Telangana Brahmin Samkshema Parishad | బ్రాహ్మణ పరిషత్‌కు రూ. 31 కోట్లు విడుదల చేయండి..
Telangana Brahmin Samkshema Parishad | తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి సహకారం
Telangana Brahmin Samkshema Parishad | తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యకలాపాలు, పేద బ్రాహ్మణుల సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత లేకుండా చూడాలని చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన భట్టి విక్రమార్క.. పెండింగ్‌లో ఉన్న రూ.6 కోట్ల నిధులతో పాటు ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పొందిన రూ.25 కోట్లను కూడా వెంటనే విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
బ్రాహ్మణ సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి ఈ నిర్ణయం నిదర్శనమని ఈ సందర్భంగా బసవరాజు శ్రీనివాస్ పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాల అభ్యున్నతి, విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబన వంటి అంశాల్లో పరిషత్ ద్వారా మరింత విస్తృతంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ నిధులు దోహదపడతాయని తెలిపారు. “బ్రాహ్మణ సమాజ సంక్షేమం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, అవసరమైన నిధులను విడుదల చేయడానికి ముందుకు రావడం అభినందనీయం. ఇది తెలంగాణ బ్రాహ్మణ సమాజంపై ప్రభుత్వం చూపుతున్న గౌరవం, చిత్తశుద్ధికి నిదర్శనం” అని బసవరాజు శ్రీనివాస్ అన్నారు. “రాజకీయాలకు, ప్రాంతాలకు, శాఖా భేదాలకు అతీతంగా బ్రాహ్మణ సమాజం ఐక్యంగా ఉండి, ప్రభుత్వంతో సమన్వయంతో ముందుకు సాగితే మన సమాజ అభివృద్ధికి మరిన్ని అవకాశాలు సాధించుకోవచ్చు. బ్రాహ్మణుల సంక్షేమం, ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన కోసం అందరం ఐక్యంగా కృషి చేద్దాం” అని బసవరాజు శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా యావత్ తెలంగాణ బ్రాహ్మణ సమాజం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు, బ్రాహ్మణులు అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి శ్రీధర్ బాబుకు బసవరాజు శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



