Ponnam Prabhakar | అమిత్ షా యాత్ర మోదీపై వ్యతిరేకతకు సంకేతం కాదా?
Ponnam Prabhakar | అమిత్‌షాలాంటోడే మోదీ ప్రభుత్వం పట్ల ఒకవంతు నారాజుగనే ఉన్నట్టున్నడని.. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని (Democrasy) రక్షించమని కేంద్ర హోంశాఖ మంత్రే స్వయంగా యాత్ర చేస్తుండంటే అది తమ విజయమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు.
- మోదీ పాలనపై ఆయన నారాజుగనే ఉన్నట్టున్నడు
- ఎందుకంటే ఆయనే స్వయంగా ప్రజాస్వామ్య యాత్ర చేస్తుండంటే అది మా విజయమే
- దేశంల బర్లు, గొర్రెలకు లెక్కలున్నయ్.. మమ్మల్ని ఎందుకు లెక్క పెట్టరు?
- మంత్రి పొన్నం ప్రభాకర్ సూటి ప్రశ్నలు
Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్: అమిత్‌షా లాంటోడే మోదీ ప్రభుత్వం పట్ల ఒకవంతు నారాజుగనే ఉన్నట్టున్నడని.. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని (Democrasy) రక్షించమని కేంద్ర హోంశాఖ మంత్రే స్వయంగా యాత్ర చేస్తుండంటే అది తమ విజయమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. సాక్షాత్తు హోంమంత్రే యాత్ర చేస్తుంటే ఇది దేనికి సంకేతమని ప్రశ్నించారు. మోదీ పరిపాలన మీద వ్యతిరేకతకు, అప్రజాస్వామ్య పాలనకు, మన్‌కీ బాత్ తప్పా జన్‌కీ బాత్ వినని ప్రధానమంత్రి వైఖరికి వ్యతిరేకంగా కాదా అని నిలదీశారు. ఈమేరకు శుక్రవారం ఆయన గాంధీ భవన్‌లో మాట్లాడారు.
ఏ ఉద్దేశం కోసం పర్యటన చేస్తున్నరో. మేం అంటున్నదేంది.. ఓటును రక్షించమని. రెండు ఒకటే కదా. మేం వెరీ హ్యాపీ. మా రాహుల్ గాంధీ మూవ్‌మెంట్‌కు మద్దతుగా అమిత్‌షా హైదరాబాద్‌లో ర్యాలీ తీస్తున్నడు.. వెల్‌కం. భారతదేశం మొత్తం ప్రజాస్వామ్యం కావాలని మోదీ గ్రహించాలే. ఆ పార్టీని, ఈ పార్టీని చీల్చి రకరకాల కుట్రలు చేస్తున్నరు. పార్లమెంటు నడుస్తుంటే ప్రధాని విదేశాలు తిరుగుతడు. పార్లమెంటుకు రానీ అమిత్‌షా ఏం జవాబు చెప్తరని అడుగుతున్నా. హైదరాబాద్‌లో నిరసన చేపట్టే ముందు అమిత్ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
ఏ కోర్టుకు వెళ్లినా లెక్కలు అడుగుతున్నరు
తెలంగాణకు అమిత్‌షా వచ్చేనాడు అధికారికంగా లేఖ రాస్తున్నం. తెలంగాణలోని అన్ని పార్టీల్లో ఉన్న బీసీ నాయకులకు సమావేశం కావడానికి అవకాశం ఇవ్వు. జన గణనలో కుల గణన ఉండాల్సిందే. ఎందుకు పెట్టవో చెప్పు. గతంలో నవంబర్ 1న బీహార్ ఎన్నికలకు ముందు మీరు ప్రకటించారు. ఏ న్యాయస్థానానికి వెళ్లినా ప్రామాణిక లెక్కలు ఉన్నయా అని అడుగుతున్నరు. 50 శాతం దాటొద్దని అంటున్నరు. దేశంలో బర్లు, గొర్రెలకు లెక్కలున్నయ్. మాకు లెక్క ఎందుకు ఉండదు? మమ్మల్ని ఎందుకు లెక్క పెట్టవ్? ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటమే కాంగ్రెస్ లక్ష్యం.
ఈటల పాదయాత్రలో యాడ్ చేసుకోమని కోరుతున్నా
తెలంగాణ బీజేపీ నాయకులకు ఏమాత్రం చీము నెత్తురు ఉన్నా.. ముఖ్యంగా లక్ష్మణ్ మొన్నటిదాకా ఆల్ ఇండియా బీసీ సెల్ అధ్యక్షుడు. బండి సంజయ్ కేంద్రమంత్రి. డంప్‌యార్డు మీద పాదయాత్ర చేస్తున్న ఈటల రాజేందర్‌ను ఈ కుల గణనను అందులో యాడ్ చేసుకోవాలని కోరుతున్నా. ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీ జనం ఎంతుందో తెలవాల్సి ఉంది. ఇవి తెల్సినప్పుడే చట్టాల్లో, రిజర్వేషన్లలో మార్పులు చేసుకోగలుగుతం. లేదంటే ఏం చేసినా అసాధ్యమే అయితది అని పొన్నం వ్యాఖ్యానించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao Letter to Uttam Kumar Reddy | మల్లన్న సాగర్ వద్ద అక్రమ బ్లాస్టింగ్ పనులు ఆపండి.. ఉత్తమ్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ
అక్టోబర్ 30, 2026

Future City | జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు!
అక్టోబర్ 30, 2026

DA, DR hike | విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. డీఏ, డీఆర్ పెంపు
అక్టోబర్ 30, 2026
తాజావార్తలు
- ●Nora Fatehi | మనీలాండరింగ్ కేసులో నోరా ఫతేహీకి కోర్టు సమన్లు!
- ●Pooja Hegde | ఆగిపోయిందనుకున్న సినిమా సెట్స్‌పైకి - వయసులో ఐదేళ్లు చిన్న హీరోతో పూజా హెగ్డే రొమాన్స్
- ●Harish Rao Letter to Uttam Kumar Reddy | మల్లన్న సాగర్ వద్ద అక్రమ బ్లాస్టింగ్ పనులు ఆపండి.. ఉత్తమ్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ
- ●Future City | జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు!
- ●Nokia 2360 Flip | ఒకప్పటి క్రేజీ నోకియా ఫ్లిప్ ఫోన్.. మళ్లీ లాంచ్ అయింది..
- ●Ott Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే - తెలుగు సినిమాలు హైలైట్...

Nora Fatehi | మనీలాండరింగ్ కేసులో నోరా ఫతేహీకి కోర్టు సమన్లు!

Pooja Hegde | ఆగిపోయిందనుకున్న సినిమా సెట్స్‌పైకి - వయసులో ఐదేళ్లు చిన్న హీరోతో పూజా హెగ్డే రొమాన్స్

Harish Rao Letter to Uttam Kumar Reddy | మల్లన్న సాగర్ వద్ద అక్రమ బ్లాస్టింగ్ పనులు ఆపండి.. ఉత్తమ్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ

Future City | జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు!



