త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DK Shivakumar | చేతిలో రాజ్యాంగంతో.. సీఎంగా డీకే శివ‌కుమార్ ప్ర‌మాణ‌స్వీకారం

DK Shivakumar | క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి (Karnataka CM)గా డీకే శివ‌కుమార్ (DK Shivakumar) ప్ర‌మాణ స్వీకారం చేశారు. లోక్‌భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో డీకే చేత గ‌వ‌ర్న‌ర్ థామ‌ర్‌చంద్ గ‌హ్లోత్ ప్ర‌మాణం చేయించారు.

D

National | Published On Jun 3, 2026, 4.52 pm IST

DK Shivakumar | చేతిలో రాజ్యాంగంతో.. సీఎంగా డీకే శివ‌కుమార్ ప్ర‌మాణ‌స్వీకారం
Advertisement

DK Shivakumar | క‌ర్ణాట‌కలో కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర 25వ‌ ముఖ్య‌మంత్రి (Karnataka CM)గా డీకే శివ‌కుమార్ (DK Shivakumar) ప్ర‌మాణ స్వీకారం చేశారు. లోక్‌భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో డీకే చేత గ‌వ‌ర్న‌ర్ థామ‌ర్‌చంద్ గ‌హ్లోత్ ప్ర‌మాణం చేయించారు. ఓ చేత్తో రాజ్యాంగాన్ని ప‌ట్టుకుని (పాకెట్ సైజు పుస్తకం) డీకే సీఎంగా ప్ర‌మాణం చేశారు. లోక్‌భ‌వ‌న్‌కు వెళ్లే ముందు డీకే శివ‌కుమార్ త‌న త‌ల్లి గౌర‌మ్మ వ‌ద్ద ఆశీర్వాదం తీసుకున్నారు.

డీకేతోపాటూ 13 మంది మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. జి.ప‌ర‌మేశ్వ‌ర్ డిప్యూటీ సీఎంగా, సిద్ధ‌రామ‌య్య కుమారుడు య‌తీంద్ర, కాంగ్రెస్ చీఫ్ ఖ‌ర్గే కుమారుడు ప్రియాంక్ ఖ‌ర్గే మంత్రులుగా ప్ర‌మాణం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే, లోక్‌స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ, మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య‌, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేర‌ళ సీఎం వీడీ స‌తీశ‌న్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం సుఖ్వింద‌ర్ సింగ్ సుఖూ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. డీకే, మంత్రుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివ‌కుమార్ కోసం కాంగ్రెస్ కిసాన్ సెల్ కర్ణాటక విభాగం ప్ర‌త్యేక మాల‌ను సిద్ధం చేసింది. డీకేకి బ‌హూక‌రించేందుకు రూ. 20 నోట్లతో ప్ర‌త్యేకంగా మాల‌ను త‌యారు చేయించింది.

Also Read..

తెలంగాణ‌లో రెండు హైవేల విస్త‌ర‌ణ‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

ఏటీఎఫ్ ధ‌ర‌ల‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. రూ.10 వేల కోట్ల‌తో నిధి

మేలో 18 సినిమాలు డిజాస్ట‌ర్‌.. జూన్‌పైనే టాలీవుడ్ ఆశ‌లు..!

Advertisement
Advertisement