CPCB Recruitment | పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండా ఎంపిక
CPCB Recruitment | ఢిల్లీలోని ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. మొత్తం 51 పోస్టులతో నోటిఫికేషన్ (CPCB Recruitment) విడుదల చేసింది.
CPCB Recruitment | త్రినేత్ర.న్యూస్: ఢిల్లీలోని ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. మొత్తం 51 పోస్టులతో నోటిఫికేషన్ (CPCB Recruitment) విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 7 వరకు www.cpcb.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి ఫీజు, రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది. అయితే ఈ ఉద్యోగలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్నది. ఇందులో సైంటిస్ట్, అసిస్టెంట్ మేనేజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫీల్డ్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి నెలకు రూ.38,741 నుంచి రూ.1,71,597 వేతనం అందుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 51
సైంటిస్ట్ - డీ- 1
సైంటిస్ట్ - సీ- 08
సైంటిస్ట్ - బీ- 12
సైంటిఫిక్ అసిస్టెంట్- 13
అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్)- 03
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్- 1
టాక్సోనోమిస్ట్- 1
డేటాఎంట్రీ ఆపరేటర్- 4
ఫీల్డ్ అసిస్టెంట్- 8
అర్హతలు: పోస్టును బట్టి అభ్యర్థులు ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, ఎంఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్ని పోస్టులకు అకడెమిక్ ఉత్తీర్ణతో పాటు గేట్ లేదా నెట్ స్కోర్ ఉత్తీర్ణత అవసరం. ఉద్యోగానుభవం ఉండాలి. సైంటిస్ట్ పోస్టులకు 35 నుంచి 50 ఏండ్లు, డేటాఎంట్రీ ఆపరేటర్‌కు 32 ఏండ్లు, ఫీల్డ్ అసిస్టెంట్‌కు 27 ఏండ్లు, ఇతర పోస్టులకు 35 ఏండ్ల మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా. ఒకవేళ ఎక్కువ మంది దరఖాస్తు చేస్తే రాత పరీక్ష నిర్వహించవచ్చు. ఎంపికైనవారు లక్నో, కోల్‌కతా, చండీగఢ్, ఢిల్లీలో పనిచేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత పనితీరు, సంస్థ అవసరాల నిమిత్తం కాంట్రాక్టు వ్యవధిని పొడిగిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 07
వెబ్సైట్: https://www.cpcb.gov.in/
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
సంబంధిత వార్తలు

RRB Recruitment | రైల్వేలో 560 పారా మెడికల్ ఉద్యోగాలు.. ఆర్ఆర్బీ నోటిఫికేషన్
సెప్టెంబర్ 10, 2026

SSC CHSL | ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 2536 పోస్టులతో SSC CHSL నోటిఫికేషన్
సెప్టెంబర్ 9, 2026

UIIC Recruitment | యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో 225 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు..
సెప్టెంబర్ 8, 2026
తాజావార్తలు
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన
- ●US Dollar | అమెరికా డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందా..? సింగపూర్ డాలర్ వైపు ఇన్వెస్టర్ల చూపులు..
- ●MLC L Ramana | అసెంబ్లీ సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహించండి
- ●Bhatti Vikramarka | ఉద్యోగులందరికీ రూ.కోటి బీమా పథకం అమలు చేస్తున్నం
- ●Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం
- ●S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు

NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన

US Dollar | అమెరికా డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందా..? సింగపూర్ డాలర్ వైపు ఇన్వెస్టర్ల చూపులు..

MLC L Ramana | అసెంబ్లీ సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహించండి

Bhatti Vikramarka | ఉద్యోగులందరికీ రూ.కోటి బీమా పథకం అమలు చేస్తున్నం



