Homework | హోమ్‌వర్క్ చేయలేదని.. రెండో తరగతి విద్యార్థిపై 150 దెబ్బలు
Homework | పదేండ్ల కుర్రాడు. రెండో తరగతి (Class 2 Student) చదువుతున్నాడు. ఆడిపాడే వయస్సు. బడిలో సారు ఇచ్చిన హోమ్‌వర్క్ (Homework) చేయలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మాస్టారు (English Teacher) బెత్తానికి పనిచెప్పాడు. హోమ్‌వర్క్చే యకపోవడానికి కారణం ఏంటని అడిగిందీ లేదు.
Homework | త్రినేత్ర.న్యూస్: పదేండ్ల కుర్రాడు. రెండో తరగతి (Class 2 Student) చదువుతున్నాడు. ఆడిపాడే వయస్సు. బడిలో సారు ఇచ్చిన హోమ్‌వర్క్ (Homework) చేయలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మాస్టారు (English Teacher) బెత్తానికి పనిచెప్పాడు. హోమ్‌వర్క్చే యకపోవడానికి కారణం ఏంటని అడిగిందీ లేదు. ఆ పిల్లవాడిని ఎడాపెడా కొట్టాడు. వందకు పైగా దెబ్బలు కొడితేగానీ ఆ టీచర్ శాంతించలేదు. సారు గారు చేసిన పనికి చిన్నారి ఒళ్లంతా వాతలు పడ్డాయి. విషయం ఎవరికైనా చెబితే మళ్లీ కొడతానని బెదిరింపు ఒకటి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రఖార్ సింగ్ అనే పదేండ్ల బాలుడు గోండా జిల్లాలోని కర్నేల్‌గంజ్‌లో ఉన్న ఎంఆర్‌జీ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. రోజూలాగానే శనివారం స్కూల్‌కి వెళ్లాడు. ఇంగ్లిషు మాస్టారు హోమ్‌వర్క్ చెక్‌చేస్తున్నాడు. ఈక్రమంలో ప్రఖార్ హోమ్‌వర్క్ చేయకపోవడంతో అతనిపై టీచర్ బెత్తంతో విరుచుకుపడ్డాడు. ఇష్టారీతిగా 150 సార్లు కొట్టడంతో పిళ్లవాని కాళ్ల నిండా బెత్తం దెబ్బల బొబ్బలు తేలాయి. గుర్తించిన తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఇంగ్లిష్ టీచర్‌పై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
ఇంటికొచ్చిన పిల్లాడు కనీసం నడవలేకపోయాడని, కుంటుతూ రావడంతో ఏం జరిగిందని ఆరాతీశానని ప్రఖార్ సింగ్ తండ్రి తెలిపారు. 150 సార్లకుపైగా టీచర్ కొట్టాడని మా అబ్బాయి చెప్పాడన్నారు. కాళ్లు మొత్తం వాచిపోయి బొబ్బలొచ్చాయి. కొట్టిన విషయం ఎవరికైనా చెబితే మళ్లీ కొడతానని టీచర్ బెదిరించాడు. ఏడ్వడం ఆపేయాలని మావాడికి టీచర్ బిస్కెట్లు కూడా ఇచ్చాడు. రెండో తరగతి విద్యార్థిని ఎవరైనా ఇంతలా కొడతారా? వెంటనే ఈ విషయమై పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదుచేశా. అనంతరం పోలీసులకు కూడా ఫిర్యాదు కూడా చేశానని వెల్లడించారు. ఈ ఘటన తమ దృష్టికి రావడంతో ఇంగ్లిష్ టీచర్‌ను విధుల నుంచి తప్పించామని ఎంఆర్‌జీ స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు.
కాగా, ఉపాధ్యాయుడిపై భారతీయ న్యాయసంహితలోని 115(2), 351(3), 352 సెక్షన్ల కింద నమోదుచేశామని కర్నేల్‌గంజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అభిషేక్ దబాచా చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, ఈ అంశంలో ప్రత్యేక చట్టపర చర్యలు తీసుకుంటామన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






