త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

టారిఫ్‌లతో మమ్మల్ని భయపెట్టలేరు.. నిర్మలా సీతారామన్ వార్నింగ్

కొన్ని దేశాలు బహిరంగంగానే టారిఫ్‌లను పెంచుతున్నాయి. దీన్ని ఎందుకు ఎవ్వరూ ప్రశ్నించడం లేదు. అది నార్మల్‌గా మారింది. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ ఎప్పుడూ వెనుకడుగు వేయదు. తన దేశీయ పరిశ్రమలను కాపాడుకోవడం కోసమే భారత్ చర్యలు తీసుకుంటుంది తప్పితే టారిఫ్‌లను ఆయుధంగా ఏనాడూ భారత్ వాడదు.. అని నిర్మలా స్పష్టం చేశారు.

J

Business | Published On Dec 17, 2025, 3.26 pm IST

టారిఫ్‌లతో మమ్మల్ని భయపెట్టలేరు.. నిర్మలా సీతారామన్ వార్నింగ్
Advertisement

డొనాల్డ్ ట్రంప్ యూఎస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైనప్పటి నుంచి భారత్, యూఎస్ ట్రేడ్ విషయంలో టారిఫ్‌లను ఆయుధంగా మార్చుకొని భారత్‌పై పగ తీర్చుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్‌ నుంచి యూఎస్‌కి ఎగుమతి అవుతున్న ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్ వేసిన ట్రంప్, యూఎస్ వీసా విషయంలో కూడా పలు కొర్రీలు పెడుతున్నాడు. మరోవైపు మెక్సికో కూడా ఇండియాపై టారిఫ్‌ను ప్రకటించింది. ఈనేపథ్యంలో ప్రపంచ వాణిజ్యంలో వస్తున్న మార్పులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. టైమ్స్ నెట్‌వర్క్ నిర్వహించిన ఇండియా కాన్‌క్లేవ్ 2025లో ఆమె మాట్లాడారు.

ప్రపంచ వాణిజ్యాన్ని టారిఫ్‌లను అడ్డు పెట్టుకొని, దాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఆచీ తూచీ వ్యవహరించాలి. జాగ్రత్తగా చర్చలు జరపాలి. ప్రపంచ వాణిజ్యం స్వేచ్ఛగా లేదు. న్యాయబద్దంగా లేదు. టారిఫ్‌లను ఆయుధంగా మార్చుకునే సంస్కృతి పెరుగుతోంది. అందుకే మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. మన ఆర్థిక శక్తిని పెంచుకుంటూ ముందుకెళ్లాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

తాజావార్తలు

Advertisement