Delhi Police | నిరసనకు అనుమతి లేదు.. చట్టాన్ని ఉల్లంఘించారు
Delhi Police | దేశ రాజధాని ఢిల్లీలో అక్టోబర్ 10న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసన, పార్టీ నేతల నిర్బంధం, శాంతిభద్రతల పరిస్థితిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. నిరసనకు సీజేపీ అనుమతి తీసుకోలేదని, చట్ట నిబంధనలను పాటించలేదని ఢిల్లీ పోలీస్ పీఆర్వో డీసీపీ నేహా యాదవ్ స్పష్టం చేశారు.
- అభిజీత్ దీపక్‌కు సాయం చేస్తామని చెప్పాం.. ఆయనే నిరాకరించారు
- ఢిల్లీలో సీజేపీ ఆందోళనపై పోలీసుల ప్రకటన
Delhi Police | దేశ రాజధాని ఢిల్లీలో అక్టోబర్ 10న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసన, పార్టీ నేతల నిర్బంధం, శాంతిభద్రతల పరిస్థితిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. నిరసనకు సీజేపీ అనుమతి తీసుకోలేదని, చట్ట నిబంధనలను పాటించలేదని ఢిల్లీ పోలీస్ పీఆర్వో డీసీపీ నేహా యాదవ్ స్పష్టం చేశారు.
అభిజీత్‌కు సాయం అందిస్తామని చెప్పాం
సీజేపీ నేత అభిజీత్ దీపక్ నానమ్మ మరణించిన విషయం తెలియగానే ఆయనను సంప్రదించి సంతాపం తెలిపామని నేహా యాదవ్ వెల్లడించారు. ఇంటికి వెళ్లాలన్నా, ఇతరత్రా సహాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పామన్నారు. స్వస్థలానికి వెళ్లేందుకు విమానం, బస్సు ఏర్పాటు చేయాలా? అని అడిగామని తెలిపారు. తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడాలనుకుంటే ఆ ఏర్పాట్లు కూడా చేస్తామని వివరించారు. అవసరమైన సహాయం ఏదైనా నిరభ్యంతరంగా అడగవచ్చని చెప్పినా అభిజీత్ నిరాకరించారని పేర్కొన్నారు.
ఎన్నికల సంఘంపై పోరాటమంటూ సీజేపీ..
మరోవైపు, సీజేపీ తరఫున అంతకుముందు ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ సహ కన్వీనర్, అధికార ప్రతినిధి ఆశుతోష్ రంకా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. గత 72 గంటల్లో దేశంలో ఎవరూ ఊహించని ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. దేశాన్ని కాపాడి ముందుకు తీసుకెళ్లాల్సిన ఎన్నికల సంఘం తన బాధ్యతలను విస్మరించిందని ఆరోపించారు. బీజేపీ విజయానికి అనుకూలంగా జ్ఞానేశ్ కుమార్ పనిచేస్తున్నారని విమర్శించారు.
మోదీ, షా వైపు మళ్లి పోరాటం
తొలుత తమ నిరసన ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రారంభమైందని ఆశుతోష్ రంకా తెలిపారు. అయితే, ఇప్పుడు ఈ పోరాటం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతోందని వ్యాఖ్యానించారు. జ్ఞానేశ్ కుమార్‌ను ఎలాగైనా కాపాడాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం వ్యవహారంపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ponguleti Srinivas Reddy | రైతన్నలూ! మా మాట వినండి.. యాసంగి పంట వద్దు
- ●Sreeleela | కుందేళ్లతో శ్రీలీల ఆటలు - వీకెండ్ వైబ్స్ అదుర్స్
- ●Tirumala Brahmotsavam | తిరుమలలో బ్రహ్మోత్సవాలు.. ఆ వైభవం వెనుక అసలు కథ!
- ●Ramayana | అఫీషియల్ - రామాయణ రిలీజ్ డేట్ ఫిక్స్ - మైథాలజీ మూవీపై కనిపించని బజ్
- ●Komatireddy Rajagopal Reddy | ఏదుల నుంచి మునుగోడుకు నీళ్లు తరలించాల్సిందే.. రాజీపడే ప్రసక్తే లేదు
- ●Charan Koushik Yadav | కాంగ్రెస్ అకౌంట్లో 900 కోట్లుంటే.. బీఆర్ఎస్ అకౌంట్లోకి 1500 కోట్లు ఎట్లొచ్చినయ్

Ponguleti Srinivas Reddy | రైతన్నలూ! మా మాట వినండి.. యాసంగి పంట వద్దు

Sreeleela | కుందేళ్లతో శ్రీలీల ఆటలు - వీకెండ్ వైబ్స్ అదుర్స్

Tirumala Brahmotsavam | తిరుమలలో బ్రహ్మోత్సవాలు.. ఆ వైభవం వెనుక అసలు కథ!

Ramayana | అఫీషియల్ - రామాయణ రిలీజ్ డేట్ ఫిక్స్ - మైథాలజీ మూవీపై కనిపించని బజ్






