త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Punjab Blast | రిపబ్లిక్‌ డేకి ముందు పంజాబ్‌లో పేలుడు.. ఎగిరిపడ్డ గూడ్స్‌ రైలు ఇంజిన్‌..!

Punjab Blast | భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు పంజాబ్‌లో శుక్రవారం అర్ధరాత్రి పేలుడు జరిగింది. ఫతేగఢ్‌ సాహిబ్‌ జిల్లాలో అమృత్‌సర్ - ఢిల్లీ మార్గంలో సిర్హింద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని ట్రాక్‌పై ఈ పేలుడు చోటు చేసుకుంది.

P

National | Published On Jan 24, 2026, 4.23 pm IST

Punjab Blast | రిపబ్లిక్‌ డేకి ముందు పంజాబ్‌లో పేలుడు.. ఎగిరిపడ్డ గూడ్స్‌ రైలు ఇంజిన్‌..!
Advertisement

Punjab Blast | భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు పంజాబ్‌లో శుక్రవారం అర్ధరాత్రి పేలుడు జరిగింది. ఫతేగఢ్‌ సాహిబ్‌ జిల్లాలో అమృత్‌సర్ - ఢిల్లీ మార్గంలో సిర్హింద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని ట్రాక్‌పై ఈ పేలుడు చోటు చేసుకుంది. సరుకు రవాణా కోసం కొత్తగా నిర్మించిన లైన్‌పై నుంచి గూడ్స్‌ ట్రైన్‌ వెళ్తున్న సమయంలో రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రైలు ఇంజిన్ ఖాన్పూర్ క్రాసింగ్ సమీపంలోకి రాగానే పేలుడు జరగ్గా రైల్వే ట్రాక్‌ పది అడుగుల ఎత్తు వరకు ఎగిరిపడింది. ఈ ఘటనలో ఇంజిన్‌ దెబ్బంది. లోకో పైలట్‌కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జీఆర్‌పీ కేసు నమోదు చేసింది. పేలుడు ఉగ్రవాద కుట్రనా? అని తెలుసుకునేందుకు పోలీసులు, ఎఫ్‌ఎస్‌ఎల్‌ బృందాలు ఆధారాలు సేకరించాయి. రోపర్‌ రేంజ్‌ డీఐజీ నానక్‌ సింగ్‌ సంఘటనా స్థలాని పరిశీలించారు.

అయితే, రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం వల్లే పేలుడు జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. రైల్వే సాంకేతిక నిపుణులు సైతం దానిపై దర్యాప్తు ప్రారంభించారు. రపబ్లిక్‌ డే సందర్భంగా ఇప్పటికీ నిఘా వర్గాలు ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించిన విషయం తెలిసిందే. దాంతో పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. పేలుడు ఘటనలో డీఎఫ్‌సీసీ గాయపడ్డారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. పేలుడుతో పంజాబ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. రైల్వే ట్రాక్‌ల దగ్గర పేలుళ్లు సాధారణ నేరాలు కాదని పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ పేర్కొన్నారు. పంజాబ్‌ను అస్థిరపరిచేందుకు, ప్రజలను భయాందోళనలకు గురి చేసేందుకు చేసిన ప్రయత్నమని ఆఓపించారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనలను ఆపడంలో ఎందుకు విఫలమవుతుందని ఆయన ఆరోపించారు.

శిరోమణి అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్ బాదల్ మాట్లాడుతూ సిర్హింద్ సమీపంలోని రైల్వే లైన్‌లో జరిగిన పేలుడు వార్తతో ఆందోళనకు గురయ్యానన్నారు. ఇలాంటి ఘటనలు అందరినీ ఆందోళనకు గురి చేస్తాయని, శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తున్నాయన్నారు. పేలుడులో గాయపడ్డ వారు కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుత ప్రభుత్వంలో పంజాబ్‌లో శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తుందని.. ఈ ఘటన దానికి మరో స్పష్టమైన ఉదాహారణగా పేర్కొన్నారు. ఇలాంటి దాడులను నిరోధించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడం సరికాదన్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని ఆప్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement