త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Charagonda Govt High School | ఇక్క‌డే ఉండండి సార్‌.. మ‌మ్మ‌ల్ని విడిచి వెళ్ల‌కండి ప్లీజ్

Charagonda Govt High School | పాఠ‌శాల‌లో ఉన్న‌ది ఏడాదే.. కానీ ప్రాణం పెట్టి పాఠాలు చెప్పాడు. ఇక్క‌డే ఉండండి.. మ‌మ్మ‌ల్ని విడిచి వెళ్లొద్దు సార్‌ అంటూ విద్యార్థులు ఎమోష‌న‌ల‌య్యారు.

S

Telangana | Published On Nov 9, 2026, 5.12 pm IST

Charagonda Govt High School | ఇక్క‌డే ఉండండి సార్‌.. మ‌మ్మ‌ల్ని విడిచి వెళ్ల‌కండి ప్లీజ్
Advertisement
  • ఉపాధ్యాయుడు వెళ్తుండ‌గా విద్యార్థుల క‌న్నీళ్లు
  • నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో మరో భావోద్వేగ ఘ‌ట‌న‌

Charagonda Govt High School | త్రినేత్ర న్యూస్‌: పాఠ‌శాల‌లో ఉన్న‌ది ఏడాదే.. కానీ ప్రాణం పెట్టి పాఠాలు చెప్పాడు. విద్యార్థులతో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్ప‌రచుకున్నాడు. అందుకే ఆ ఉపాధ్యాయుడు పాఠ‌శాల విడిచి వెళ్తుంటే చిన్నారి విద్యార్థులు విడిచి ఉండ‌లేక క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ఇక్క‌డే ఉండండి సార్‌.. మ‌మ్మ‌ల్ని విడిచి వెళ్లొద్దంటూ ఎమోష‌న‌ల‌య్యారు. హృద‌యాల‌ను క‌దిలించే ఈ భావోద్వేగ ఘ‌ట‌న‌ నాగర్‌కర్నూల్ (Nagar Kurnool) జిల్లా చారకొండ (Charagonda) మండలంలోని ప్రభుత్వ పాఠశాల(Govt High School)లో సోమ‌వారం చోటుచేసుకుంది.

తుర్కలపల్లి పాఠశాలకు చెందిన‌ ఉపాధ్యాయుడు శ్రీకాంత్ డిప్యూటేషన్‌పై ఏడాది క్రితం చారకొండ మండలంలోని ప్రభుత్వ పాఠశాలకు వ‌చ్చారు. విద్యార్థుల‌కు చ‌దువుతో పాటు విలువ‌లు బోధించారు. ఏడాది పాటు విధులు కొన‌సాగించారు. ఈ క్ర‌మంలో విద్యార్థులతో ఎంతో ఆత్మీయ అనుబంధం పెంచుకున్నాడు. తాజాగా గడువు ముగియడంతో తిరిగి వెళ్తున్న స‌మ‌యంలో విద్యార్థులు కంట‌త‌డి పెట్టుకున్నారు. పాఠ‌శాల గేటు వ‌ద్ద త‌న బైక్‌కు అడ్డుగా నిల‌బ‌డి వెళ్లొద్దంటూ రెక్వెస్ట్ చేశారు.

ఇది చూసిన‌ శ్రీకాంత్ సైతం వారి ప్రేమాభిమానాలు చూసి తీవ్ర‌ భావోద్వేగానికి గురయ్యారు. చివ‌రికి వారికి చాక్లెట్‌లు పంచి ఆ చిన్నారుల‌ మ‌న‌సుల్లో ఆనందం నింపి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఏదేమైనా గురువు సంపాదించుకునే అసలైన సంపద విద్యార్థుల ప్రేమేనని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.

Advertisement
Advertisement