Murder | చదువుకోరా అన్నందుకు.. తండ్రిని ముక్కలు ముక్కలుగా నరికేశాడు..
Murder | వైద్య వృత్తిలో రాణించాలని చెప్పిన ఓ తండ్రిని తనయుడు కత్తితో ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటు చేసుకుంది.
Murder | త్రినేత్ర.న్యూస్ : తన కొడుకు గొప్పగా చదువుకోవాలి.. ఓ డాక్టరో.. ఓ ఇంజినీరో.. కావాలని ప్రతి తండ్రి కలలు కంటుంటాడు. కలలు కనడమే కాదు.. అందుకు తగ్గట్టు తమ పిల్లలను ప్రేరేపిస్తుంటారు. అన్ని వనరులను సమకూర్చుతుంటారు. కొంత మంది పిల్లలు తండ్రి మాట విని గొప్పగా ఎదుగుతారు. ఇంకొందరేమో పెడచెవిన పెట్టి.. తిరుగుబాటు చేస్తుంటారు. చివరకు తండ్రి అని కూడా చూడకుండా అంతమొందిస్తారు. అయితే వైద్య వృత్తిలో రాణించాలని చెప్పిన ఓ తండ్రిని తనయుడు కత్తితో ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. లక్నోకు చెందిన మన్వేంద్ర సింగ్(49) ఫార్మా రంగంతో పాటు లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే కుమారుడిని గొప్పగా చదివించాలని, వైద్య వృత్తిలో సెటిల్ చేయాలని అనుకునేవాడు. ఈ నేపథ్యంలో కుమారుడు అక్షత్ ప్రతాప్ సింగ్‌కు సూచన చేసేవాడు. వైద్య వృత్తికి సంబంధించిన ప్రవేశ పరీక్షలు రాయమని ఆదేశించేవాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకునేవి.
శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు మరోసారి తండ్రీకొడుకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన కుమారుడు.. తన తండ్రిని రైఫిల్‌తో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత మూడో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కు డెడ్‌బాడీని తీసుకొచ్చాడు.
ముక్కలు ముక్కలుగా నరికేశాడు..
ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేసేందుకు తండ్రి మృతదేహాన్ని తన సోదరి కళ్ల ముందే ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఆ శరీర భాగాలను ప్లాస్టిక్ బ్యాగుల్లో నింపి నిర్మానుష్య ప్రాంతాల్లో విసిరేశాడు.
డ్రమ్ములో మొండెం
శరీర భాగాలన్నింటినీ బయటకు తీసుకెళ్లినప్పటికీ.. మొండెంను మాత్రం ఇంట్లోనే ఉంచాడు అక్షత్ ప్రతాప్ సింగ్. మొండెంను ఇంట్లోని ఓ పాత డ్రమ్ములో దాచి పెట్టాడు.
పోలీసుల విచారణలో మొండెం కీలకం
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులను అక్షత్ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. పోలీసులు ఇంటిని జల్లెడ పట్టగా, ఓ పాత డ్రమ్ముల్లో మొండెం లభ్యమైంది. దీంతో మరింత లోతుగా విచారించడంతో.. తానే తండ్రిని చంపినట్లు అక్షత్ అంగీకరించాడు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






