Language | దక్షిణ భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే భాష ఏది?
Language | భిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలకు నెలవు భారతదేశం (India). ఎన్నో భాషలు (Language), మతాలు, కులాల, ప్రాంతాల సమాహారంగా వెలుగొందుతున్నది. ఇక్కడ మాట్లాడే భాష , ఆచార సాంప్రదాయాలు ప్రాంతాన్ని భట్టి మారుతూ ఉంటాయి.
Language | త్రినేత్ర.న్యూస్: భిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలకు నెలవు భారతదేశం (India). ఎన్నో భాషలు (Language), మతాలు, కులాల, ప్రాంతాల సమాహారంగా వెలుగొందుతున్నది. ఇక్కడ మాట్లాడే భాష , ఆచార సాంప్రదాయాలు ప్రాంతాన్ని భట్టి మారుతూ ఉంటాయి. ఎక్కువగా హిందీ, ఇంగ్లిష్ వాడుకలో ఉన్నప్పటికీ అధికారిక భాష అంటూ ఏదీలేదు. దేశవ్యాప్తంగా 1200లకుపైగా భాషలు మాట్లాడుతారు. అయితే భారత రాజ్యాంగం అధికారికంగా 22 భాషలను గుర్తించింది. ఇందులో హిందీ చాలా రాష్ట్రాల్లో వాడుకలో ఉంది. దీనిని సుమారు 44 శాతం మంది మాట్లాడుతారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడేది హిందీనే. ఇక 2 వేల ఏండ్లకుపైగా చరిత్ర కలిగిన తమిళ భాషను పురాతన భాషగా పరిగణిస్తారు. అయితే దక్షిణాదిలో (South India) అత్యధికంగా వాడుకలో ఉన్న మాత్రం ఆ భాష కాదు. మరి దక్షిణ భారతదేశంలో ఏ భాషను ఎక్కువగా మాట్లాడుతారో తెలుసా?.
దక్షిణ భారతదేశంలో అత్యంత విస్తృతంగా మాట్లాడే భాష తెలుగు (Telugu). దీనిని ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు మాట్లాడుతుంటారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికారిక భాష కూడా. అయితే కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో తెలుగును మాట్లాడేవారు అధికంగా ఉన్నారు. దేశ జనాభాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాటా 7 నుంచి 8 శాతం ఉంటుంది. అయితే తెలుగును 8.3 కోట్ల మందికిపైగా మాతృభాషగా మాట్లాడుతున్నారు.
కర్ణాటకలో 7 శాతం మంది, తమిళనాడు సుమారు 6 శాతం మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం, మహారాష్ట్రలో తెలుగును మాతృభాషగా ఉపయోగించేవారు గణనీయంగా ఉన్నారు. దీంతో దక్షిణ ద్వీపకల్పంలో ఒక ప్రధాన భాషగా తెలుగు వెలుగొందుతున్నది.

ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా పిలువబడే తెలుగు ప్రయాణం 2,500 ఏండ్ల క్రితమే ప్రారంభమైంది. మూలద్రావిడ భాష నుంచి వేరుపడి ప్రత్యేకభాషగా స్థిరపడింది. శాతవాహన రాజుల పాలనలో రచించిన `గాధాసప్తశతి` అనే మహారాష్ట్రీ ప్రాకృత పద్యసంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. విజయనగర సామ్రాజ్యంలో తెలుగు ఉన్నత సంస్కృతి మాధ్యమంగా వెలుగొందింది. తెలుగులోని దాదాపు ప్రతి పదం అచ్చుతో ముగుస్తుంది. ఈ ఓపెన్ సిలబల్ ఇటాలియన్ భాషతో పోలి ఉంటుంది. అందుకే తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా పిలుస్తారు.
ప్రాచీన భాషగా..
ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా కూడా ప్రాముఖ్యతను చాటుకున్నది. ముఖ్యంగా అమెరికాలో గత దశాబ్దంలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 86 శాతం పెరిగింది. న్యూజెర్సీ, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో ఈ భాష మాట్లాడేవారు అధికంగా ఉన్నారు. అక్కడ హిందీ తర్వాత ఎక్కువగా వినబడే భారతీయ భాష తెలుగు కావడం విశేషం. దీనికి ప్రధాన కారణం సాంకేతిక రంగం అభివృద్ధి చెందడమే. 2026 నాటికి భాషా ప్రపంచంలో మాతృభాషగా మాట్లాడేవారి సంఖ్య ప్రకారం ద్రావిడ భాషా కుటుంబంలో తెలుగు అతిపెద్దదిగా నిలిచింది. 2008లో కన్నడతో పాటు తెలుగును ప్రాచీన భాషగా గుర్తించారు.

హిందీ, బెంగాలీ తర్వాత..
హిందీ, బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడుకునే భాష తెలుగు. దేశవ్యాప్తంగా హిందీని 52.82 కోట్ల మంది హిందీని మాట్లాడుతుండగా.. 9.72 కోట్లతో బెంగాలీ రెండో స్థానంలో ఉంది. ఇక మరాఠాలో 8.30 మంది, తెలుగు 8.3 కోట్ల మంది, తమిళం 7.8 కోట్లు, గుజరాతీ 5.54 కోట్లు, 5.07 కోట్ల మంది ఉర్దూ, 4.7 కోట్ల మంది కన్నడ, 3.75 కోట్ల మంది ఒడియా, 3.48 కోట్ల మంది మలయాళం మాట్లాడుతున్నారు.
తాజావార్తలు
- ●Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!
- ●Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు
- ●Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?
- ●DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
- ●Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
- ●Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!

Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!

Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు

Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!





