JP Nadda | ప్రజాస్వామ్యం ముసుగులో దేశంలో అరాచకం సృష్టించే కుట్ర
JP Nadda | ప్రజాస్వామ్యం పేరుతో దేశంలో అరాచకం సృష్టించేందుకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించిన ఇండియా కూటమి ర్యాలీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
- ఎన్నికల్లో తిరస్కరించిన నేతలు నాటకానికి తెరలేపారు
- రాహుల్ రాజకీయ విధానంలో నాలుగు దశలు
- ఇండియా కూటమిపై కేంద్రమంత్రి జేపీ నడ్డా తీవ్ర విమర్శలు
JP Nadda | ప్రజాస్వామ్యం పేరుతో దేశంలో అరాచకం సృష్టించేందుకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించిన ఇండియా కూటమి ర్యాలీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ప్రజలు పదేపదే తిరస్కరించిన నేతలు రాజకీయ నాటకాలకు తెరతీశారని విమర్శించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ రాజకీయ విధానంలో నాలుగు దశలు ఉన్నాయని నడ్డా ఆరోపించారు. మొదట అబద్ధాలు, అపోహలు ప్రచారం చేయడం.. రెండోది వీధుల్లో అశాంతి, గందరగోళం సృష్టించేలా ప్రజలను రెచ్చగొట్టడం.. మూడోది దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం.. నాలుగోది విదేశీ శక్తుల ప్రోద్బలంతో ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించడమని వ్యాఖ్యానించారు.
వ్యాపారుల ఉపాధిని దెబ్బతీస్తున్నరు
పండుగల సీజన్‌లో ఢిల్లీలో ర్యాలీ నిర్వహించడంతో చిన్న వ్యాపారులు, దుకాణదారుల ఉపాధి దెబ్బతింటుందని నడ్డా ఆరోపించారు. ధన్‌తేరస్, దీపావళి, ఛఠ్ పూజ వంటి పండుగల సమయంలో వ్యాపారులు ఏడాదంతా ఎదురుచూస్తారని పేర్కొన్నారు. ఈ సమయంలో ర్యాలీలతో వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం సమంజసం కాదన్నారు. వ్యాపార సంఘాలు ర్యాలీని వాయిదా వేయాలని రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ తదితరులను పలుమార్లు కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు.
రాహుల్ రాజకీయాలపై విమర్శలు
నవంబర్ 1న నిర్వహిస్తున్న ర్యాలీ వెనుక నాలుగు లక్ష్యాలు ఉన్నాయని నడ్డా ఆరోపించారు. సిక్కు సోదరుల మనోభావాలను దెబ్బతీయడం, ఢిల్లీలో అల్లర్లు, అశాంతిని ప్రేరేపించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించడం, పండుగల వేళ వ్యాపారుల ఆదాయానికి గండికొట్టడం, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దెబ్బతీయడం వాటిలో భాగమని విమర్శించారు. విదేశాలకు వెళ్లి భారత్‌ను విమర్శించే రాహుల్‌గాంధీ.. దేశానికి తిరిగొచ్చాక ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థపై దాడి చేస్తున్నారని నడ్డా వ్యాఖ్యానించారు. ప్రజలను ఇకపై తప్పుదోవ పట్టించడం సాధ్యం కాదని, అశాంతిని సృష్టించే ప్రయత్నాలను దేశ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. దేశం రాజ్యాంగం, ప్రజల తీర్పు ప్రకారమే నడుస్తుందని నడ్డా స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Sobhita Dhulipala | సంక్రాంతి రేసులో అక్కినేని కోడలి తమిళ మూవీ - టాలీవుడ్ హీరోలతో పోటీ...
- ●INDIA bloc march | ఇండీ కూటమి మెగా మార్చ్.. ఓపెన్ టాప్ వాహనంలో ప్రయాణించిన నేతలు
- ●Uppal police | ఆన్లైన్లో తాళాలు పగలగొట్టేది నేర్చుకుని.. ఇళ్లలో చోరీలు.. మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు
- ●CM Revanth Reddy Delhi Tour | రావణుడు లాంటి మోదీని గద్దె దించేందుకు ఢిల్లీకి వచ్చిన తెలంగాణ వానర సైన్యం
- ●Kavitha | ఓబీసీ, ఆదివాసీల జనగణనపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి
- ●Ram Charan | చిరంజీవి క్లాప్‌తో రామ్‌చరణ్, సుకుమార్ మూవీ షురూ

Sobhita Dhulipala | సంక్రాంతి రేసులో అక్కినేని కోడలి తమిళ మూవీ - టాలీవుడ్ హీరోలతో పోటీ...

INDIA bloc march | ఇండీ కూటమి మెగా మార్చ్.. ఓపెన్ టాప్ వాహనంలో ప్రయాణించిన నేతలు

Uppal police | ఆన్లైన్లో తాళాలు పగలగొట్టేది నేర్చుకుని.. ఇళ్లలో చోరీలు.. మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు

CM Revanth Reddy Delhi Tour | రావణుడు లాంటి మోదీని గద్దె దించేందుకు ఢిల్లీకి వచ్చిన తెలంగాణ వానర సైన్యం





