TGSPDCL | అవినీతి, విధుల పట్ల నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం ఉపేక్షించం
TGSPDCL | హైదరాబాద్‌లోని దక్షిణ సర్కిల్ పరిధిలోని చాంద్రాయణగుట్ట సెక్షన్ కార్యాలయంలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ సోమవారం ఉదయం అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రత్యేక పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవు
విద్యుత్ బకాయి వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి
ఆదాయ నష్టాలను అరికట్టాలి
సిస్టమ్ ఇంప్రూవ్‌మెంట్‌తో నాణ్యమైన
నిరంతర విద్యుత్ సరఫరా అందించాలి
చాంద్రాయణగుట్ట సెక్షన్‌లో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ పర్యటన
TGSPDCL | త్రినేత్ర న్యూస్ :హైదరాబాద్‌లోని దక్షిణ సర్కిల్ పరిధిలోని చాంద్రాయణగుట్ట సెక్షన్ కార్యాలయంలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ సోమవారం ఉదయం అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రత్యేక పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విధుల నిర్వహణ, సమయపాలన, విద్యుత్ సరఫరా నాణ్యత, ఆదాయ వసూళ్లు, వినియోగదారులకు అందిస్తున్న సేవలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఉద్యోగి సమయానికి విధులకు హాజరై, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, తమ పనితీరు ద్వారా సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలతో పాటు అవసరమైతే బదిలీలు కూడా చేపడతామని తెలిపారు.
విద్యుత్ పంపిణీ వ్యవస్థలో సిస్టమ్ ఇంప్రూవ్‌మెంట్‌కు ప్రాధాన్యతనిస్తూ అన్ని కేటగిరీల వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని ఆదేశించారు. విద్యుత్ వ్యవస్థలోని లోపాలను గుర్తించి ఎప్పటికప్పుడు సరిదిద్దాలని, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. చాంద్రాయణగుట్టతో పాటు దక్షిణ సర్కిల్ పరిధిలో విద్యుత్ మీటర్లను ఇళ్ల బయట ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. దీనివల్ల మీటర్ రీడర్లు సకాలంలో రీడింగ్ తీసుకునేందుకు వీలవుతుందని, వినియోగదారులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన సేవలు అందించవచ్చని తెలిపారు.
విద్యుత్ బకాయిలు ఉన్న డిఫాల్టర్ సర్వీసులను క్షేత్రస్థాయిలో సందర్శించి, పెండింగ్ బిల్లులు, బకాయిలను పూర్తిస్థాయిలో వసూలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యుత్ ఆదాయ నష్టాలను అరికట్టేందుకు ఇంజినీర్లందరూ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సూచించారు. ఆదాయ వసూళ్లు మెరుగుపడితే దక్షిణ సర్కిల్‌కు మరిన్ని నిధులు కేటాయించి, అవసరమైన మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ సమావేశంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) డాక్టర్ ఎన్. నర్సింహులు, చీఫ్ ఇంజినీర్ (మెట్రో) పి. కరుణాకర్ బాబు, సూపరింటెండింగ్ ఇంజినీర్ (సౌత్) టి. శ్రీనివాసు, డీఈ (చార్మినార్) ఎం. శ్రీధర్, డీఈ (అస్మాన్‌గఢ్) విష్ణువర్ధన్ రెడ్డి, డీఈ (బేగంబజార్) అన్నయ్య, ఏడీలు, ఏఈలు, ఇతర అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sobhita Dhulipala | లిప్‌లాక్‌తో నాగచైతన్యకు బర్త్‌డే విషెస్ చెప్పిన శోభిత
- ●Eating Two Eggs A Day | నెల రోజుల పాటు రోజూ రెండు గుడ్లు తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
- ●Review on Global Summit | గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చే ప్రతినిధులకు పకడ్బందీ ఏర్పాట్లు ఉండాలి
- ●Supreme Court | ‘బాహుబలి’లా ప్రవర్తించడం మానుకోండి.. సెషన్స్ జడ్జిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
- ●DGP CV Anand | కర్రెగుట్టల్లోకి పర్యాటకులను అనుమతించొద్దు : డీజీపీ సీవీ ఆనంద్
- ●Sara Tendulkar | సారా టెండూల్కర్ పెళ్లిపై ప్రచారం.. రాజ్వీర్ డియోల్‌తో వివాహం నిజమేనా?

Sobhita Dhulipala | లిప్‌లాక్‌తో నాగచైతన్యకు బర్త్‌డే విషెస్ చెప్పిన శోభిత

Eating Two Eggs A Day | నెల రోజుల పాటు రోజూ రెండు గుడ్లు తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Review on Global Summit | గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చే ప్రతినిధులకు పకడ్బందీ ఏర్పాట్లు ఉండాలి

Supreme Court | ‘బాహుబలి’లా ప్రవర్తించడం మానుకోండి.. సెషన్స్ జడ్జిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం





