ఢిల్లీకి వెళ్లే ప్లాన్స్ ఉంటే వెంటనే క్యాన్సిల్ చేసుకోండి
మున్సిపల్ సాలిడ్ వేస్ట్, నిర్మాణ వ్యర్థాలు ఎక్కడివక్కడ పేరుకుపోవడంతో కాలుష్యం పెరుగుతోందని అధికారులు గుర్తించారు. దాని కోసం మెకానికల్ స్వీపింగ్, నీళ్లు చల్లడం వంటి కార్యక్రమాలు చేపడుతూ.. చెత్తను బహిరంగంగా కాల్చడాన్ని నిరోధించాలని అధికారులను ఆదేశించారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 452 కి చేరింది. దేశ రాజధానిని విషపు పొగమంచు మొత్తం కమ్మేసింది. దీంతో ఢిల్లీలోని గాలి నాణ్యత అత్యంత తీవ్రమైన కేటగిరీలో చేరింది. డిసెంబర్ 14న సాయంత్రం ఏక్యూఐ 461గా నమోదు కాగా, సోమవారం ఉదయం 452 గా నమోదైంది. దీని వల్ల విజిబిలిటీ తగ్గిపోయింది. ఎక్కడ చూసినా దట్టమైన విషపూరితమైన పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..
ఏక్యూఐ ఎంత ఉండాలి?
సాధారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 50 వరకు ఉంటే ఆ గాలిలో ఎలాంటి కాలుష్యం లేనట్టుగా భావించాలి. ఆ ఇండెక్స్ ఎక్కువగా అడవులు ఉన్న ప్రాంతాల్లో, చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉంటుంది. 51 నుంచి 100 వరకు ఉంటే ఇండెక్స్ ఓకే. 101 నుంచి 200 అంటే మధ్యస్థంగా భావించాలి. 201 నుంచి 300 ఉన్నా పూర్ కేటగిరీ కిందికి వస్తుంది. 301 నుంచి 400 లోపు ఉంటే వెరీ పూర్ కేటగిరీ, 401 నుంచి 500 అంటే దాన్ని సివియర్ కేటగిరీలో చూస్తారు.
చర్యలు ప్రారంభించిన అధికారులు
ఎన్‌సీఆర్ పరిధిలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో అక్కడి అధికారులు వెంటనే చర్యలు ప్రారంభించారు. కాలుష్య నియంత్రణ కోసం చర్యలు చేపట్టారు. వెంటనే కొన్ని బృందాలను రంగంలోకి దించారు. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో 136 రోడ్డు మార్గాలను తనిఖీలు చేస్తున్నారు. అందులో కొన్ని ప్రాంతాల్లో దుమ్ము స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
మున్సిపల్ సాలిడ్ వేస్ట్, నిర్మాణ వ్యర్థాలు ఎక్కడివక్కడ పేరుకుపోవడంతో కాలుష్యం పెరుగుతోందని అధికారులు గుర్తించారు. దాని కోసం మెకానికల్ స్వీపింగ్, నీళ్లు చల్లడం వంటి కార్యక్రమాలు చేపడుతూ.. చెత్తను బహిరంగంగా కాల్చడాన్ని నిరోధించాలని అధికారులను ఆదేశించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






