త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSRTC | ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. దసరాకు 7వేల ప్రత్యేక బస్సులు!

TGSRTC | దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) 7 వేల ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 10 నుంచి ఇప్పటివరకు సుమారు 95 శాతం ప్రత్యేక బస్సులను విజయవంతంగా నడిపినట్లు సంస్థ వీసీ, ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. ఈ నెల 17, 18, 19 తేదీల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు.

P

Telangana | Published On Oct 16, 2026, 9.10 pm IST

TGSRTC | ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. దసరాకు 7వేల ప్రత్యేక బస్సులు!
Advertisement
  • ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు
  • జేబీఎస్‌లో ఏర్పాట్లను పరిశీలించిన టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
  • తిరుగు ప్రయాణానికి కూడా ప్రత్యేక బస్సులు

TGSRTC | దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) 7 వేల ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 10 నుంచి ఇప్పటివరకు సుమారు 95 శాతం ప్రత్యేక బస్సులను విజయవంతంగా నడిపినట్లు సంస్థ వీసీ, ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. ఈ నెల 17, 18, 19 తేదీల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జూబ్లీ బస్‌ స్టేషన్‌ (జేబీఎస్‌)ను ఎండీ నాగిరెడ్డి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు సీహెచ్ వెంకన్న, ఏ శ్రీధర్‌తో కలిసి పరిశీలించారు. అక్కడ ప్రత్యేక విధులు నిర్వహిస్తున్న సికింద్రాబాద్‌ ఆర్‌ఎం సుచరిత, కరీంనగర్‌ ఆర్‌ఎం రాజుతో బస్సుల నిర్వహణ, ట్రాఫిక్‌ పరిస్థితులపై సమీక్షించారు. గంటకు పైగా బస్‌స్టేషన్‌లో పర్యటించిన ఆయన ప్రయాణికులతో మాట్లాడి వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, మౌలిక వసతులపై ఆరా తీశారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.

రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు

ఈ నెల 17, 18 తేదీల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని నాగిరెడ్డి తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడపాలని అధికారులకు సూచించారు. ప్రత్యేక బస్సుల నిర్వహణలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. పండుగ అనంతరం తిరిగి నగరాలకు చేరుకునే ప్రయాణికుల కోసం కూడా భారీగా ప్రత్యేక సర్వీసులను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. బస్‌స్టేషన్లలో తాగునీరు, విశ్రాంతి వసతులు, పారిశుధ్యం, భద్రత విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎండీ తెలిపారు. ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ల కోసం టీజీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ www.tgsrtcbus.inను సందర్శించాలని సూచించారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన సమాచారం కోసం 040-69440000, 040-23450033 నంబర్లలో ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ను సంప్రదించాలని కోరారు. ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుని సురక్షితంగా, ప్రశాంతంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement