Cyber Crime | వింగో యాప్‌ను బ్లాక్ చేసిన కేంద్రం.. టెలిగ్రామ్ ఛానెల్స్ సైతం మూసివేత..!
Cyber Crime | ఎస్ఎంఎస్ రాకెట్ వెలుగు చూడడంతో కేంద్ర ప్రభుత్వం వింగో యాప్‌ను బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ యాప్ వినియోగదారుల మొబైల్స్‌ను ఉపయోగించి పెద్ద ఎత్తున సైబర్ నేరాలకు పాల్పడుతోందంటూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ, యాంటీ సైబర్ క్రైమ్ ఏజెన్సీ, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) చర్యలు చేపట్టింది. వింగో యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో మల్టీప్లేయర్ గేమ్‌గా లిస్ట్ అయ్యింది. పలువురు ఒకేసారి లైవ్ గేమ్స్ ఆడే ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌గా భావించి పెద్ద ఎత్తున యూజర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. కానీ, గేమ్ ముసుగులో స్కామ్ జరుగుతోంది. యాప్‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో యాప్ బాగోతం వెలుగు చూసింది.
సైబర్ సెక్యూరిటీ పరిభాషలో వింగోను టెలికాం మ్యూల్ యాజ్ ఏ సర్వీస్ యాప్‌గా పిలుస్తారు. ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేస్తే.. యూజర్ల మొబైల్‌ను తన పరిధిలోకి తీసుకొని.. ఫోన్ నంబర్లను ఉపయోగించి ఆటోమేటిక్‌గా పలువురికి మెస్సేజ్‌లు పంపాయి. తమ ఫోన్‌లో ఏం జరుగుతుందో జరుగుతుందో యూజర్లకు తెలియకపోవడం గమనార్హం. ఏదైనా నేరం జరిగిన సమయంలో మొబైల్ యూజర్లు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. 14సీ దర్యాప్తులో దిగ్భ్రాంతిక విషయాలు వెల్లడయ్యాయి. ఈ నెట్‌వర్క్ ద్వారా ప్రతిరోజూ సుమారు 1.53 కోట్ల మందికి మోసపూరిత ఎస్ఎంఎస్‌లు పంపుతున్నట్లుగా తేలింది.
దాదాపు 1.53లక్షల మంది యాప్ డౌన్‌లోడ్ చేశారని.. వారికి తెలియకుండానే నేరాలకు సహాయం చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో కేంద్రం యాప్‌ను బ్లాక్ చేయడంతో పాటు యాప్‌ని ప్రచారం చేసే 50కిపైగా యూట్యూబ్ వీడియోలను, 1.53లక్షల మంది సభ్యులతో కూడిన నాలుగు టెలిగ్రామ్ ఛానెల్స్‌ను మూసివేసింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, I4సీ యాప్ కమాండ్ కంట్రోల్, కంట్రోల్ సెంటర్‌ను జియో బ్లాక్ చేశాయి. యాప్ ఇకపై భారత్‌లో పని చేయదు. ప్లే స్టోర్ నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా ఎస్ఎంఎస్‌లు పంపడం, ఫోన్ హార్డ్‌వేర్‌ను ఉపయోగించుకునేందుకు డబ్బులు చెల్లిస్తామనే యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






