త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US Tech Layoffs | కోట్లు సంపాదించినా.. అమెరికాలో లేఆఫ్ టెన్షన్! ‘ఇండియాకు తిరిగొచ్చేయమంటారా?’ అని అడుగుతున్న టెకీ

అమెరికాలో 11 ఏళ్లుగా ఉంటున్న భారతీయ టెకీ లేఆఫ్ భయంతో ఇండియాకు రావాలా వద్దా అనే డైలమాలో పడ్డాడు. అతడి ఆస్తులు, ఆలోచనలపై నెటిజన్ల రియాక్షన్ ఏంటో చూడండి.

J

Viral news | Published On Jun 21, 2026, 5.36 pm IST

US Tech Layoffs | కోట్లు సంపాదించినా.. అమెరికాలో లేఆఫ్ టెన్షన్! ‘ఇండియాకు తిరిగొచ్చేయమంటారా?’ అని అడుగుతున్న టెకీ

సంక్షిప్త సారాంశం

అమెరికాలో 11 ఏళ్లుగా పనిచేస్తున్న 32 ఏళ్ల ఇండియన్ టెక్కీకి లేఆఫ్ ముప్పు పొంచి ఉంది. ఒత్తిడి, బర్న్‌అవుట్ కారణంగా జాబ్ సెర్చ్ చేయలేకపోతున్నానని, ఇండియాకు వచ్చేయాలని ఉందని రెడిట్‌లో పోస్ట్ చేశాడు. ఇండియాలో కోట్లలో ఆస్తులు ఉన్నప్పటికీ, మరో రెండేళ్లు అమెరికాలో ఉండి లోన్ తీర్చాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాడు. మానసిక ప్రశాంతత కోసం వెంటనే ఇండియాకు తిరిగి వచ్చేయాలని నెటిజన్లు సలహా ఇస్తున్నారు.

Advertisement

US Tech Layoffs | త్రినేత్ర.న్యూస్ : కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో (SF Bay Area)లో గత 11 ఏళ్లుగా పనిచేస్తున్న 32 ఏళ్ల భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (Techie) ఇప్పుడు తీవ్రమైన కెరీర్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. టాప్-టైర్ టెక్ కంపెనీలో ఐదేళ్లుగా పనిచేస్తున్న అతడికి ఇప్పుడు లేఆఫ్ (Layoff) ముప్పు పొంచి ఉంది. దీంతో అమెరికాను వదిలేసి, శాశ్వతంగా ఇండియాకు తిరిగి వచ్చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో పడి, సలహా కోసం రెడిట్ (Reddit) వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు.

ఆర్థికంగా స్థిరపడినా.. మానసిక ఆందోళన

"నా కెరీర్ ఇప్పటివరకు చాలా స్మూత్‌గా సాగింది. కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ (Remote work) వల్ల టీమ్‌తో సరైన బాండింగ్ ఏర్పడలేదు. ఇప్పుడు నేను లేఆఫ్ అంచున ఉన్నాను," అని ఆ టెకీ తెలిపాడు. ఇంకా పెళ్లికాని ఈ యువకుడికి ఫైనాన్షియల్‌గా ఎలాంటి లోటూ లేదు. ఇండియాలో ఇప్పటికే రూ. 1.7 కోట్ల విలువైన 2BHK ఫ్లాట్ (దీనిపై ఎలాంటి అప్పు లేదు), అలాగే రూ. 2.2 కోట్ల విలువైన 3BHK ఫ్లాట్ (దీనిపై రూ. 1 కోటి లోన్ ఉంది) ఉన్నాయి. ఇవి కాకుండా $100,000 (సుమారు రూ. 94 లక్షలు) ఈక్విటీ, $300,000 (సుమారు రూ. 2.8 కోట్లు) 4 లక్షల డాలర్లు రిటైర్‌మెంట్ సేవింగ్స్ కూడా ఉన్నాయని పోస్ట్‌లో వెల్లడించాడు.

బర్న్‌అవుట్.. ఎటు తేల్చుకోలేని డైలమా

యూఎస్ (USA) జాబ్ మార్కెట్ ప్రస్తుతం చాలా దారుణంగా ఉందని, ఇంటర్వ్యూలు క్రాక్ చేసేంత మోటివేషన్ తనలో లేదని అతడు వాపోయాడు. "బర్న్‌అవుట్ (Burnout), విపరీతమైన స్ట్రెస్ (Stress), యాంగ్జైటీతో బాధపడుతున్నాను. ఒక మూడు నెలలు బ్రేక్ తీసుకుని, ఇండియాలో కొత్త జాబ్ వెతుక్కోవాలని ఉంది. కానీ ఇండియాలోని ఆ ఒక కోటి రూపాయల లోన్ తీర్చడానికి మరో రెండేళ్లు ఇక్కడే ఉండి వీసా, జాబ్ టెన్షన్స్ భరించాలా? లేక ప్రశాంతత కోసం ఇండియాకు పారిపోయి రావాలా?" అని నెటిజన్లను అడిగాడు. తానొక మనీ-మైండెడ్ (Money-minded) వ్యక్తిగా మారిపోయానని, తన సర్కిల్‌లో అందరూ చాలా టాలెంటెడ్ లేదా రిచ్ కావడంతో తాను ఎప్పటికీ సంతృప్తి చెందలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.

నెటిజన్ల రియాక్షన్ ఏంటి?

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు అతడి పరిస్థితిని అర్థం చేసుకుని, అండగా నిలిచారు. బ్రేక్ తీసుకుని వెంటనే ఇండియాకు (Move back to India) వచ్చేయాలని మెజారిటీ యూజర్లు సూచించారు.

"నీ దగ్గర ఇప్పటికే తగినంత డబ్బు, ఆస్తులు ఉన్నాయి. ఆస్తులపై వచ్చే అద్దెతో కొన్ని నెలలు హాయిగా బతికేయొచ్చు. హెల్త్‌కు మించిన ఆస్తి లేదు, నీ మనసుకు నచ్చింది చెయ్" అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.

"లైఫ్ అంటే ఎప్పుడూ స్ట్రెస్, యాంగ్జైటీతో బతకడం కాదు కదా. ఫైనాన్షియల్ సక్సెస్ కోసం ఇంకా ప్రాకులాడటం ఆపేయ్" అని మరో యూజర్ సలహా ఇచ్చాడు.

"చాలా మంది అమెరికాలోనే ఉండిపొమ్మని చెబుతారు, కానీ వారి మాటలు వినొద్దు. ముందు నీ మెంటల్ హెల్త్‌కు (Mental health) ప్రాధాన్యత ఇవ్వు," అని ఇంకొకరు మద్దతు పలికారు.

I'm getting laid off. Is this my sign to move back to India? (Always wanted to move back)
by
u/jalsaraj in
returnToIndia

Advertisement
Advertisement