Bomb Threat | ఢిల్లీ కోర్టుకు బాంబు బెదిరింపులు..!
Bomb Threat | దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకా కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఇ-మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో సమాచారం అందుకున్న పోలీసులు, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కోర్టు వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టాయి.
Bomb Threat | దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకా కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఇ-మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో సమాచారం అందుకున్న పోలీసులు, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కోర్టు వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టాయి. బాంబు డిస్పోజల్, స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్ జల్లెడపట్టగా అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువులు కనిపించలేదు. సైబర్ సెల్ బెదిరింపు ఇ-మెయిల్‌ను పరిశీలిస్తున్నది. అలాగే, గురుగ్రామ్‌లోని 13 ప్రైవేటు పాఠశాలలను పేల్చేస్తామని బెదిరింపు ఇ-మెయిల్స్ వచ్చాయి. దాంతో ఒక్కసారిగా పాఠశాలల్లో ఆందోళన నెలకొంది. ఈ ఇమెయిల్స్ అందడంతో యాజమాన్యాలు ముందు జాగ్రత్తగా పాఠశాలలకు సెలవు ప్రకటించాయి.
పోలీసులకు సమాచారం అందించగా.. సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పిల్లలు స్కూల్‌కు వస్సున్న సమయంలోనే ఆయా పాఠశాలలకు వేర్వేరు సమయాల్లో ఉదయం సమయంలో బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి. సమాచారం అందుకున్న వెంటనే, బాంబు స్క్వాడ్‌లు, డాగ్ స్క్వాడ్‌లు, ఎస్‌డీఆర్ఎఫ్, పోలీసులు ఆయా పాఠశాలలకు చేరుకొని పరిశీలించారు. అలాగే, పాఠశాలలకు సమీపంలో ఉన్న సున్నిత ప్రాంతాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, ఆట స్థలాలు, పూలకుండీలు సహా సాధ్యమైన ప్రతీచోట క్షుణ్ణంగా పరిశీలించగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరక్కపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం పాఠశాలలకు బెదిరింపు ఇమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గతంలోనూ ఢిల్లీలో పెద్ద ఎత్తున పాఠశాలలతో పాటు ఎయిర్‌పోర్ట్స్, విమానాలకు బెదిరింపు ఇమెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






