BMS | ఈఎస్ఐ వేతన పరిమితిని రూ. 42 వేలకు పెంచండి.. కేంద్రాన్ని కోరిన బీఎంఎస్
BMS | కొత్త లేబర్ కోడ్‌లలోని కార్మిక వ్యతిరేక అంశాలపై కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) నాయకత్వం సమావేశమై పలు అంశాలపై చర్చించింది.
BMS | త్రినేత్ర.న్యూస్ : కొత్త లేబర్ కోడ్‌లలోని కార్మిక వ్యతిరేక అంశాలపై కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) నాయకత్వం సమావేశమై పలు అంశాలపై చర్చించింది. పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020లోని వివిధ అంశాలపై బీఎంఎస్ ప్రతినిధులు తమ అభ్యంతరాలను, సూచనలను కేంద్ర మంత్రికి వివరించారు. కార్మికులకు ఈపీఎఫ్, బోనస్, ఈఎస్ఐ వేతన పరిమితిని పెంచాలని కేంద్రాన్ని బీఎంఎస్ నాయకత్వం కోరింది. కార్మికుల చట్టబద్దమైన హక్కులు, ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని బీఎంఎస్ స్పష్టం చేసింది.
బీఎంఎస్ లేవనెత్తిన ప్రధాన డిమాండ్లు ఇవే..
- ఈపీఎఫ్ వేతన పరిమితిని రూ.15,000 నుండి రూ.30,000 కు, బోనస్ వేతన పరిమితిని రూ.21,000 నుండి రూ.42,000కు, ఈఎస్ఐ వేతన పరిమితిని రూ.21,000 నుండి రూ.42,000 కు పెంచాలి.
- విచక్షణారహిత “హైర్ అండ్ ఫైర్” విధానాలను నివారించడానికి స్టాండింగ్ ఆర్డర్లు, తొలగింపు/లే-ఆఫ్‌కు సంబంధించిన నిబంధనల వర్తింపు పరిమితిని 300 మంది కార్మికుల నుండి 100 మంది కార్మికులకు తగ్గించాలి.
- ఫిక్స్‌డ్-టర్మ్ ఉపాధిని పరిమితం చేయాలని, శాశ్వత, క్రమబద్ధమైన స్వభావం గల ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన కల్పించాలి.
- చర్చల యూనియన్ గుర్తింపు కోసం 51% సభ్యత్వ అవసరం, నెగోషియేటింగ్ కౌన్సిల్‌కు సంబంధించిన నిబంధనలపై బీఎంఎస్ ఆందోళన వ్యక్తం చేసి, ఆచరణాత్మక మార్పులు కోరింది.
- నిర్ణీత గడువులోగా అధికారి రిజిస్ట్రేషన్ పూర్తి చేయకపోతే ట్రేడ్ యూనియన్లకు “డీమ్డ్ రిజిస్ట్రేషన్” నిబంధనను ప్రవేశపెట్టాలి.
- “కార్మికుడు” నిర్వచనం కింద సూపర్‌వైజర్లకు నిర్దేశించిన వేతన పరిమితిని పెంచాలని, సమ్మె హక్కుకు సంబంధించిన నోటీసు అవసరాలలో తగిన సడలింపు కల్పించాలి.
చట్ట సవరణలను త్వరగా పరిశీలిస్తామని కేంద్ర మంత్రి హామీ
బీఎంఎస్ నాయకత్వం వినతులను వివరంగా విన్న కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ.. వారు లేవనెత్తిన డిమాండ్లను పరిశీలించి చట్టసవరణలను త్వరగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. తదుపరి దశ చర్చలలో, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ నిబంధనలపై బీఎంఎస్ కేంద్ర నాయకత్వం, కార్మిక మంత్రి మధ్య ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి






