త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వండి.. సీపీఎం నేతలను కోరిన పీసీసీ చీఫ్‌

Mahesh Kumar Goud | రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని సీపీఎం నేతలను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో కాంగ్రెస్‌ నేతలు ఆ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.

P

Telangana | Published On Oct 16, 2026, 9.30 pm IST

Mahesh Kumar Goud | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వండి.. సీపీఎం నేతలను కోరిన పీసీసీ చీఫ్‌
Advertisement

Mahesh Kumar Goud | రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని సీపీఎం నేతలను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో కాంగ్రెస్‌ నేతలు ఆ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్‌, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ, నాయకులు సాగర్‌, జ్యోతి, పోతినేని సుదర్శన్‌, బండారు రవికుమార్‌ పాల్గొన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతుతో పాటు జాతీయ రాజకీయ పరిస్థితులు, ఎస్‌ఐఆర్‌పై ఉమ్మడి పోరాటం తదితర అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తిపై సీపీఎం నేతలు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ అంశంపై శనివారం జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని వారు చెప్పినట్లు పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలన్నీ కలిసి ఎస్‌ఐఆర్‌పై ఉమ్మడి ఉద్యమం చేపట్టే అంశంపైనా చర్చించినట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement