త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Accident | అమెరికాలో కారు ప్రమాదం.. మాజీ ఎంపీ సతీమణి సుచియాష్కీకి గాయాలు

Accident | మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి, ఎండోక్రినాలజిస్ట్ సీనియర్ వైద్యురాలు డాక్టర్ సుచియాష్కీకి అమెరికాలో రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆమెకు రిబ్స్ విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

P

Telangana | Published On Jun 3, 2026, 9.20 pm IST

Accident | అమెరికాలో కారు ప్రమాదం.. మాజీ ఎంపీ సతీమణి సుచియాష్కీకి గాయాలు
Advertisement

Accident | మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి, ఎండోక్రినాలజిస్ట్ సీనియర్ వైద్యురాలు డాక్టర్ సుచియాష్కీకి అమెరికాలో రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆమెకు రిబ్స్ విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగన యాష్కిని బోస్టన్‌లోని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రిలో ఎండీ కోర్సులో చేర్పించిన అనంతరం కుటుంబం తిరుగు ప్రయాణంలో న్యూయార్క్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వర్షం కారణంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టినట్లు సమాచారం. ఈ ఘటన సమయంలో మధుయాష్కీ గౌడ్, డాక్టర్ సుచియాష్కీ వేర్వేరు వాహనాల్లో ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. కుమార్తె డాక్టర్ గగన యాష్కి న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇటీవల కాన్వొకేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. కుమార్తెను ఎండీ కోర్సులో చేర్పించే కార్యక్రమం అనంతరం గురువారం ఆయన భారత్‌కు తిరిగి రావాల్సి ఉండగా.. ఈ ప్రమాదం జ‌రిగింది.

Advertisement
Advertisement