త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET Re-Exam 2026 | “మా మానసిక క్షోభకు బాధ్యులెవరు?”.. నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్ల వద్ద విద్యార్థులు, పేరెంట్స్ కన్నీటి కష్టాలు!

పేపర్ లీక్ కారణంగా రద్దైన నీట్ (NEET) పరీక్షను మళ్లీ రాయడంపై విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెంటర్ల వద్ద అభ్యర్థులు, తల్లిదండ్రుల కన్నీటి కష్టాలు.

J

National | Published On Jun 21, 2026, 5.21 pm IST

NEET Re-Exam 2026 | “మా మానసిక క్షోభకు బాధ్యులెవరు?”.. నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్ల వద్ద విద్యార్థులు, పేరెంట్స్ కన్నీటి కష్టాలు!
Advertisement
  • దేశవ్యాప్తంగా 23 లక్షల మంది అభ్యర్థులతో నీట్ (NEET) రీ-ఎగ్జామ్
  • మే 3న జరిగిన పరీక్ష రద్దు కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు
  • మళ్లీ పరీక్ష రాయాల్సి రావడంపై కొందరు అసహనం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు దీనిని సెకండ్ ఛాన్స్‌గా భావిస్తున్నారు
  • కోచింగ్ సెంటర్ల ఫీజులు, హాస్టల్ ఖర్చులతో ఆర్థికంగానూ నష్టపోయామని అభ్యర్థులు వాపోతున్నారు

NEET Re-Exam 2026 | త్రినేత్ర.న్యూస్ : దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) రీ-ఎగ్జామ్ ఈరోజు జరిగింది. అయితే, మే 3న జరిగిన పరీక్ష 'పేపర్ లీక్' కారణంగా రద్దు కావడంతో.. మళ్లీ పరీక్ష కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థుల్లో ఎక్కడా మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. తీవ్రమైన ఒత్తిడి, మానసిక క్షోభ, నిరాశ నడుమ వారు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

యాంగ్జైటీ.. నిరాశ.. కొద్దిపాటి ఆశ

హర్యానాలోని మహేందర్‌గఢ్‌కు చెందిన అనుష్క శర్మ పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ (KV) సెంటర్ బయట రివిజన్ నోట్స్ (Revision notes) తిరగేస్తూ కనిపించింది. "పేపర్ క్యాన్సిల్ అవ్వగానే నాలో యాంగ్జైటీ (Anxiety) పెరిగిపోయింది. అనారోగ్యానికి కూడా గురయ్యాను. కానీ ఇది నాకు మరో అవకాశం లాంటిది" అని చెప్పుకొచ్చింది. అయితే ఆమె తల్లి మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఇది ముమ్మాటికీ అన్యాయం. పిల్లల్ని కష్టపడి చదివించి, తీరా ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకొస్తే మోసం చేశారు. మా పిల్లలు పడుతున్న బాధ చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది" అని ఆవేదన చెందారు.

నమ్మకం సన్నగిల్లింది..

మరో అభ్యర్థిని శివానీ మౌర్య మాత్రం పాజిటివ్‌గా స్పందించారు. "నా టాలెంట్‌పై నాకు నమ్మకం ఉంది. కచ్చితంగా నేను విజయం సాధిస్తాను" అని ధీమా వ్యక్తం చేశారు. కానీ, ఆమె తల్లి బేబీ దేవి మాత్రం ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. "పేపర్ లీక్‌ను ఎలా సమర్థిస్తారు? పిల్లల ప్రాణాలతో, భవిష్యత్తుతో ఆడుకుంటారా?" అని సూటిగా ప్రశ్నించారు.

Extremely Unfair NEET Aspirants Express Anguish Over Re-Exam

రియా యాదవ్ అనే మరో స్టూడెంట్ నోట్స్ పట్టుకుని సెంటర్ చుట్టూ తిరుగుతూ కనిపించింది. "నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. త్వరగా ఎగ్జామ్ పూర్తయితే చాలు అనిపిస్తోంది. ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను" అని వాపోయింది.

ఎగ్జామ్ రాసేది ఒక్కరే.. టెన్షన్ పడేది కుటుంబమంతా

ఎగ్జామ్ రాసేది ఒక్క విద్యార్థే అయినా.. ఆ టెన్షన్ మొత్తం ఫ్యామిలీ పడుతోందని బల్జీత్ కౌర్ అనే మహిళ అభిప్రాయపడ్డారు. తన సోదరిని సెంటర్‌లోకి పంపుతూ.. "మా వాళ్లు లోపల ఎంతలా ఎమోషనల్ టర్మోయిల్ (Emotional turmoil) అనుభవిస్తున్నారో తలుచుకుంటేనే బయట మేం ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం" అని చెప్పారు.

దెబ్బతిన్న ఫోకస్.. పెరిగిన ఆర్థిక భారం

పేపర్ లీక్ కారణంగా సిస్టమ్‌పై నమ్మకం పోయిందని నిఖిల్ తన్వర్ అనే అభ్యర్థి అన్నాడు. "నా ఫోకస్ (Focus) మొత్తం దెబ్బతింది. చదువు పక్కనపెట్టి స్మార్ట్ ఫోన్ పట్టుకుని ఫ్రెండ్స్‌తో తిరగడం మొదలుపెట్టాను" అని చెప్పాడు. శివమ్ తన్వర్ అనే మరో స్టూడెంట్ మాట్లాడుతూ.. ఇప్పటికీ ఆన్‌లైన్‌లో పేపర్లు లీక్ అవుతున్నాయని, టెస్టింగ్ ఏజెన్సీల (Testing Agencies) పనితీరుపై తనకు ఏమాత్రం నమ్మకం లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అన్షుల్ చౌహాన్ అనే విద్యార్థి తన ఆర్థిక కష్టాలను పంచుకున్నాడు. "పేపర్ లీక్ అయ్యాక నా మెంటల్ హెల్త్ (Mental health) పూర్తిగా దెబ్బతింది. పైగా కోచింగ్ సెంటర్ల దగ్గరే ఉండి రివిజన్ క్లాసులు (Revision classes) తీసుకోవడం వల్ల అదనంగా రూ.15,000 నుంచి 20,000 అదనంగా ఖర్చయ్యాయి. కొన్ని సెంటర్లైతే రివిజన్ పేరుతో అదనపు ఫీజులు కూడా వసూలు చేశాయి" అని ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement
Advertisement