CM Revanth Reddy | మిగిలిన 9.56 లక్షల ఇండ్లను కేటాయించండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
CM Revanth Reddy | పీఎంఏవై జీ పథకంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రానికి 2 లక్షల ఇండ్లను కేటాయించిన సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర డిమాండ్‌కు అనుగుణంగా మిగిలిన 9.56 లక్షల ఇండ్లను కేటాయించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : పీఎంఏవై జీ పథకంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రానికి 2 లక్షల ఇండ్లను కేటాయించిన సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర డిమాండ్‌కు అనుగుణంగా మిగిలిన 9.56 లక్షల ఇండ్లను కేటాయించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. హైదరాబాద్ మాదాపూర్‌లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను సీఎం రేవంత్ కలిశారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయాలని గత జూలైలో కేంద్రమంత్రికి ఢిల్లీలో సీఎం వినతి పత్రం అందించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంపై కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో విద్యుత్ వినియోగం పెరిగిందని తెలిపారు. ఎల్‌నినో నేపథ్యంలో తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని వివరించారు. వ్యవసాయ రంగంలో ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని కోరారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ అందించి ప్రోత్సహిస్తున్నామన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులకు ప్రోత్సహిస్తున్నామని వివరించారు. 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్స్, వెజిటెబుల్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పంట మార్పిడిపై రైతులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించి సహకరించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
తాజావార్తలు
- ●Stock Markets | తగ్గిన ముడి చమురు ధరలు.. స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●Nizamabad | పొరపాటున పేలిన తుపాకీ.. ఇన్స్పెక్టర్ మృతి
- ●Hyderabad | వనస్థలిపురంలో పాల వ్యాపారిపై కత్తితో దాడి
- ●Cyberabad Police | మధ్యాహ్నం 2 గంటలకే లాగౌట్ అవ్వండి..
- ●Vemulawada | వేములవాడ రాజన్నకు భారీగా ఆదాయం..
- ●KCR Farm House | కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు..!









