త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | మియాపూర్ భూములు అమ్మేస్తామంటే ఊకోం

Ramchandar Rao | సుప్రీంకోర్టు తీర్పు వ‌చ్చిందో లేదో వెంట‌నే మియాపూర్ భూములు (Miyapur Lands) వేలం వేస్తామ‌ని చెప్ప‌డం కాంగ్రెస్ ప్ర‌భుత్వ తీరు మంచిది కాద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు (Ramchandar Rao) మండిప‌డ్డారు.

S

Telangana | Published On Oct 30, 2026, 6.34 pm IST

Ramchandar Rao | మియాపూర్ భూములు అమ్మేస్తామంటే ఊకోం
Advertisement
  • తీర్పొచ్చిన కొద్దిసేపు గూడా ఆగకుండా వేలం వేస్తామంటున్న‌రు
  • ఇది రియ‌ల్ ఎస్టేట్ ప్ర‌భుత్వం కాబ‌ట్టే ఇట్లా మాట్లాడుతున్న‌రు
  • దీన్ని మేం ఖండిస్తున్నం
  • రేవంత్ ప్ర‌భుత్వంపై బీజేపీ రాంచంద‌ర్‌రావు ఫైర్‌

Ramchandar Rao | త్రినేత్ర న్యూస్: సుప్రీంకోర్టు తీర్పు వ‌చ్చిందో లేదో వెంట‌నే మియాపూర్ భూములు (Miyapur Lands) వేలం వేస్తామ‌ని చెప్ప‌డం కాంగ్రెస్ ప్ర‌భుత్వ తీరు మంచిది కాద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు (Ramchandar Rao) మండిప‌డ్డారు. ఇది కాంగ్రెస్ దివాళాకోరుతనానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. ఇది రియ‌ల్ ఎస్టేట్ ప్ర‌భుత్వం కాబ‌ట్టే ఇలా మాట్లాడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈమేర‌కు శుక్ర‌వారం ఆయ‌న మాట్లాడారు. హైదరాబాద్‌లో అత్యంత విలువైన 550 ఎకరాలపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామ‌న్నారు.

ఇంచు పోయినా అడ్డుకుంటం

తీర్పు వచ్చిన వెంటనే వేలం వేసి అమ్మేస్తామనడం కాంగ్రెస్ దిక్కుమాలిన వైఖరికి నిదర్శనం. నాడు కేసీఆర్ బంధుప్రీతి.. నేడు రేవంత్ దోపిడీ నీతి. ప్రజల ఆస్తులను కాజేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ ప‌డుతున్నాయి. వేలం పాట ముసుగులో అనుచరులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారు. ఒక్క ఇంచు పోయినా ఊరుకునేది లేదు. క్షేత్రస్థాయిలో అడ్డుకుంటాం.

గ‌త ప్ర‌భుత్వం ప్రైవేటు వ్య‌క్తుల‌కు ఈ భూముల‌ను ధారాద‌త్తం చేయాల‌నుకుంది. ప్ర‌భుత్వ న్యాయ‌వాదులు, మా ప్ర‌య‌త్నం వ‌ల్ల ఈరోజు తీర్పు వ‌చ్చింది. తీర్పు వ‌చ్చిన కొద్దిసేపు గూడా ఆగ‌కుండా వెంట‌నే వేలం పాట వేస్తం.. అమ్మేస్తం అని మాట్లాడుతున్న‌రు. ఇది రియ‌ల్ ఎస్టేట్ ప్ర‌భుత్వం కాబ‌ట్టి ఇట్లా మాట్లాడుతున్న‌రు. ఈ ఆలోచ‌న‌లు మంచివి కావు. భూములు అమ్మి ప్ర‌భుత్వాలు న‌డిపితే.. రేపు ఇంకా క‌ష్ట‌కాలం వ‌చ్చినప్పుడు ఏం చేస్తురు? ఎలా న‌డిపిస్త‌రు? భూముల‌మ్మి ప్ర‌భుత్వం న‌డ‌ప‌డం అనేది మంచి ఒర‌వ‌డి కాదు. దీన్ని బీజేపీ ఖండిస్తున్న‌ది అని రాంచంద‌ర్‌రావు తేల్చి చెప్పారు.

ట్యాగ్స్:

BiddingCongress GovtMiyapur LandsRamchandar RaoSupreme Court JudgementTelangana
Advertisement
Advertisement