త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Appropriation Bill | లోక్‌సభలో నేడు ద్రవ్య వినిమయ బిల్లు.. ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

పలు ప్రభుత్వ సేవల కోసం అవసరమైన ఆర్థిక కేటాయింపులను ఆమోదించడం కోసం ఈ బిల్లను ప్రవేశపెట్టి సభ అనుమతిని కేంద్ర మంత్రి నిర్మల కోరనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక కేటాయింపులను ఈ బిల్లులోని అంశాల ప్రకారం వివిధ ప్రభుత్వ సేవలకు కేంద్రం కేటాయించనుంది.

J

National | Published On Dec 15, 2025, 9.20 am IST

Appropriation Bill | లోక్‌సభలో నేడు ద్రవ్య వినిమయ బిల్లు.. ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
Advertisement

Appropriation Bill | ప్రస్తుతం పార్లమెంట్‌లో శీతాకాల సమావేశాలు నడుస్తున్నాయి. ఈనేపథ్యంలో పార్లమెంట్‌లో రోజుకో అంశం మీద చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు వందేమాతరం 150వ వార్షికోత్సవం, ఎయిర్‌లైన్స్ ధరల నియంత్రణ, ఇలా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చలో ఉన్న అంశాల మీద పార్లమెంట్ సభ్యులు చర్చించారు. సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యయ అవసరాలను తీర్చడానికి, అదనపు నిధుల చెల్లింపు, వినియోగం కోసం ఈ బిల్లును సభ్యుల ముందుకు తీసుకురానున్నారు.

డిసెంబర్ 15న సోమవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశం జరుగనుంది. ఇందులో ప్రశ్నోత్తరాలు, కమిటీ నివేదికలు, పేపర్స్ సబ్మిట్, ఇతర అంశాలు అన్నింటికి సంబంధించిన పూర్తి అజెండాను సభలో చర్చించనున్నారు.

సభ అనుమతి కోరనున్న కేంద్ర మంత్రి

తాజావార్తలు

Advertisement