Dimagi Naxal | ఎర్రకోట సాక్షిగా మోదీ సంచలనం: నిన్న ‘అర్బన్ నక్సల్’.. నేడు ‘దిమాగీ నక్సల్’.. అసలెవరు వీళ్లు?
ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ దేశానికి కొత్త పదాన్ని పరిచయం చేశారు. ఇంతకీ ముప్పుగా మారుతున్నారని ఆయన హెచ్చరించిన ఆ 'దిమాగీ నక్సల్స్' ఎవరు?
సంక్షిప్త సారాంశం
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. సమాజంలో అశాంతి రేపుతున్న వారిని 'దిమాగీ నక్సల్స్' (ఇంటలెక్చువల్ నక్సల్స్) గా వర్ణించారు. గతంలో ఆందోళనకారులను 'ఆందోళన్ జీవి', 'అర్బన్ నక్సల్' పదాలతో ప్రధాని మోదీ విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారినే మోదీ టార్గెట్ చేస్తున్నారంటూ కాంగ్రెస్, ఇతర విపక్షాల మండిపడ్డాయి.
- దిమాగీ నక్సల్
- మావోయిస్టుల సిద్ధాంతమే వీరి ఆలోచన
- వీళ్లతో దేశానికి ముప్పు పొంచి ఉంది
- వాళ్లే.. సర్కారు కమిటీల్లో ఉన్నారు
- ఇప్పుడు అవకాశం కోసం చూస్తున్నారు
- సమాజాన్ని తప్పు దోవ పట్టించేందుకు యత్నిస్తున్నారు
- అటువంటి వాళ్లను ఓ కంట కనిపెట్టండి
- వాళ్లను ఐసొలేట్ చేద్దాం
- ఎర్రకోట నుంచి పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
- కోటి మందికి ఏఐ శిక్షణ..
- ఉచిత ఆన్‌లైన్ కోచింగ్..
- 700 నగరాలకు పైప్డ్ గ్యాస్
- 80వ స్వాతంత్య్ర దినోత్సవంలో జనాకర్షక ప్రకటనలు
Dimagi Naxal | త్రినేత్ర.న్యూస్: మొన్న ఆందోళన్ జీవి. నిన్న అర్బన్ నక్సల్. నేడు దిమాగీ నక్సల్. ప్రధానమంత్రి ప్రజాస్వామ్య భారతావనికి వరుసగా పరిచయం చేస్తూ వస్తున్న పదాలు. 2021లో రైతుల ఆందోళనను విమర్శిస్తూ.. ఆందోళన జీవి అని.. 2022 లో గుజరాత్ ఎన్నికల సందర్భంగా రాజకీయ ప్రత్యర్థులను అర్బన్ నక్సల్స్ గా వర్ణించిన ఆయన నేడు ఎర్రకోటపై మరో కొత్త పదాన్ని ఖాయం చేశారు. అదే దిమాగీ నక్సల్ "ఆయుధాలతో తిరిగిన నక్సల్స్ ను అంతమొందించాం. కానీ ఈ దిమాగీ నక్సల్స్ (ఇంటలెక్చువల్ నక్సల్ ) సమాజంలో హింసను, అశాంతిని ప్రేరేపించేందుకు ఎప్పుడు అవకాశమొస్తుందా..అని ఎదురుచూస్తున్నారు. వీళ్లే పవర్ కారిడార్స్ లో తిష్ట వేసుకొని కూర్చొనేవారు. సర్కారు కమిటీల్లో ఉండేవారు. సలహాదారులుగా కూడా పనిచేశారు. వీళ్ల మైండ్ సెట్ అంతా మావోయిజంతో నిండి ఉంటుంది. వీళ్లే పాలసీలను ప్రభావితం చేసేవారు. ఇటువంటి దిమాగీ నక్సల్ ను మనం ఓ కంట కనిపెట్టాలి. వాళ్లను ఐసొలేట్ (ఒంటరి) చేయాలి".. అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. 80 వ స్వాతంత్య్ర దినం సందర్భంగా పిలుపునిచ్చారు. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సాంకేతికత, విద్య, క్రీడలు, పౌర రక్షణ రంగంలో సంస్కరణలు, సెమీకండక్టర్ల తయారీ విస్తరణ, అణుశక్తి రంగాలకు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు.
समय हमारा है,
अवसर हमारा है,
संकल्प हमारा है…
आओ, मिलकर विकसित भारत बनाएं। pic.twitter.com/aGjwyOrlNd— Narendra Modi (@narendramodi) August 15, 2026
మొన్న ఆందోళన జీవి.. నిన్న అర్బన్ నక్సల్
దిమాగీ నక్సల్ అని ప్రధాని ఎవరిని ఉద్దేశించి అన్నారో స్పష్టత రాకున్నా ఆయన ఎర్రకోట నుంచి చేసిన వ్యాఖ్యలకు ప్రాముఖ్యత ఏర్పడింది. మావోయిస్టుల సిద్ధాంతాలను అనుసరించే మేధావులు, విద్యావంతులే లక్ష్యంగా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలుస్తున్నది. అయితే బీజేపీ నేతలు, కార్యకర్తలు తరచుగా ప్రయోగించే అర్బన్ నక్సల్ అనే పదాన్ని కూడా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది ప్రధాని మోడీయే. 2022 గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పోటీ కి దిగింది. ఆ సందర్భంగా ప్రచారం కోసం ఆ రాష్ట్రానికి వెళ్లిన నరేంద్ర మోదీ.. 2022 అక్టోబర్ 10,11 వ తేదీల్లో భరూచ్ పట్టణంలో తన ప్రసంగంలో ఆప్ ను ఉద్దేశిస్తూ.. తొలిసారిగా ఆయన వ్యాఖ్యలు చేశారు. "గుజరాత్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కొంతమంది అర్బన్ నక్సల్స్ ప్రవేశిస్తున్నారు. వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి" అని హెచ్చరించారు. అంతకుముందు 2021లోనే ఢిల్లీలో రైతుల ఆందోళన సందర్భంగా రాజ్య సభలో జరిగిన చర్చలో కూడా.. ఆందోళన్ జీవి అంటూ వ్యాఖ్యానించారు. "గత కొన్నేళ్లుగా కొత్త వర్గం బయలుదేరింది. ప్రతి ఆందోళనలో వాళ్లే ఉంటారు. వాళ్లే ఆందోళన్ జీవి. వీళ్ల నుంచి మనం దేశాన్ని కాపాడుకోవాలి.. వాస్తవానికి వాళ్లు పరాన్నజీవులు" అని 2021 ఫిబ్రవరి 8న రాజ్యసభలో మాట్లాడారు.
देश की पहली डिजिटल जनगणना को लेकर सभी देशवासियों, विशेषकर युवा साथियों से मेरा यह विनम्र आग्रह… pic.twitter.com/cPbtVztxCt
— Narendra Modi (@narendramodi) August 15, 2026
అసలు..ఎక్కడిది ఈ అర్బన్ నక్సల్
అర్బన్ నక్సల్ అనే పదం మావోయిస్టు సిద్ధాంతాల నుంచి పుట్టుకొచ్చింది. తమ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టే క్రమంలో అర్బన్ పర్ స్పెక్టివ్ : అవర్ వర్క్ ఇన్ అర్బన్ రియాస్ పేరుతో సీపీఐ (మావోయిస్టు) 2007లో ఓ రాజకీయ డాక్యుమెంట్ ను ప్రచురించింది. మావోయిస్టు సిద్ధాంతాలను అనుసరించేవారిని కీలకమైన ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో నియమితులయ్యేలా వ్యూహాత్మక విధానాన్ని నిర్ణయించుకున్నది. ఆ తర్వాత.. 2017 లో అర్బన్ నక్సల్ అనే ప్రదం తొలిసారి ఓ మ్యాగజీన్ లో ప్రచురితమై అందరి దృష్టిని ఆకర్షించింది. తాష్కెంట్ ఫైల్స్, ది కశ్మీరీ ఫైల్స్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ఫిల్మ్ మేకర్ వివేక్ అగ్నిహోత్రి.. తొలిసారిగా అర్బన్ నక్సల్ అనే పదాన్ని వ్యాసంలో వాడాడు. బీజేపీకి అనుకూల వ్యాసాలు ప్రచురించే స్వరాజ్య మ్యాగజీన్ కు 2017 లో రాసిన వ్యాసంలో .. అభివృద్ధి నిరోధకులను అర్బన్ నక్సల్స్ గా వర్ణించారు. ఆ తర్వాత ఎల్గార్ పరిషద్ కేసులో , భీమా కోరెగావ్ కేసులో అరెస్టైన వామ పక్ష సానుభూతి పరులను అర్బన్ నక్సల్స్ గా వర్ణించడం ప్రారంభమైంది.
ఇంతకీ ఎవరిని ఉద్దేశించి..
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారినే దిమాగీ నక్సల్ అని ప్రధానమంత్రి సంబోధిస్తున్నారంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. "ముందు...ప్రత్యర్థులను ఆయన అర్బన్ నక్సల్స్ అంటూ పిలిచాడు. ఇప్పుడు దిమాగీ నక్సల్స్ అంటున్నాడు. మోదీ..తీవ్ర నిస్పృహలో ఉన్నాడు. అందుకే ఇలా మాట్లాడుతున్నాడు" అని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్య సభ ఎంపీ జై రాం రమేశ్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | జగ్గారెడ్డి పిచ్చోడిలా తిరుగుతుండు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Itel | గృహోపకరణాల రంగంలోకి ఐటెల్.. చవక ధరలకే స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషిన్లు..
- ●Uttamkumar Reddy | స్మార్ట్ కార్డుల ప్రయత్నాన్ని అభినందించండి.. కేంద్రం సన్న బియ్యానికి ఖర్చు భరిస్తే మోదీ ఫొటో పెడతాం
- ●Y chromosome Disappearing | భవిష్యత్తులో మగవాళ్లు ఉండరా? 'Y క్రోమోజోమ్' మాయమవుతోందా? దాని క్షీణత వెనుక ఉన్న సైన్స్ ఏంటి?
- ●OpenAI | చాట్ జీపీటీ ఇక మరింత వేగవంతం.. అప్‌గ్రేడ్ చేసిన ఓపెన్ ఏఐ..
- ●Megastar | గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని అర్ధరాత్రి దారి తప్పిన మెగాస్టార్ - సాయం చేసిన అభిమాని

CM Revanth Reddy | జగ్గారెడ్డి పిచ్చోడిలా తిరుగుతుండు : సీఎం రేవంత్ రెడ్డి

Itel | గృహోపకరణాల రంగంలోకి ఐటెల్.. చవక ధరలకే స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషిన్లు..

Uttamkumar Reddy | స్మార్ట్ కార్డుల ప్రయత్నాన్ని అభినందించండి.. కేంద్రం సన్న బియ్యానికి ఖర్చు భరిస్తే మోదీ ఫొటో పెడతాం

Y chromosome Disappearing | భవిష్యత్తులో మగవాళ్లు ఉండరా? 'Y క్రోమోజోమ్' మాయమవుతోందా? దాని క్షీణత వెనుక ఉన్న సైన్స్ ఏంటి?



