Cabinet Secretariat | క్యాబినెట్ సెక్రటేరియట్లో డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
Cabinet Secretariat | కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్లో (Cabinet Secretariat) ఖాళీగా ఉన్న డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ (టెక్నికల్) (DFO Technical) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 250 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
Cabinet Secretariat | త్రినేత్ర న్యూస్: కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్లో (Cabinet Secretariat) ఖాళీగా ఉన్న డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ (టెక్నికల్) (DFO Technical) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 250 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. అర్హులైనవారు నవంబర్ 15 వరకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్సైన్స్, ఎలక్ట్రానిక్స్, డాటా సైన్స్, ఫిజిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా గేట్ స్కోర్ (GATE Score), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారిక ప్రతి నెల రూ.100,000 వరకు వేతనం వస్తుంది.
పోస్టుపేరు: DFO Technical
మొత్తం ఖాళీలు: 250
కంప్యూటర్సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 112
ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్ లేదా టెలికమ్యూనికేషన్- 112
డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- 10
ఫిజిక్స్- 5
మెకానికల్ ఇంజినీరింగ్- 4
సివిల్ ఇంజినీరింగ్- 3
మ్యాథమెటిక్స్- 1
స్టాటిస్టిక్స్- 1
అర్హతలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ పోస్టులకు పీజీ పూర్తిచేయాలి. మిగిలిన పోస్టులకు సంబంధింత సబ్జెక్టులో ఇంజినీరింగ్ పూర్తి చేసి గేట్ వ్యాలీడ్ స్కోర్ ఉండాలి. 2026 నంబర్ 15 నాటికి 30 ఏండ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్లో
అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని, పూర్తిగా నింపి దానికి మెట్రిక్యులేషన్, 10+2, బీటెక్, ఎమ్మెస్సీ, బర్త్ సర్టిఫికెట్, గేట్ స్కోర్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికెట్ జతచేసి సంబంధిత అడ్రస్కు ఆర్డినరీ పోస్టులో పంపించాలి.
అడ్రస్: post to: Post Bag No. 001, Lodhi Road Head Post Office, New Delhi-110003.
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 15
వెబ్సైట్: https://cabsec.gov.in/
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Navaratri Brahmotsavam Special | 157 దేశాల కరెన్సీతో వెంకన్న హుండీ కళకళ!
- ●Boat Capsizes | గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు, చిన్నారులు సహా 14 మంది మృతి
- ●Horoscope | అక్టోబర్ 14 బుధవారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
- ●CP VC Sajjanar | సైబర్ వలలో చిక్కొద్దు.. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక సూచనలు
- ●V Srinivas Goud | రైతులను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
- ●Strategic MoU | తెలంగాణ–లివర్పూల్ మధ్య కీలక ఒప్పందం

Navaratri Brahmotsavam Special | 157 దేశాల కరెన్సీతో వెంకన్న హుండీ కళకళ!

Boat Capsizes | గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు, చిన్నారులు సహా 14 మంది మృతి

Horoscope | అక్టోబర్ 14 బుధవారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

CP VC Sajjanar | సైబర్ వలలో చిక్కొద్దు.. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక సూచనలు






