ర్వీస్ త‌ర్వాత అగ్నిపథ్‌ పథకం నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. అయితే, కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న తాజా నిర్ణ‌యంతో 75 శాతం మంది అగ్నివీర్లు త‌మ నాలుగేళ్ల స‌ర్వీసు పూర్తి చేసుక‌న్న త‌ర్వాత మ‌రో రెండేళ్ల పాటూ అందులో కొన‌సాగే అవ‌కాశం ల‌భించిన‌ట్లైంది.

అంతేకాదు, ఈ అదనపు రెండేళ్ల పొడిగించిన కాలపరిమితి పూర్తయిన తర్వాత ఆసక్తి కలిగిన అగ్నివీర్లందరికీ సాయుధ దళాల్లో తమ సేవలను కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి తెలిపారు. నిర్దేశిత ఎంపిక నిబంధనల (Objective Selection Criteria) ప్రకారం సాయుధ దళాల్లో రెగ్యులర్ సైనికులుగా చేర్చుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ పొడిగించిన రెండేళ్ల కాలంలో అగ్నివీర్లకు మెరుగైన జీతభత్యాలు (Enhanced Pay Package) కూడా అందించనున్న‌ట్లు చెప్పారు.

2022లో అగ్నివీర్ ప‌థ‌కం ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తొలి బ్యాచ్‌కు చెందిన సుమారు 18,000 మంది అగ్నివీర్లు నాలుగేళ్ల ప‌ద‌వీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. 2026 నవంబర్-డిసెంబర్ నాటికి వారి ప‌ద‌వీకాలం ముగియనుంది. ఈ నేప‌థ్యంలోనే కేంద్రం నుంచి ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో అగ్నివీర్లకు మరింత ఊరట లభించిన‌ట్లైంది.

Also Read..

స‌మాధానాలు లేకే.. దిమాగీ న‌క్స‌ల్ నినాదాన్ని ఎత్తుకున్నారు : మోదీ, షాపై ఖ‌ర్గే విమ‌ర్శ‌లు

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌పై FIR నమోదు

ఏఐ, క్వాంటం, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్లు.. ఇవే ఫ్యూచర్

ట్యాగ్స్:

Agnipath SchemeAgniveersCDS N. S. Raja SubramaniPm ModiUnion Cabinet
Advertisement
Advertisement