త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Elevator | లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారులు.. బాలిక ఎలా కాపాడిందో చూడండి

Elevator | లిఫ్ట్‌ (Elevator)లో ఇరుక్కుపోయిన ఇద్ద‌రు చిన్నారుల‌ను (children stuck in the elevator) ఓ బాలిక (Young Girl) సమయస్ఫూర్తితో ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా కాపాడింది.

D

National | Published On Feb 21, 2026, 1.57 pm IST

Elevator | లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారులు.. బాలిక ఎలా కాపాడిందో చూడండి
Advertisement

Elevator | లిఫ్ట్‌ (Elevator)లో ఇరుక్కుపోయిన ఇద్ద‌రు చిన్నారుల‌ను (children stuck in the elevator) ఓ బాలిక (Young Girl) సమయస్ఫూర్తితో ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ వీడియో ప్ర‌కారం.. ఓ బాలిక ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి లిఫ్ట్ వ‌ద్ద‌కు వెళ్లింది. ఓ చిన్నారి లిఫ్ట్ లోప‌ల ఉండ‌గా.. మరో చిన్నారి, బాలిక ఇద్ద‌రూ లిఫ్ట్ డోర్ల‌కు అడ్డంగా నిల్చొని ఉన్నారు.

కాసేప‌టికి ఆ డోర్లు మూసుకోవ‌డం ప్రారంభ‌మైంది. అప్ర‌మ‌త్త‌మైన బాలిక డోర్లు క్లోజ్ అవ్వ‌కుండా ఆపేందుకు ప్ర‌య‌త్నించింది. అయినా అవి క్లోజ్ అవుతుండ‌టంతో కాలు అడ్డుపెట్టింది. స్థానికుల‌ను పిలిచింది. బాలిక కేకలు విని అక్క‌డికి చేరుకున్న స్థానికులు తీవ్రంగా శ్ర‌మించి డోర్లు ఓపెన్ చేశారు. దీంతో ఆ బాలిక లిఫ్ట్‌లోప‌లికి వెళ్లి చిన్నారుల‌ను సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చింది. బాలిక స‌మ‌య‌స్ఫూర్తితో పెద్ద ప్ర‌మాదం త‌ప్పిన‌ట్లైంది. ఇందుకు సంబందించిన వీడియో వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన నెటిజ‌న్లు బాలిక ధైర్య‌సాహ‌సాల‌ను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. బ్రేవ్ గ‌ర్ల్ అంటూ ప్ర‌శంసిస్తున్నారు.

https://x.com/divya_gandotra/status/2025083911853011082

Advertisement

తాజావార్తలు

Advertisement