త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Air Quality Index | అస‌లు AQI అంటే ఏమిటి..? మ‌న ఏరియాలో ఎంత AQI ఉందో ఎలా తెలుసుకోవాలి..?

Air Quality Index | ప్రస్తుతం రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా అనేక న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మ‌ధ్యే ల‌క్నోలో తీవ్ర‌మైన పొగ‌మంచు, కాలుష్యం కార‌ణంగా భార‌త్‌, సౌతాఫ్రికాల మ‌ధ్య జ‌ర‌గాల్సిన ఓ టీ20 మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు.

S

Lifestyle | Published On Dec 21, 2025, 5.01 pm IST

Air Quality Index | అస‌లు AQI అంటే ఏమిటి..? మ‌న ఏరియాలో ఎంత AQI ఉందో ఎలా తెలుసుకోవాలి..?
Advertisement

Air Quality Index | ప్రస్తుతం రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా అనేక న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మ‌ధ్యే ల‌క్నోలో తీవ్ర‌మైన పొగ‌మంచు, కాలుష్యం కార‌ణంగా భార‌త్‌, సౌతాఫ్రికాల మ‌ధ్య జ‌ర‌గాల్సిన ఓ టీ20 మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. దీన్ని బ‌ట్టి చూస్తే గాలి కాలుష్యం ప్ర‌స్తుతం ఎంత తీవ్రంగా ఉంద‌న్న‌ విష‌యం అంద‌రికీ స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు ఎక్క‌డ చూసినా AQI అనే మాట బాగా వినిపిస్తోంది. ఢిల్లీ స‌హా చాలా చోట్ల AQI స్థాయిలు బాగా పెరిగాయ‌ని, కాలుష్యం విప‌రీతంగా పెరిగిపోయింద‌ని అంటున్నారు. అయితే అస‌లు AQI అంటే ఏమిటి..? దీన్ని ఎలా కొలుస్తారు..? మ‌న దగ్గ‌ర లేదా మ‌నం ఉంటున్న ఏరియా AQI ఎంత ఉంది అన్న విష‌యాన్ని మ‌నం ఎలా తెలుసుకోవాలి..? వ‌ంటి వివ‌రాల‌ను నిపుణులు వెల్ల‌డిస్తున్నారు.

AQI అంటే..?

AQI అంటే.. Air Quality Index అన్న దానికి సంక్షిప్త ప‌దం. AQI అంటే.. ఏదైనా ఒక ప్ర‌దేశంలో గాలి నాణ్య‌త ఎలా ఉంది..? అన్న విష‌యాన్ని తెలియజేసే ఒక సూచిక‌గా చెప్ప‌వ‌చ్చు. AQI ని సాధార‌ణంగా 0 నుంచి 500 మ‌ధ్య స్కేలుతో కొలుస్తారు. ఈ సంఖ్య ఎంత ఎక్కువ‌గా ఉంటే AQI అంత అధికంగా ఉన్న‌ట్లు. అంటే సంఖ్య ఎక్కువ‌గా ఉంటే గాలిలో కాలుష్య కార‌కాలు అంత ఎక్కువగా ఉన్నాయ‌ని, గాలి బాగా కాలుష్య‌మయంగా మారింద‌ని అర్థం చేసుకోవాలి. గాలిలో ఉండే కాలుష్య కార‌కాల స్థాయిని బ‌ట్టి AQIని నిర్ణ‌యిస్తారు. ఈ క్ర‌మంలోనే AQI విలువ ఎక్కువ‌గా ఉంది అంటే గాలిలో కాలుష్య కార‌కాలు అధికంగా ఉన్నాయ‌ని అర్థం చేసుకోవాలి. ఇక AQI విలువ చాలా త‌క్కువ‌గా ఉంటే గాలిలో కాలుష్య కార‌కాలు స్వ‌ల్పంగా ఉన్నాయ‌ని, గాలి చాలా స్వ‌చ్ఛంగా ఉంద‌ని అర్థం చేసుకోవాలి. క‌నుక‌నే AQI అనే ప‌దాన్ని ఎక్కువ‌గా వింటున్నాం. ఢిల్లీలోనూ కాలుష్య తీవ్రత లేదా AQI 400కు పైన న‌మోదు అవుతుంద‌ని చెబుతున్నారు. అంటే అక్క‌డి గాలిలో కాలుష్య కార‌కాలు మ‌రీ అధికంగా ఉన్నాయ‌ని, గాలి పూర్తిగా కాలుష్య‌మ‌యంగా మారి ప్ర‌మాద‌క‌రంగా ప‌రిణమించింద‌ని అర్థ‌మ‌వుతుంది. ఈ క్ర‌మంలోనే ఢిల్లీ గురించి వార్త‌లు ప‌దే ప‌దే ప్ర‌సారం అవుతున్నాయి.

ప‌లు రంగుల ద్వారా..

అయితే AQI ని సాధార‌ణంగా ప‌లు విభాగాల ద్వారా సూచిస్తారు. అంటే గాలి స్వ‌చ్ఛంగా ఉంటే AQI విలువ 0 (సున్నా) నుంచి 50 మ‌ధ్య‌లో ఉంటుంది. ఇలాంటి వాతావ‌ర‌ణంలో మ‌నం నివ‌సించాల‌న్న‌మాట‌. దీన్ని AQI బార్‌లో గ్రీన్ క‌ల‌ర్‌తో సూచిస్తారు. ఇక AQI విలువ 51 నుంచి 100 మ‌ధ్య‌లో ఉంటే ఆ సూచిక‌ను పసుపు రంగులో తెలియ‌జేస్తారు. దీన్ని బ‌ట్టి గాలిలో స్వ‌ల్ప మోతాదులో కాలుష్య కార‌కాలు ఉన్నాయ‌ని అర్థం చేసుకోవాలి. అదే AQI విలువ 101 నుంచి 150 మ‌ధ్య ఉంటే దాన్ని ఆరెంజ్ క‌ల‌ర్‌తో సూచిస్తారు. అలాంటి గాలిని పీల్చ‌డం, అలాంటి వాతావ‌ర‌ణంలో ఉండ‌డం మంచిది కాదు. ఇక AQI విలువ 151 నుంచి 200 మ‌ధ్య ఉంటే దాన్ని ఎరుపు రంగుతో బార్‌పై సూచిస్తారు. ఇలాంటి వాతావ‌ర‌ణం చాలా ప్ర‌మాద‌క‌రం. అలాగే AQI విలువ 201 నుంచి 300 మ‌ధ్య ఉంటే దాన్ని ప‌ర్పుల్ రంగుతో సూచిస్తారు. ఈ వాతావ‌ర‌ణం కూడా మ‌న‌కు ప్ర‌మాద‌క‌ర‌మే. అదేవిధంగా 301 లేదా ఆపైన AQI విలువ ఉంటే దాన్ని మెరూన్ రంగుతో సూచిస్తారు. ఇలాంటి గాలిలో మ‌నం అస‌లు ఒక్క నిమిషం కూడా ఉండ‌కూడ‌దు. ఇది విషంతో స‌మానం. ఇలాంటి గాలి మ‌న ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంది. క‌నుక ఇలాంటి వాతావ‌ర‌ణం మ‌న‌కు మంచిది కాదు. ఇక ఢిల్లీతోపాటు ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు న‌గ‌రాల్లో AQI 400కు పైగానే ఉంటుండ‌డం గ‌మ‌నార్హం. అంటే గాలి కాలుష్యం ఎంత‌టి తీవ్ర స్థాయిలో ఉంద‌నే విష‌యం అర్థ‌మ‌వుతోంది.

గూగుల్ మ్యాప్స్ ద్వారా..

ఇక AQI విలువ‌ల‌ను మనం కొలువ‌లేము. కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి సంస్థ‌లు ప‌లు న‌గరాలు, ప‌ట్ట‌ణాల్లో ప్ర‌త్యేక ప‌రిక‌రాల‌ను ఏర్పాటు చేసి అక్క‌డి గాలి నాణ్య‌త ఎలా ఉంది..? అని తెలుసుకుంటారు. కాలుష్య కార‌కాల‌ను కొలుస్తారు. దీంతో AQI విలువ‌ను లెక్కించి తెలియ‌జేస్తారు. అయితే AQI విలువ మ‌నం ఉంటున్న లేదా మ‌న ఏరియాలో ఎంత ఉంద‌న్న విష‌యాన్ని కూడా సుల‌భంగానే తెలుసుకోవ‌చ్చు. అందుకు గాను గూగుల్ మ్యాప్స్ యాప్ ప‌నిచేస్తుంది. అందులో హోమ్ పేజీలో కుడి వైపు పై భాగంలో ఉండే లేయ‌ర్స్ అనే ఐకాన్‌పై ట్యాప్ చేసి ఓపెన్ చేయాలి. దీంతో ఓ విండో ప్ర‌త్య‌క్షం అవుతుంది. అందులో కింది భాగంలో ఎయిర్ క్వాలిటీ అని ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఓపెన్ చేస్తే గూగుల్ మ్యాప్స్ రంగు మారుతుంది. మీరు ఉంటున్న ఏరియా AQI ఎంతో అక్క‌డ కింద బార్ ద‌ర్శ‌న‌మిస్తుంది. దాని స‌హాయంతో మీ ఏరియాకు చెందిన AQI విలువ‌ను సులభంగా తెలుసుకోవ‌చ్చు. అలాగే గూగుల్ మ్యాప్స్‌లోని హోమ్ పేజీలోనే కింది భాగంలో ఉండే ఎక్స్‌ప్లోర్ అనే ఆప్ష‌న్‌ను ఓపెన్ చేస్తే అందులో కుడి వైపు మీది భాగంలో NAQI అని ఒక ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే మ‌రో విండో ప్ర‌త్య‌క్షం అవుతుంది. అందులో కింది భాగంలో ఎయిర్ క్వాలిటీ అనే సెక్ష‌న్‌లో మ‌ళ్లీ NAQI అని ఒక విలువ‌ను చూపిస్తుంది. అది కూడా AQI కింద‌కే వ‌స్తుంది. ఇలా గూగుల్ మ్యాప్స్ స‌హాయంతో ఏదైనా ఒక ఏరియాకు చెందిన AQI విలువ‌ను సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. మీ ప్రాంతంలో గాలి నాణ్య‌త ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement