Pet Dog | కుక్క కడుపులో సూది, దారం ఉండ.. కాపాడటానికి ఢిల్లీ నుంచి డాక్టర్
Pet Dog | ఓ వ్యక్తి అల్లారుముద్దుగా కుక్కను (Pet Dog) పెంచుకుంటున్నాడు. మూడేండ్ల వయసున్న ఆ శునకం అనుకోకుండా ఓ రోజు అనారోగ్యం పాలైంది. దీంతో దవాఖానకు తీసుకెళ్లగా.. కడుపులో ఉన్న సూది, దారపు ఉండ దానికి కారణమని గుర్తించారు.
Pet Dog | త్రినేత్ర.న్యూస్: ఓ వ్యక్తి అల్లారుముద్దుగా కుక్కను (Pet Dog) పెంచుకుంటున్నాడు. మూడేండ్ల వయసున్న ఆ శునకం అనుకోకుండా ఓ రోజు అనారోగ్యం పాలైంది. దీంతో దవాఖానకు తీసుకెళ్లగా.. కడుపులో ఉన్న సూది, దారపు ఉండ దానికి కారణమని గుర్తించారు. స్థానిక వైద్యులు వాటిని తీయడానికి యత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా డాక్టర్‌ను పిలిపించి.. దానికి బతికించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరిగింది.
విశాఖపట్నానికి ఓ వ్యక్తి గోల్డెన్ రిట్రీవర్ (Golden Retriever) జాతికి చెందిన పెంపుడు కుక్క (3) ఉన్నది. అది కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో దానిని ఫిబ్రవరి 5న ఓ పెట్‌డాగ్ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ దానిని పరిశీలించిన డాక్టర్ శ్రీధర్.. ఎక్స్‌రే తీసి కుక్క పొట్టలో దారపు ఉండ, సూది ఉన్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్సతో బయటకు తీయడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఆ కుక్కకు ప్లేట్లెట్స్ పడిపోవడంతో సాధ్యం కాలేదు.
ఆందోళనకు గురైన దాని యజమాని.. ఎలాగైనా తన కుక్కను బతికించాలని డాక్టర్ శ్రీధర్‌ను వేడుకున్నారు. దీంతో ఆయన ఢిల్లీలో ఉన్న తన స్నేహితుడు, వెటర్నరీ స్పెషలిస్ట్ డాక్టర్ విక్రమ్ మల్హోత్రకు పరిస్థితి వివరించారు. మరుసటి రోజే సర్జరీకి అవసరమైన పరికరాలతో విశాఖకు చేరుకున్నారు. అదే రోజు ఎండోస్కోపీ విధానంలో 45 నిమిషాలు శ్రమించి కుక్క పొట్టలో నుంచి సూది, దారపు ఉండను తొలగించారు. దీంతో మరణం అంచులదాకా వెళ్లిన ఆ కుక్కకు ప్రాణాపాయం తప్పింది. తన శునకానికి పునర్జన్మ ప్రసాదించిన వైద్యులకు దాని యజమాని కృతజ్ఞతలు తెలిపారు.
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైన డిప్యూటీ సీఎం
మే 19, 2026

Longest Non-Stop Train | దేశంలో ఒక్కచోట కూడా ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది?
మే 17, 2026

Rajdhani Express | షార్ట్ సర్క్యూట్‌తో.. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణనష్టం
మే 17, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



