త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Republic Day | రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఉర్సులా

Republic Day | 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్‌ యూనియన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లేయెన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆమెతో పాటు కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో లూయిస్‌ శాంటోస్‌ డా కోస్ట్‌ సైతం పాల్గొననున్నారు. వే

P

National | Published On Jan 24, 2026, 6.04 pm IST

Republic Day | రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఉర్సులా
Advertisement

Republic Day | 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్‌ యూనియన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లేయెన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆమెతో పాటు కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో లూయిస్‌ శాంటోస్‌ డా కోస్ట్‌ సైతం పాల్గొననున్నారు. వేడుకల్లో పాల్గొనేందుకు శనివారం ఉర్సులా, లూయిస్‌ శాంటోస్‌ భారత్‌కు చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో వారికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద స్వాగతం పలికారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాలైన భారత్, ఈయూల మధ్య పరస్పర విశ్వాసం, భాగస్వామ్య విలువలతో బంధం బలపడుతోందని భారత విదేశాంగ శాఖ ఈ సందర్భంగా తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ఈయూ విదేశాంగ విధాన చీఫ్ కజా కల్లాస్ సైతం ఢిల్లీకి చేరుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఈయూ నేతలు భారత్‌లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత కొద్దిరోజుల కిందట విదేశాంగ మంత్రి జై శంకర్‌ ఈయూ దేశాల రాయబారులతో సమావేశమయ్యారు. భారత్-ఈయూ భాగస్వామ్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించగలదని, సరఫరా గొలుసులను పటిష్టం చేయగలదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఈయూ నేతలు భారత్‌కు రాగా.. వారంతా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అవుతారు. జనవరి 27న జరగనున్న 16వ భారత్-ఈయూ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీతో కలిసి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య వాణిజ్యం, భద్రత, సాంకేతికత తదితర అంశాలపై కీలక చర్చలు జరుపుతారు. అలాగే, భారత్-ఈయూ బిజినెస్ ఫోరమ్‌ని నిర్వహించనున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement