త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dindi Project | ఏదుల నుంచి డిండికి నీళ్లు తరలించొద్దు

Dindi Project | పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ఏదుల పాయింట్ నుంచి డిండి ఎత్తిపోతలకు నీళ్లు తరలించే ప్రతిపాదనను విరమించుకోవాలని ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించారు.

S

Telangana | Published On Jul 17, 2026, 6.47 pm IST

Dindi Project | ఏదుల నుంచి డిండికి నీళ్లు తరలించొద్దు
Advertisement

2 టీఎంసీల నీటిని లక్ష్మీదేవిపల్లి వరకు తీసుకురావాలి
శ్రీశైలం నుంచి తగిన నీటిని కేటాయించండి
ముఖ్యమంత్రికి పాలమూరు ఎమ్మెల్యేల వినతి

Dindi Project | త్రినేత్ర.న్యూస్ : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ఏదుల పాయింట్ నుంచి డిండి ఎత్తిపోతలకు నీళ్లు తరలించే ప్రతిపాదనను విరమించుకోవాలని ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించారు.

శుక్రవారం రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఏదుల - డిండి కాలువల ద్వారా నీటిని తరలించే ప్రతిపాదనను విరమించుకోవాలని చేయాలని ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ ప్రతిపాదనను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం సూచించారు.

శ్రీశైలం నుంచి నీళ్లు కేటాయించండి

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వరకు 2 టీఎంసీల నీటిని తరలించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పాలమూరు ప్రతినిధులు కోరారు. నల్లగొండ , పాలమూరు రంగారెడ్డి ప్రాంతాలకు శ్రీశైలం జలాశయం నుంచి తగిన నీటి కేటాయింపు కల్పించాలని కోరుతూ మంత్రి ఉత్తమ్ కి వినతిపత్రం సమర్పించారు.

Advertisement
Advertisement