త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sara Tendulkar | సారా టెండూల్కర్ పెళ్లిపై ప్రచారం.. రాజ్‌వీర్ డియోల్‌తో వివాహం నిజమేనా?

Sara Tendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమార్తె సారా టెండూల్కర్‌ పెళ్లిపై సోషల్‌ మీడియాలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌ కుమారుడు రాజ్‌వీర్‌ డియోల్‌ను సారా వివాహం చేసుకోబోతున్నారన్న వార్త‌లు వైర‌ల్‌గా మారాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సారాకు సన్నిహిత వర్గాలు స్పష్టం చేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.

P

Sports | Published On Nov 23, 2026, 3.22 pm IST

Sara Tendulkar | సారా టెండూల్కర్ పెళ్లిపై ప్రచారం.. రాజ్‌వీర్ డియోల్‌తో వివాహం నిజమేనా?
Advertisement

Sara Tendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమార్తె సారా టెండూల్కర్‌ పెళ్లిపై సోషల్‌ మీడియాలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌ కుమారుడు రాజ్‌వీర్‌ డియోల్‌ను సారా వివాహం చేసుకోబోతున్నారన్న వార్త‌లు వైర‌ల్‌గా మారాయి. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సారాకు సన్నిహిత వర్గాలు స్పష్టం చేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.

అసలు ఏం జరిగింది?

సారా, రాజ్‌వీర్‌ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలను సారా సన్నిహిత వర్గాలు ఖండించినట్లు సమాచారం. అంతేకాదు.. వీరిద్దరూ ఇప్పటివరకు కనీసం వ్యక్తిగతంగా కలుసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం సారా సింగిల్‌గా ఉంటూ తన కెరీర్‌పై దృష్టి సారించారని సన్నిహిత వర్గాలు తెలిపినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. దీంతో వీరి పెళ్లిపై జరుగుతున్న ప్రచారానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టమవుతోంది.

ఘనంగా కాదు.. సింపుల్‌గా పెళ్లి చేసుకోవాల‌ని..

గతంలో ఓ సందర్భంలో సారా తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్ల‌డించింది. తన సోదరుడు అర్జున్‌ టెండూల్కర్‌ వివాహాన్ని తన పెళ్లికి ఓ ట్రయల్‌ రౌండ్‌గా భావించినట్లు చెప్పింది. చిన్నతనంలో తన పెళ్లి ఎంతో ఘనంగా, వైభవంగా జరగాలని కలలు కనేదాన్నని పేర్కొంది. ఇప్పుడు తన ఆలోచనలు మారాయని, ప్రైవేట్‌గా, నిరాడంబరంగా వివాహం చేసుకోవాలని ఉందని వెల్డించింది. సంప్రదాయ ఎరుపు రంగు దుస్తుల్లో పెళ్లి కూతురిగా ముస్తాబవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ఈ సంద‌ర్భంగా వివాహ బంధం గురించి కూడా సారా తన అభిప్రాయాలను పంచుకున్న‌ది. పెళ్లికి ముందే కొందరు తమ భాగస్వామి, వారి కుటుంబ సభ్యుల అసలు స్వభావాన్ని తెలుసుకుంటారని, ఆ తర్వాత ఆ బంధాన్ని కొనసాగించలేమని నిర్ణయించుకుంటారని పేర్కొంది. అలాంటి పరిస్థితుల్లో పెళ్లికి ముందే సంబంధం నుంచి బయటకు రావడం మంచి నిర్ణయమని సారా అభిప్రాయ‌ప‌డింది.

రాజ్‌వీర్‌ డియోల్‌ కెరీర్‌..

ఇక రాజ్‌వీర్‌ డియోల్‌ విషయానికొస్తే.. ఆయన బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్ త‌న‌యుడు. దివంగత నటుడు ధర్మేంద్ర మనవడు. కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ నటనారంగంలోకి అడుగుపెట్టాడు. దర్శకుడు అవ్నీష్‌ బర్జాత్యా తెరకెక్కించిన 'దోనో' సినిమాతో హీరోగా బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. రాజ్‌వీర్‌కు కరణ్‌ డియోల్‌ అనే అన్నయ్య ఉన్నాడు. అయితే, సారా టెండూల్కర్‌, రాజ్‌వీర్‌ డియోల్‌ పెళ్లిపై వస్తున్న వార్తలు కేవలం సోషల్‌ మీడియా ప్రచారాలేనని తెలుస్తోంది. వీరి వివాహంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Advertisement
Advertisement