Hyderabad | వైద్యుడి నిర్లక్ష్యంతో పీహెచ్‌డీ విద్యార్థి మృతి.. హైదరాబాద్ ఆస్పత్రికి రూ. కోటి జరిమానా
Hyderabad | వైద్యుడి నిర్లక్ష్యంతో ఓ పీహెచ్‌డీ విద్యార్థి మృతి చెందాడు. దీంతో మృతుడి తల్లిదండ్రులు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కన్జూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెస్సల్ కమిషన్‌ను సంప్రదించారు. ఈ కేసు విచారణ అనంతరం మృతుడి కుటుంబానికి రూ. కోటి చెల్లించాలని సదరు ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించింది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : వైద్యుడి నిర్లక్ష్యంతో ఓ పీహెచ్‌డీ విద్యార్థి మృతి చెందాడు. దీంతో మృతుడి తల్లిదండ్రులు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కన్జూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెస్సల్ కమిషన్‌ను సంప్రదించారు. ఈ కేసు విచారణ అనంతరం మృతుడి కుటుంబానికి రూ. కోటి చెల్లించాలని సదరు ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించింది. లీగల్ ఖర్చుల నిమిత్తం ఆ కుటుంబానికి మరో రూ. 50 వేలు చెల్లించాలని ఆదేశించింది.
కేసు వివరాలు ఇలా..
సూర్య ప్రతాప్ భారతి(30) అనే విద్యార్థి హైదరాబాద్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. అయితే అతనికి 2020 ఆగస్టు 17న తీవ్రమైన స్ట్రోక్ వచ్చింది. దీంతో పక్షవాతానికి గురయ్యాడు. యూనివర్సిటీ హాస్టల్ సిబ్బంది తక్షణమే భారతిని సిటిజెన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించారు.
వైద్యుడి నిర్లక్ష్యం..
అయితే భారతికి అత్యవసరంగా మెకానికల్ థ్రాంబెక్టోమీ అవసరం. కానీ న్యూరాలజిస్ట్ ఆ మేరకు చికిత్స అందించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఆస్పత్రి యాజమాన్యం కూడా పట్టించుకోలేదు. కోమాలో ఉన్న భారతి నాలుగు రోజులకు ప్రాణాలు కోల్పోయాడు.
కుటుంబ సభ్యులపై నెపం..
భారతి కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో వారి నుంచి ఎలాంటి సమ్మతి తీసుకోలేనందున వైద్యం సకాలంలో అందించలేకపోయామని ఆస్పత్రి యాజమాన్యంతో పాటు సదరు న్యూరాలజిస్ట్ వినియోగదారుల ఫోరానికి విన్నవిస్తూ కుటుంబ సభ్యులపైనే నెపం నెట్టారు. అత్యవసర చికిత్స అందించడం ఆస్పత్రి కర్తవ్యమని వినియోగదారుల ఫోరం అభిప్రాయపడింది.
రూ. కోటి జరిమానా.. లీగల్ ఖర్చులకు రూ. 50 వేలు
భారతి మరణానికి పూర్తిగా ఆస్పత్రితో పాటు న్యూరాలజిస్ట్ నిర్లక్ష్యమేనని వినియోగదారుల ఫోరం విచారణలో తేలింది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం, న్యూరాలజిస్ట్ కలిసి భారతి కుటుంబానికి రూ. కోటి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. లీగల్ ఖర్చుల నిమిత్తం మరో రూ. 50 వేలు చెల్లించాలని ఆదేశించింది. నిర్ణీత గడువులోగా పరిహారం చెల్లించకపోతే.. ఆ రోజు నుంచి చెల్లించే వరకు ఏడాదికి 9 శాతం వడ్డీ చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్





