త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Super El Nino | సూప‌ర్ ఎల్‌నినో ముప్పు.. మార్చి నాటికి భార‌త్‌లో 55,000 మ‌ర‌ణాలు

Super El Nino | పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడిన తీవ్రమైన సూపర్ ఎల్ నినో (Super El Nino) ప్రభావం కారణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా 8,57,000 అదనపు వేడి సంబంధిత మరణాలు సంభవించవచ్చని ప‌రిశోధ‌కులు అంచ‌నా వేస్తున్నారు. రాబోయే ఆరు నెల‌ల్లోనే భార‌త్‌లో 55,000 ఉష్ణ సంబంధిత మరణాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చ‌రిస్తున్నారు.

D

National | Published On Oct 29, 2026, 5.14 pm IST

Super El Nino | సూప‌ర్ ఎల్‌నినో ముప్పు.. మార్చి నాటికి భార‌త్‌లో 55,000 మ‌ర‌ణాలు
Advertisement

Super El Nino | త్రినేత్ర న్యూస్ : పసిఫిక్‌ మహాసముద్రంలో (Pacific Ocean) రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఎల్‌నినో మరింత బలపడుతోంది. ఫ‌లితంగా దేశంలో వర్షాభావ పరిస్థితులు, వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప‌లు చోట్ల క‌ర‌వు తాండం చేస్తుండ‌గా.. మ‌రికొన్ని చోట్ల తుపానులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడిన తీవ్రమైన సూపర్ ఎల్ నినో (Super El Nino) ప్రభావం కారణంగా ఇప్ప‌టికే అధిక వేడితో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా 8,57,000 వేడి మ‌ర‌ణాలు..

ఈ నేప‌థ్యంలోనే ప‌రిశోధ‌కులు పిడుగులాంటి వార్త చెప్పారు. ఈ అసాధార‌ణ వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల దేశంలో భారీ స్థాయిలో మ‌ర‌ణాలు సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. జూన్ 2026 నుంచి మార్చి 2027 మధ్య కాలంలో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఈ తీవ్రమైన 'సూపర్ ఎల్ నినో' ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 8,57,000 అదనపు వేడి సంబంధిత మరణాలు సంభవించవచ్చని అంచనా వేశారు.

రాబోయే ఆరు నెల‌ల్లోనే 3,73,000 మ‌ర‌ణాలు

ఇందులో రాబోయే ఆరు నెలల్లోనే (అక్టోబర్-మార్చి) ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,73,000 అదనపు మరణాలు సంభవించే అవకాశం ఉందని అమెరికా (USA) లోని షికాగో విశ్వవిద్యాలయానికి (Chikago University) చెందిన ‘క్లైమేట్‌ ఇంపాక్ట్‌ ల్యాబ్‌ (Climate Impact Lab)’ న్యూ ట్రాక‌ర్‌ అంచనా వేసింది. అత్యధిక శాతం గ్లోబల్ సౌత్ దేశాలైన ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల నుంచే ఉంటాయని తేలింది. వ‌చ్చే ఏడాది మార్చి నాటికి భార‌త‌దేశంలో ఎల్ నినో కారణంగా 55,000 ఉష్ణ సంబంధిత మరణాలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. వీటిలో ఎక్కువ శాతం మార్చి నెలలోనే నమోదయ్యే అవకాశం ఉంది. ఇక నైజీరియాలో 56,000, ఇండోనేషియాలో సుమారు 29,000 మరణాలు, బ్రెజిల్‌లో ఈ సంఖ్య‌ 19,000 వ‌ర‌కూ ఉండొచ్చ‌ని ప‌రిశోధ‌కులు భావిస్తున్నారు.

ఇప్ప‌టికే భార‌త్‌లో ల‌క్ష వేడి మ‌ర‌ణాలు

ఈ వేడి కారణంగా ఇప్పటికే దాదాపు 484,500 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇందులో ల‌క్ష మ‌ర‌ణాలు ఒక్క భార‌త్‌లోనే న‌మోదైన‌ట్లు ట్రాక‌ర్ అంచ‌నా వేసింది. ఈ ఏడాది ఎల్ నినో 1950 తర్వాత అత్యంత బలమైనదని, దీని ప్ర‌భావం 2027లోనూ కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ఇప్పటికే హెచ్చరించిన విష‌యం తెలిసిందే.

Also Read..

జ్ఞానేష్ కుమార్‌పై అవినీతి దర్యాప్తు: కేరళం ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రూ.700 కోట్ల రోడ్డు ప్రాజెక్టులో ఏం జరిగింది?

స‌ర్ అనేది మోదీ, షా కుట్ర‌.. సీఈసీ దీన్ని అమ‌లు చేశారు : జైరామ్‌ రమేశ్‌

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఫలితాలు: బీజేపీ వర్సెస్ శివసేన.. రచ్చకెక్కిన విభేదాలు

Advertisement
Advertisement