త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Dasoju Sravan | జీవో నెం 14ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాలి

MLC Dasoju Sravan | బీసీ ఆత్మ‌గౌర‌వ భ‌వ‌నాల నిర్మాణం, నిర్వ‌హ‌ణ‌పై జారీ చేసిన బీసీ వ్య‌తిరేక‌, ఫ్యూడ‌ల్ ఆధిప‌త్య అహంకార‌, రాజ్యాంగ విరుద్ధ జీవో ఎంఎస్ నెం 14ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని, భ‌వ‌నాల నిర్వ‌హ‌ణ అధికారాన్ని బీసీ కుల స‌మాజాల‌కే అప్ప‌గించాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Nov 4, 2026, 3.48 pm IST

MLC Dasoju Sravan | జీవో నెం 14ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాలి
Advertisement

భ‌వ‌నాల నిర్వ‌హ‌ణ‌ను బీసీ కుల స‌మాజానికే అప్ప‌గించాలి
మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌కు ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ లేఖ

MLC Dasoju Sravan | త్రినేత్ర న్యూస్ : బీసీ ఆత్మ‌గౌర‌వ భ‌వ‌నాల నిర్మాణం, నిర్వ‌హ‌ణ‌పై జారీ చేసిన బీసీ వ్య‌తిరేక‌, ఫ్యూడ‌ల్ ఆధిప‌త్య అహంకార‌, రాజ్యాంగ విరుద్ధ జీవో ఎంఎస్ నెం 14ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని, భ‌వ‌నాల నిర్వ‌హ‌ణ అధికారాన్ని బీసీ కుల స‌మాజాల‌కే అప్ప‌గించాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌కు ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ బ‌హిరంగ లేఖ రాశారు.

బీసీ ఆత్మ‌గౌర‌వ భ‌వ‌నాల‌పై స‌ర్కారు పెత్త‌నం అసమంజ‌స‌మైన‌ది. బీసీ ఆత్మ‌గౌర‌వ భ‌వ‌నాలు కేవ‌లం ఇటుక‌లు, సిమెంట్‌తో క‌ట్టిన క‌ట్ట‌డాలు కావు. శ‌తాబ్దాలుగా అవ‌మానాలు, అణ‌చివేత‌లు ఎదుర్కొన్న వృత్తి కులాల‌కు రాజ‌ధాని న‌గ‌రంలో సొంత గూడు, సొంత గొంతు ఉండాల‌నే ఆకాంక్ష‌కు అవి ప్ర‌తీక‌లు. ఈ ఆకాంక్ష‌ను నెర‌వేర్చ‌డానికి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌ల‌తో ఈ ఆత్మ‌గౌర‌వాల భ‌వ‌నాల ప‌థ‌కం పుట్టింది. స్వ‌రాష్ట్రంలో కేసీఆర్ నాయ‌క‌త్వంలోని ప్ర‌భుత్వం రంగారెడ్డి, మేడ్చ‌ల్ జిల్లాల్లో 87 ఎక‌రాల 30 గుంట‌ల‌(రూ. 4 వేల కోట్ల‌) విలువైన భూమిని కేటాయించి, భ‌వ‌న నిర్మాణ కోసం రూ. 95.25 కోట్లు మంజూరు చేసి, 41 బీసీ, ఇత‌ర కులాల‌కు ఆత్మ‌గౌర‌వ భ‌వ‌నాల‌ను మంజూరు చేసింద‌ని దాసోజు శ్ర‌వ‌ణ్ గుర్తు చేశారు.

ఆ నిర్ణయం వెనుక కేసీఆర్ ఏకైక లక్ష్యం బీసీ కులాల సాధికారత, వారి స్వయంపాలన, ఆత్మగౌరవ పరిరక్షణ. తమ భవనాన్ని తామే నిర్వహించుకుంటూ, తమ సంస్కృతిని, తమ మహనీయుల స్మృతిని తామే కాపాడుకునే వేదికను ఆ పథకం బీసీలకు అందించింది. కానీ, దురదృష్టం, మీ ప్రభుత్వం , కేసీఆర్ మహోన్నత స్ఫూర్తిని ధ్వంసం చేస్తోంది. బీసీ సమాజాలకు స్వయంపాలన కోసం అందించిన భవనాలను జీ.ఓ.14 ద్వారా సర్కారు గుప్పిట్లోకి లాక్కుంటోంది. ఇది కేవలం ఒక పరిపాలనా ఉత్తర్వు కాదు.. బీసీల స్వయంపాలనపై), ఆత్మగౌరవంపై జరుగుతున్న ఆధిపత్య వర్గాల పాశవిక దాడి అని ఎమ్మెల్సీ దాసోజు పేర్కొన్నారు.

అమలులో "కొన్ని అడ్డంకులు" ఎదురయ్యాయని జీవో ఎంఎస్ నెం.14 స్వయంగా అంగీకరించింది. ఆ అడ్డంకులను తొలగించాల్సిన ప్రభుత్వం, దానికి బదులుగా భవనాలపై పూర్తి నియంత్రణను తన చేతుల్లోకి తీసుకుంది. కుల సంఘాలను, వారి నాయకులను, భవన నిర్వహణ కమిటీ సభ్యులను “నిర్వాహకులుగా” కాకుండా కేవలం "కాపలాదారులుగా" మార్చింది. ఇది ఆత్మగౌరవ భవనాల జీ.ఓ. కాదు, బీసీల ఆత్మగౌరవాన్ని అదుపులో పెట్టే ఫ్యూడల్, ఆధిపత్య అహంకార బీసీ వ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ జీ.ఓ అని మండిప‌డ్డారు.

అక్టోబర్ 27న జరిగిన సమీక్షలో 38 ఆత్మగౌరవ భవనాల ఉత్తర్వులను వేగవంతం చేయాలని మీరే అధికారులను ఆదేశించారు. రెండు రోజుల్లో వెలువడిన ఈ జీవో మాత్రం వేగాన్ని కాదు, అక్రమ పెత్తనాన్ని తెచ్చింది. పైగా 13.10.2026 న ఇచ్చిన జీ.ఓ.ఎంఎస్.నెం.13 ను కేవలం 16 రోజుల్లోనే రద్దు చేయడం, ఈ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని, కుల సంఘాలను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటోందని తేటతెల్లం చేస్తోంది అని దాసోజు శ్ర‌వ‌ణ్ పేర్కొన్నారు.

ట్యాగ్స్:

BC BuildingsCM Revanth ReddyCongress GovtDasoju SravanGO 14KCRTelangana
Advertisement
Advertisement