త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahatma Gandhi | మ‌హాత్ముడికి ఘ‌న నివాళులు

Mahatma Gandhi | జాతిపిత మ‌హాత్మాగాంధీ (Mahatma Gandhi) జ‌యంతి నేడు. ఈ సంద్భంగా రాజ‌ధానిలోని రాజ్‌ఘాట్ (Raj Ghat) వ‌ద్ద ప‌లువురు ప్ర‌ముఖులు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.

D

National | Published On Oct 2, 2026, 11.12 am IST

Mahatma Gandhi | మ‌హాత్ముడికి ఘ‌న నివాళులు
Advertisement

Mahatma Gandhi | త్రినేత్ర న్యూస్ : జాతిపిత మ‌హాత్మాగాంధీ (Mahatma Gandhi) జ‌యంతి నేడు. ఈ సంద్భంగా రాజ‌ధానిలోని రాజ్‌ఘాట్ (Raj Ghat) వ‌ద్ద ప‌లువురు ప్ర‌ముఖులు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము (President Droupadi Murmu ), ఉప‌రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్‌, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే, ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్య‌మంత్రి రేఖా గుప్తా స‌హా ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు, ప్ర‌ముఖులు మ‌హాత్ముడి స్మార‌కం వ‌ద్ద పుష్పాంజ‌లి ఘ‌టించారు.

మ‌రోవైపు నేడు దేశ వ్యాప్తంగా గాంధీ జ‌యంతి వేడుక‌లు, స్వ‌చ్ఛత‌ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఢిల్లీలో నిర్వ‌హించిన స్వ‌చ్ఛ‌త కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి జేపీ న‌డ్డా పాల్గొన్నారు. చీపురు ప‌ట్టి క‌ర్త‌వ్య భ‌వ‌న్ ప‌రిస‌రాల‌ను శుభ్రం చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ పారిశుద్ధ్య కార్మికుల‌తో కాసుపు ముచ్చ‌టించారు.

Also Read..

గాంధీజీ అనుస‌రించిన స‌త్యాగ్ర‌హ పంథా నేటి యువ‌త‌రానికి ఆచ‌ర‌ణీయం: కేసీఆర్

44 ఏండ్ల ఆధిప‌త్యానికి తెర‌.. రిక‌ర్వ్ ఆర్చ‌రీలో ప్ర‌పంచ చాంపియ‌న్‌ను మ‌ట్టిక‌రిపించిన భార‌త్‌

విమానం టేకాఫ్ అవుతుండ‌గా.. ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు యత్నించిన ప్ర‌యాణికుడు

Advertisement
Advertisement