Ragging | బెల్టులతో కొట్టి హింసించారు.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్‌పై సీనియర్స్ ర్యాగింగ్
Ragging | ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న డూన్ (Dehradun) ప్రభుత్వ మెడికల్ కాలేజీలో (Government Medical College) ర్యాగింగ్ (Ragging) కలకలం సృష్టించింది.
త్రినేత్ర.న్యూస్: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న డూన్ (Dehradun) ప్రభుత్వ మెడికల్ కాలేజీలో (Government Medical College) ర్యాగింగ్ (Ragging) కలకలం సృష్టించింది. ఈ నెల 12న కాలేజీలో జూనియర్ విద్యార్థిని సీనియర్లు బెల్టులతో కొట్టి (physical assault) హింసించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ నెల 13న సీనియర్లు తనను కొట్టారని, ర్యాగింగ్ చేశారంటూ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి (MBBS Student) ఫిర్యాదు చేశాడు. 2023-24 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు తనను వేధించారంటూ అందులో పేర్కొన్నాడు. ముందు రోజు (జనవరి 12) ఈ ఘటన జరిందని తెలిపాడు. ఇలా ఫిర్యాదు చేసినందుకు తనపై ప్రతీకారం తీర్చుకుంటారేమోనని భయపడుతున్నాని చెప్పాడు. ఈ సంఘటన తనను మానసికంగా, శారీరకంగా తీవ్రంగా కలచివేసిందని వెల్లడించారు.
ఈ ఘటనపై కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ గీతా జైన్ స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే కాలేజీ క్రమశిక్షణా కమిటీ నిందితుల నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసుకుందని వెల్లడించారు. ర్యాగింగ్ జరిగింది నిజమేనని తేలితే వారిని ఎట్టిపరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదన్నారు. కాగా, బాధ్యులుగా తేలిన విద్యార్థులను కాలేజీ నుంచి బహిష్కరిస్తామని కాలేజీ యాజమాన్యం వెల్లడించింది.
Dehradun | An incident of ragging and assault by senior students on junior students has come to light at Government Doon Medical College (Patel Nagar, Dehradun). Juniors were allegedly beaten with belts.
Medical College Principal Dr Geeta Jain says that the Anti-Ragging…
— ANI (@ANI) January 18, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Legislative Council | మండలి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సస్పెన్షన్..
మార్చి 30, 2026

Road Accident | హయత్ నగర్లో ఘోర ప్రమాదం.. ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
డిసెంబర్ 15, 2025

Harish Rao | మీ వల్లే డాక్టర్ అయ్యాను సర్.. హరీశ్‌రావు కారును 20 కి.మీ. ఛేజ్ చేసి థ్యాంక్స్ చెప్పిన యువతి
డిసెంబర్ 7, 2025
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



