త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DGCA | ప‌శ్చిమాసియా సంక్షోభం.. ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ అడ్వైజ‌రీ..!

DGCA | పశ్చిమ ఆసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (Directorate General of Civil Aviation) అత్య‌వ‌స‌ర అడ్వైజ‌రీ జారీ చేసింది. ఆ ప్రాంతంలోని పలు దేశాలగుండా ప్ర‌యాణించ‌కుండా ఉండాల‌ని వియాన‌యాన సంస్థ‌ల‌కు సూచించింది.

P

National | Published On Mar 20, 2026, 5.32 pm IST

DGCA | ప‌శ్చిమాసియా సంక్షోభం.. ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ అడ్వైజ‌రీ..!
Advertisement

DGCA | పశ్చిమ ఆసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (Directorate General of Civil Aviation) అత్య‌వ‌స‌ర అడ్వైజ‌రీ జారీ చేసింది. ఆ ప్రాంతంలోని పలు దేశాలగుండా ప్ర‌యాణించ‌కుండా ఉండాల‌ని వియాన‌యాన సంస్థ‌ల‌కు సూచించింది. ఇటీవల యూఎస్‌, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై నిర్వహించిన సైనిక దాడులు జ‌రుప‌గా.. టెహ్రాన్ సైతం ధీటుగా స్పందించ‌డంతో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దాంతో పౌర విమానాల‌కు ముప్పు నెల‌కొంద‌ని డీజీసీఏ పేర్కొంది. డీజీసీఏ సూచనల మేరకు భారత విమానయాన సంస్థలు బ‌హ్రెయిన్‌, ఇరాన్‌, ఇరాక్‌, ఇజ్రాయెల్‌, జోర్డాన్‌, కువైట్‌, లెబ‌నాన్‌, ఖ‌తార్‌, యూఏఈ ఎయిర్ స్పేస్ నుంచి వెల్ల‌కూడ‌ద‌ని.. అయితే, ఒమ‌న్‌, సౌదీ అరేబియా మీదుగా కొన్ని ప‌రిమితుల‌తో విమానాల ప్ర‌యాణానికి అనుమ‌తి ఉంటుంద‌ని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో 32వేల అడుగుల కంటే తక్కువ ఎత్తులో (FL320 కంటే దిగువన) ప్రయాణించరాదని స్పష్టంగా ఆదేశించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో సైనిక చర్యలు, ప్రతిదాడులు కొనసాగుతుండటంతో విమాన ప్రయాణాలకు తీవ్రమైన ప్రమాదం ఉందని డీజీసీఏ పేర్కొంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి అని తెలిపింది. విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. అవసరమైతే మార్గం మళ్లింపు (రిరూటింగ్), అత్యవసర ల్యాండింగ్ వంటి చర్యలు తీసుకునేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. అలాగే, పైలట్లు తాజా నాటోమ్స్ (Notice to Airmen) సమాచారం నిరంతరం ప‌రిశీలించాల‌ని సూచించింది. త‌ద్వారా గగనతల పరిమితులు, వాతావరణ పరిస్థితులపై కీలక సమాచారం అందుతుంద‌ని పేర్కొంది.

ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రాగా.. మార్చి 28 వ‌ర‌కు అమ‌లులో ఉంటాయ‌ని తెలిపింది. ఈ నేపథ్యంలో విమానాల షెడ్యూల్స్‌లో మార్పులు, ఆలస్యం చోటుచేసుకునే అవకాశం ఉంద‌ని విమానయాన సంస్థలు హెచ్చరించాయి. ఇండిగో సంస్థ ఢిల్లీ, బెంగళూరు విమానాల రాకపోకల్లో తాత్కాలిక అంతరాయం ఉండవచ్చని తెలిపింది. అలాగే ఎయిర్ ఇండియా ఉత్తర భారతదేశంలో వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో సేవలు ప్రభావితమయ్యే అవకాశముందని తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే ప్రధాన లక్ష్యమని డీజీసీఏ స్పష్టం చేసింది. అన్ని విమానయాన సంస్థలు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.

Advertisement
Advertisement