Covid-19 | ముంబయిలో కరోనా కలకలం.. మళ్లీ విజృంబిస్తున్న వైరస్‌లు..!
Covid-19 | వర్షాకాలం నేపథ్యంలో ముంబయి మహానగరంలో మళ్లీ వైరల్ వ్యాధులు విజృంబిస్తున్నాయి. ఇటీవల కొంతకాలంగా కొవిడ్-19, స్వైన్ ఫ్లూ (H1N1), ఇన్‌ఫ్లుయెంజా తదితర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ కేసులు భారీగా పెరిగాయి. రెస్పిరేటరీ సింకీషియల్ వైరస్ (RSV) కేసులు ఒకేసారి వ్యాపిస్తున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
Covid-19 | వర్షాకాలం నేపథ్యంలో ముంబయి మహానగరంలో మళ్లీ వైరల్ వ్యాధులు విజృంబిస్తున్నాయి. ఇటీవల కొంతకాలంగా కొవిడ్-19, స్వైన్ ఫ్లూ (H1N1), ఇన్‌ఫ్లుయెంజా తదితర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ కేసులు భారీగా పెరిగాయి. రెస్పిరేటరీ సింకీషియల్ వైరస్ (RSV) కేసులు ఒకేసారి వ్యాపిస్తున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దాంతో నగరంలోని పలు ఆసుపత్రులతో రోగులతో నిండిపోతున్నాయి. బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ పాథాలజిస్ట్ డాక్టర్ సంజయ్ మెహతా మాట్లాడుతూ.. కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు కనిపిస్తున్నాయని.. తమ ఆసుపత్రి ల్యాబ్‌లో రోజుకు సగటున ఏడు కంటే ఎక్కువ కొవిడ్, హెచ్1ఎన్1 పాజిటివ్ కేసులు వస్తున్నాయని తెలిపారు. బాంబే హాస్పిటల్ సీనియర్ వైద్యుడు డాక్టర్ గౌతమ్ భన్సాలి మాట్లాడుతూ ప్రస్తుతం ఒకేసారి అనేక వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయన్నారు. ఇప్పుడు వైరస్‌లదే ఆధిపత్యం కొనసాగుతోందన్న ఆయన.. స్వైన్ ఫ్లూ, ఇన్‌ఫ్లుయెంజా, ఆర్ఎస్‌వీ కేసులు ఎక్కువగా చూస్తున్నామని చెప్పారు. ఈ వైరస్‌ల కారణంగా అధిక జ్వరం, తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు కలిగిస్తున్నాయని, కొన్నిసార్లు ఆసుపత్రి చికిత్స అవసరమవుతోందని వైద్యులు తెలిపారు. ఇక సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ హేమంత్ థాకర్ మాట్లాడుతూ ఓపీడీలో ప్రతి రోజూ కొత్త కోవిడ్ కేసులు వస్తున్నాయని తెలిపారు. గత నెలలో స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా కనిపించాయని పేర్కొన్నారు. గత 7–10 రోజుల్లో కోవిడ్ కేసులు కూడా మళ్లీ పెరుగుతున్నాయన్నారు.
కొవిడ్ కేసుల పెరిగేందుకు కారణాలు..?
బీఎంసీ ఎగ్జిక్యూటివ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దక్షా షా మాట్లాడుతూ కొన్ని కోవిడ్ కేసులు నమోదయ్యాయని, ప్రధానంగా వాతావరణ మార్పుల ప్రభావమే ఇందుకు కారణం కావచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. రుతుపవనాలు ఆలస్యం కావడం వల్ల గాలిలో వైరస్‌లు ఎక్కువకాలం ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. డాక్టర్ థాకర్ మాట్లాడుతూ వర్షాలు ఆలస్యమవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడవచ్చని, రుతుపవనాలు ప్రారంభమైతే కేసులు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఇటీవల ముంబయిలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. భారత వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. అలాగే మహారాష్ట్రలో ఉక్కపోతతో కూడిన వేడి వాతావరణం కొనసాగుతుందని హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. వైరస్‌లు అన్ని వాతావరణాల్లో వ్యాపించగలవు కాబట్టి జాగ్రత్తలు అవసరమే. పలు అధ్యయనాలు శీతాకాలంలో కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. వేసవిలో ఇది పూర్తిగా తగ్గిపోతుందన్న దాంట్లో అర్థం లేదని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
కోవిడ్-19 లక్షణాలు : జ్వరం, చలి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు నొప్పి, ముక్కు కారడం లేదంటే ముక్కు దిబ్బడ, రుచి-వాసన కోల్పోవడం, అలసట, శరీర నొప్పులు, తలనొప్పి, వికారం-వాంతులు, డయేరియా.
స్వైన్ ఫ్లూ (H1N1) లక్షణాలు: జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం, శరీర నొప్పులు, అలసట, తలనొప్పి, కొన్నిసార్లు వికారం-వాంతులు (పిల్లల్లో ఎక్కువగా కనిపించేందుకు ఆస్కారం ఉంటుంది).
ఆర్ఎస్‌వీ లక్షణాలు : ముక్కు కారడం, దిబ్బడ, ఆకలి తగ్గడం, దగ్గు, తుమ్ములు, జ్వరం, శ్వాసలో వీజింగ్.
తాజావార్తలు
- ●KP Vivekananda | మైనంపల్లి.. అందితే జుట్టు లేదంటే కాళ్లు పట్టుకునే రకం
- ●Gutta Sukhendar Reddy | ఏసీబీకి పట్టుబడితే కఠిన శిక్షలు ఉండాలే
- ●Mahesh Babu Sister | బాలకృష్ణ హీరో - మహేష్‌బాబు అక్క హీరోయిన్ - ఫ్యాన్స్ గొడవలతో ఆగిపోయిన మూవీ ఏదో తెలుసా?
- ●US Tech Layoffs | కోట్లు సంపాదించినా.. అమెరికాలో లేఆఫ్ టెన్షన్! 'ఇండియాకు తిరిగొచ్చేయమంటారా?' అని అడుగుతున్న టెకీ
- ●NEET Re-Exam 2026 | "మా మానసిక క్షోభకు బాధ్యులెవరు?".. నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్ల వద్ద విద్యార్థులు, పేరెంట్స్ కన్నీటి కష్టాలు!
- ●Yoga Day 2026 | ఇంటర్నేషనల్ యోగా డే - ఆసనాలతో అదరగొట్టిన టాలీవుడ్ హీరోయిన్లు

KP Vivekananda | మైనంపల్లి.. అందితే జుట్టు లేదంటే కాళ్లు పట్టుకునే రకం

Gutta Sukhendar Reddy | ఏసీబీకి పట్టుబడితే కఠిన శిక్షలు ఉండాలే

Mahesh Babu Sister | బాలకృష్ణ హీరో - మహేష్‌బాబు అక్క హీరోయిన్ - ఫ్యాన్స్ గొడవలతో ఆగిపోయిన మూవీ ఏదో తెలుసా?

US Tech Layoffs | కోట్లు సంపాదించినా.. అమెరికాలో లేఆఫ్ టెన్షన్! 'ఇండియాకు తిరిగొచ్చేయమంటారా?' అని అడుగుతున్న టెకీ






