Nizamabad | పొరపాటున పేలిన తుపాకీ.. ఇన్‌స్పెక్టర్ మృతి
Nizamabad | పొరపాటున తుపాకీ పేలింది. ఆ బుల్లెట్ పోలీసు శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు.
Nizamabad | త్రినేత్ర.న్యూస్ : పొరపాటున తుపాకీ పేలింది. ఆ బుల్లెట్ పోలీసు శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ హెచ్ సతీశ్ రాత్రి విధులు ముగించుకుని శుక్రవారం తెల్లవారుజామున పోలీసు హెడ్ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత తుపాకీని శుభ్రం చేస్తుండగా.. అది పొరపాటున పేలింది. దీంతో బుల్లెట్ సతీశ్ శరీరంలోకి చొచ్చుకెళ్లింది. తీవ్ర రక్తస్రావం జరిగి సతీశ్ ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలాన్ని నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
తాజావార్తలు
- ●Hyderabad | వనస్థలిపురంలో పాల వ్యాపారిపై కత్తితో దాడి
- ●Cyberabad Police | మధ్యాహ్నం 2 గంటలకే లాగౌట్ అవ్వండి..
- ●Vemulawada | వేములవాడ రాజన్నకు భారీగా ఆదాయం..
- ●KCR Farm House | కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు..!
- ●Road Accident | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
- ●Youtuber Haribabu | యూట్యూబర్ హరిబాబు హత్య కేసులో కీలక పరిణామం..








