త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | లోక్‌స‌భ‌లో ప్ర‌ధాని మోదీపై దాడికి ప్లాన్‌ : ప్ర‌భుత్వ వ‌ర్గాలు

PM Modi | ప్ర‌తిప‌క్ష ఎంపీల‌పై ప్ర‌భుత్వ వ‌ర్గాలు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. లోక్‌స‌భ (Lok Sabha)లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)పై దాడికి ప్లాన్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు గుప్పించారు.

D

National | Published On Feb 5, 2026, 3.20 pm IST

PM Modi | లోక్‌స‌భ‌లో ప్ర‌ధాని మోదీపై దాడికి ప్లాన్‌ : ప్ర‌భుత్వ వ‌ర్గాలు
Advertisement

PM Modi | ప్ర‌తిప‌క్ష ఎంపీల‌పై ప్ర‌భుత్వ వ‌ర్గాలు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. లోక్‌స‌భ (Lok Sabha)లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)పై దాడికి ప్లాన్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు గుప్పించారు. అందుకే నిన్న లోక్‌స‌భ‌ను వాయిదా వేయాల్సి వ‌చ్చింద‌ని పేర్కొన్నారు.

పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంపై (Presidents Address) ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్‌స‌భ ఆమోదించింది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ప్ర‌సంగం లేకుండానే దీనికి ఆమోదం ల‌భించ‌డం గ‌మ‌నార్హం. ఇలా చేయ‌డానికి వెనుక ప్ర‌ధాన కార‌ణం ఉన్న‌ట్లు తెలిసింది. లోక్‌స‌భ‌లో ప్ర‌ధాని మోదీపై దాడికి కాంగ్రెస్ ప్లాన్ చేసిన‌ట్లు త‌మ‌కు ప‌క్కా స‌మాచారం అందింద‌ని.. అందుకే స‌భ‌ను వాయిదా వేసిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెప్పిన‌ట్లు జాతీయ మీడియాలో వ‌రుస క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

"రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడేందుకు ప్ర‌ధాని నిన్న స‌భ‌లో అందుబాటులోనే ఉన్నారు. కానీ, లోక్‌స‌భ‌లో కాంగ్రెస్ ఎంపీలు ప్ర‌ధానిని చుట్టుముట్టి దాడికి ప్లాన్ చేసిన‌ట్లు ప‌క్కా స‌మాచారం అందింది. ఇందుకోసం మ‌హిళా ఎంపీల‌ను పంపారు. అందుకే స‌భ‌ను వాయిదా వేయాల్సి వ‌చ్చింది" అని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెప్పిన‌ట్లు జాతీయ మీడియా నివేదిస్తోంది.

ప్ర‌ధాని ప్ర‌సంగం లేకుండానే తీర్మానానికి ఆమోదం..

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంపై (Presidents Address) ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్‌స‌భ ఆమోదించింది. అయితే, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ప్ర‌సంగం లేకుండానే దీనికి ఆమోదం ల‌భించ‌డం గ‌మ‌నార్హం. నిన్న లోక్‌స‌భ‌లో ప్ర‌ధాని ప్ర‌సంగించాల్సి ఉండ‌గా.. విప‌క్షాల‌ నిర‌స‌న‌ల‌తో స్పీక‌ర్‌ స‌భ‌ను వాయిదా వేశారు. ఇవాళ ఉద‌యం కూడా లోక్‌స‌భ‌లో నిర‌స‌న‌లు కొన‌సాగాయి. స‌భ ఉద‌యం 11 గంట‌లకు ప్రారంభ‌మైన వెంట‌నే విప‌క్ష ఎంపీలు నిర‌స‌న‌కు దిగారు. వారి నిర‌స‌న‌ల మ‌ధ్యే ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించినట్లు స్పీకర్‌ ప్రకటించారు. అనంత‌రం స‌భ‌ను వాయిదా వేశారు.

లోక్‌స‌భ‌లో ర‌గ‌డ‌..

లోక్‌స‌భ‌లో రెండు రోజులుగా ర‌గ‌డ కొన‌సాగుతోంది. చైనా అంశంపై మాజీ ఆర్మీ చీఫ్ న‌ర‌వాణే (Ex Army chief General MM Naravane) త‌న పుస్త‌కంలో రాసుకున్న కొన్ని అంశాల‌ను రాహుల్ త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించ‌డంతో స‌భ‌లో గంద‌ర‌గోళం త‌లెత్తింది. దీనికి తోడు అమెరికా-భార‌త్ ట్రేడ్ డీల్‌ని వ్య‌తిరేకిస్తూ.. విప‌క్ష ఎంపీలు స‌భ‌లో నిర‌స‌న‌కు దిగారు. అధికార‌ప‌క్షం ఎంపీల సీట్ల వ‌ద్ద‌కు వెళ్లి గంద‌ర‌గోళం సృష్టించారు. స‌భ‌లో గంద‌ర‌గోళం సృష్టిస్తూ స‌భా కార్య‌క‌లాపాలను అడ్డుకుంటున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement