MEA | అక్టోబర్ 20న ముంబయిలో జైశంకర్–రూబియో భేటీ!
MEA | భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అక్టోబర్ 20న ముంబయిలో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. అమెరికా స్వాతంత్య్ర 250వ వార్షికోత్సవ వేడుకల్లోనూ జైశంకర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు.
- అక్టోబర్ 20న ముంబయిలో జైశంకర్–రూబియో భేటీ
- 19, 20 తేదీల్లో భారత్‌లో యూఏఈ విదేశాంగ మంత్రి పర్యటన..
- మాల్దీవులకు రూ.3,000 కోట్ల కరెన్సీ స్వాప్ పొడిగింపు
MEA | భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అక్టోబర్ 20న ముంబయిలో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. అమెరికా స్వాతంత్య్ర 250వ వార్షికోత్సవ వేడుకల్లోనూ జైశంకర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం అరోరాలో హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు వచ్చిన ఆరోపణలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయులు, భారత సంతతి ప్రజలపై జాతి వివక్ష, భారత్ వ్యతిరేక విద్వేషం, విద్వేష నేరాలు పెరుగుతుండటంపై జైస్వాల్ తీవ్ర ఆందోళన తెలిపారు. ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి, నిందితులకు కఠిన శిక్ష విధించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. అక్కడ నివసిస్తున్న భారతీయులు, హిందూ సమాజ భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
భారత్‌కు యూఏఈ విదేశాంగ మంత్రి
యూఏఈ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అక్టోబర్ 19, 20 తేదీల్లో ముంబయిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జైశంకర్ ఆయనకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. భారత్–యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఫిన్‌టెక్, రక్షణ, కనెక్టివిటీ రంగాల్లో సహకారాన్ని సమీక్షించి, ముందుకు తీసుకెళ్లడంపై ఇరుపక్షాలు చర్చించనున్నాయి. పశ్చిమాసియా పరిస్థితులు, అంతర్జాతీయ, బహుపాక్షిక అంశాలపైనా చర్చలు జరగనున్నాయి. మాల్దీవులతో భారత్‌కు బలమైన అభివృద్ధి భాగస్వామ్యం ఉందని జైస్వాల్ తెలిపారు. ఆ దేశ ప్రభుత్వ అభ్యర్థన మేరకు రూ.3,000 కోట్ల కరెన్సీ స్వాప్ ఒప్పందాన్ని తొలిసారిగా పొడిగించినట్లు వెల్లడించారు. 2024 అక్టోబర్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ పొడిగింపు 2026 అక్టోబర్ 23 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల మాల్దీవుల ఆర్థిక స్థిరత్వం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు.
త్వరలో మోదీ కెనడా పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ కెనడా పర్యటన తేదీలపై చర్చలు జరుగుతున్నాయని జైస్వాల్ తెలిపారు. ఇటీవల ఢిల్లీకి వచ్చిన కెనడా విదేశాంగ మంత్రి.. జైశంకర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారని, ప్రధానితోనూ సమావేశమయ్యారని చెప్పారు. పర్యటన తేదీలపై స్పష్టత వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. విదేశీ నేతలు, మంత్రులతో సమావేశాలను గత పదేళ్లుగా ఢిల్లీ వెలుపల కూడా నిర్వహిస్తున్నట్లు జైస్వాల్ తెలిపారు. స్పెయిన్ ప్రధానితో వడోదరాలో, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో అహ్మదాబాద్‌లో, మారిషస్ ప్రధానితో వారణాసిలో ప్రధాని మోదీ సమావేశమైన విషయాన్ని గుర్తుచేశారు. ఇదిలా ఉండగా, జైశంకర్ ఇటీవల యూఏఈ విదేశాంగ మంత్రితో వాణిజ్యం, ఇంధనం, అక్కడి భారతీయుల సంక్షేమం, గల్ఫ్ ప్రాంత పరిణామాలపై చర్చించారు. రైసినా డైలాగ్‌లో పాల్గొన్న జార్జియా విదేశాంగ మంత్రితోనూ ఆయన భేటీ అయ్యారు. రస్ అల్ ఖైమా పాలకుడితో ద్వైపాక్షిక అంశాలు, గల్ఫ్ పరిస్థితులపై చర్చించినట్లు జైస్వాల్ వెల్లడించారు.
కేంద్రంపై జైరాం రమేశ్ ప్రశ్నలు
జైశంకర్–రూబియో భేటీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అక్టోబర్ 15న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూబియో భారత పర్యటన, జైశంకర్‌తో సమావేశం గురించి అమెరికా రాయబారి సెర్గియో గోర్ సమాచారం వెల్లడించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివరాలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధే ప్రకటించాల్సి ఉండగా, మరో దేశ రాయబారి ద్వారా సమాచారం బయటకు రావడమేంటని నిలదీశారు. 2025 మేలో ఆపరేషన్ సిందూర్ నిలిపివేతపై కూడా భారత్‌కు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటన ద్వారానే సమాచారం అందిందని ఆయన పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●TGSRTC | భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త.. అమ్మవారి ఆలయాలకు ప్రత్యేక బస్సులు!
- ●Mahesh Kumar Goud | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వండి.. సీపీఎం నేతలను కోరిన పీసీసీ చీఫ్
- ●Garuda Seva | వానజల్లుల మధ్య వైభవంగా శ్రీవారి గరుడసేవ!
- ●TGSRTC | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరాకు 7వేల ప్రత్యేక బస్సులు!
- ●Sheela Rajkumar | రణబాలిలో అలివేలు - జైలర్ 2లో పార్వతి - రెండు సినిమాల్లో నటించిన తమిళ నటి ఎవరంటే?
- ●Hyderabad | వేసవిలో నీటి ఎద్దడి నివారణకు జలమండలి ప్లాన్!

TGSRTC | భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త.. అమ్మవారి ఆలయాలకు ప్రత్యేక బస్సులు!

Mahesh Kumar Goud | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వండి.. సీపీఎం నేతలను కోరిన పీసీసీ చీఫ్

Garuda Seva | వానజల్లుల మధ్య వైభవంగా శ్రీవారి గరుడసేవ!

TGSRTC | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరాకు 7వేల ప్రత్యేక బస్సులు!



