త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | ఇంకో ఐదు నిమిషాలైతే కాలేజీకి చేరేదే.. ఓయూ విద్యార్థిని ఎలా చ‌నిపోయిందంటే!

Road Accident | ఆ విద్యార్థిని ఇంకో ఐదు నిమిషాలైతే కాలేజీలో అడుగు పెట్టేదే.. ఫ్రెండ్స్‌తో క‌లిసి క్లాస్‌రూమ్‌లో పాఠాలు వినేదే.. ఇంత‌లో విధికి క‌న్ను కుట్టిందేమో రోడ్డు ప్రమాద రూపంలో ఆమెను మృత్యువు వెంటాడింది.

S

Telangana | Published On Nov 9, 2026, 4.25 pm IST

Road Accident | ఇంకో ఐదు నిమిషాలైతే కాలేజీకి చేరేదే.. ఓయూ విద్యార్థిని ఎలా చ‌నిపోయిందంటే!
Advertisement

Road Accident | త్రినేత్ర న్యూస్: ఆ విద్యార్థిని ఇంకో ఐదు నిమిషాలైతే కాలేజీలో అడుగు పెట్టేదే.. ఫ్రెండ్స్‌తో క‌లిసి క్లాస్‌రూమ్‌లో పాఠాలు వినేదే.. ఇంత‌లో విధికి క‌న్ను కుట్టిందేమో రోడ్డు ప్రమాద రూపంలో ఆమెను మృత్యువు వెంటాడింది. స్కూటీపై కాలేజీకి వెళ్తుండ‌గా బ‌స్సు ఢీకొట్టి విద్యార్థిని మృతి చెందిన విషాద‌ ఘ‌ట‌న‌ హైద‌రాబాద్ న‌ల్ల‌కుంట‌లో సోమ‌వారం చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. షేక్ ఆయేషా (21) ఉస్మానియా యూనివ‌ర్సిటీ మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో చ‌దువుతోంది. రోజుమాదిరిగానే త‌న స్కూటీపై సోమ‌వారం ఉద‌యం కాలేజీకి బ‌య‌లుదేరింది. మార్గ‌మ‌ధ్యలో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ వద్దకు చేరుకోగానే స్కూటీని బస్సు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న న‌ల్ల‌కుంట పోలీసులు వెంట‌నే సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఆయేషా మృతదేహాన్ని ప‌రిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

కాగా త‌మ బిడ్డ మ‌ర‌ణ వార్త అందుకున్న త‌ల్లిదండ్రులు గుండెల‌విసేలా రోదిస్తున్నారు. బంధువుల‌తో పాటు స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఎంతో మంచి భ‌విష్య‌త్ ఉన్న విద్యార్థిని ఇలా అర్ధాంత‌రంగా ప్రాణాలు కోల్పోవ‌డం జీర్ణించుకోలేక‌పోతున్నామ‌ని కంట‌త‌డి పెడుతున్నారు.

Advertisement
Advertisement