త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nageshwar Rao | రాజ‌కీయాల్లోకి సీబీఐ మాజీ డైరెక్ట‌ర్‌.. ఎస్ఎస్‌పీ జాతీయ‌ అధ్య‌క్షుడిగా బాధ్య‌తలు

Nageshwar Rao | సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ ఎం నాగేశ్వ‌ర‌రావు (Nageshwar Rao) రాజ‌కీయాల్లో అడుగుపెట్టారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాశీ (Varanasi) వేదిక‌గా సర్వజన సనాతన పార్టీ (SSP) జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

G

National | Published On Oct 4, 2026, 7.54 am IST

Nageshwar Rao | రాజ‌కీయాల్లోకి సీబీఐ మాజీ డైరెక్ట‌ర్‌.. ఎస్ఎస్‌పీ జాతీయ‌ అధ్య‌క్షుడిగా బాధ్య‌తలు
Advertisement

Nageshwar Rao | త్రినేత్ర న్యూస్‌: సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ ఎం నాగేశ్వ‌ర‌రావు (Nageshwar Rao) రాజ‌కీయాల్లో అడుగుపెట్టారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాశీ (Varanasi) వేదిక‌గా సర్వజన సనాతన పార్టీ (SSP) జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు భద్రత, శాంతిభద్రతలు, పరిపాలన రంగాలలో ఐపీఎస్ అధికారిగా సేవలందించిన ఆయ‌న `ఆధునిక భార‌త్‌.. స‌నాత‌న మూలాల‌తో` అనే నినాదంతో త‌న‌ రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. దేశ పునర్నిర్మాణం కేవలం పరిపాలనా సంస్కరణలతోనే సాధ్యం కాదన్నారు. దేశం త‌న నాగ‌రిక‌త మూలాల‌ను కోల్పోకుండా, ఆధునిక అభివృద్ధివైపు ప‌య‌నించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. సనాతన మూలాలను కాపాడుకుంటూ ఆధునిక సాంకేతిక, ఆర్థిక అభివృద్ధి సాధించడమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.

సనాతన ధర్మం అనేది కేవలం ఒక పూజా విధానం మాత్రమే కాదని.. సత్యం, ధర్మం, కర్తవ్యం, కరుణ, న్యాయం, ఆత్మనిగ్రహం, ప్రకృతి, కుటుంబం, సమాజం, ప్రజా సంక్షేమంపై ఆధారపడిన ఒక జీవన విధానమని చెప్పారు. త‌మ పార్టీ విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, నాగరికత పునరుద్ధరణ అనే నాలుగు మూల‌స్తంభాల‌పై ఆధార‌ప‌డి ప‌నిచేస్తుంద‌ని చెప్పారు.

సనాతన మూలాలతో ఆధునిక భారతదేశం

గతంలోకి వెళ్ల‌డం త‌మ పార్టీ ఉద్దేశం కాదని, సాంస్కృతిక మూలాలను గౌరవిస్తూనే ఆధునిక భారతదేశాన్ని (Modern India) నిర్మించడమే లక్ష్యమనిచెప్పారు. సాంకేతిక, ఆర్థిక అభివృద్ధితో పాటు సాంస్కృతిక గుర్తింపును స‌మ‌న్వ‌యం చేయాల‌ని పార్టి భావిస్తున్న‌ద‌ని చెప్పారు. సనాతన ధర్మాన్ని (Sanatan Roots) కేవలం ఎన్నికల చిహ్నంగా చూడకూడదని.. విద్య, వైద్యం, ఉపాధి, పాలన, సంస్కృతి, సామాజిక జీవితంలో ప్రతిబింబించే విలువల సమాహారంగా భావించాలన్నారు. దేవాలయాలు, పుణ్యక్షేత్రాలను కేవలం పూజా స్థలాలుగానే కాకుండా భారతీయ నాగరికతకు సజీవ సాక్ష్యాలుగా రక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

తమ పార్టీ విధానం ఏ కులం లేదా వర్గానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. సనాతన అనేది ఎవరికీ వ్యతిరేకం కాదని, సమాజంలో విభజనలు సృష్టించడం కాకుండా అందరి సంక్షేమం కోసం పని చేయడమే పార్టీ ధ్యేయమని వివరించారు. కాశీని తన రాజకీయ ప్రయాణానికి ఆరంభ బిందువుగా అభివర్ణించిన ఆయ‌న‌.. ఆధునికత, నాగరికత మూలాలకు మధ్య సరైన సమతుల్యతను సాధించడమే భారతదేశ లక్ష్యం కావాలన్నారు.

Advertisement
Advertisement