Om Birla | లోక్‌సభ స్పీకర్‌ను బెదిరించిన కాంగ్రెస్ ఎంపీలు.. వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి
Om Birla| కాంగ్రెస్ పార్టీపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) సంచలన ఆరోపణలు చేశారు. లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లా (Om Birla)ని కాంగ్రెస్ ఎంపీ (Congress MPs)లు బెదిరించారన్నారు.
Om Birla| కాంగ్రెస్ పార్టీపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) సంచలన ఆరోపణలు చేశారు. లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లా (Om Birla)ని కాంగ్రెస్ ఎంపీ (Congress MPs)లు బెదిరించారన్నారు. ఆయన చాంబర్‌లోకి చొరబడి బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన వీడియోని కిరణ్ రిజుజు గురువారం ఉదయం ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఆ వీడియోలో 20 మందికిపైగా కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ చాంబర్‌లోకి వెళ్లారు. అక్కడ ఆయనను దుర్బాషలాడుతూ బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఈ వీడియోని షేర్ చేసిన కిరణ్ రిజుజు.. "గౌరవనీయులైన స్పీకర్ చాంబర్‌లోకి 20 నుంచి 25 మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రవేశించారు. ఆయనను దుర్భాషలాడి, బెదిరింపులకు పాల్పడ్డారు. ఓ ఎంపీ తీసిన చట్టవిరుద్ధమైన వీడియో క్లిప్ ఇది. ఇలా బెదిరింపు ధోరణిని మా పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదు" అని కిరణ్ రిజిజు రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ ఎంపీలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. లోక్‌సభలో ప్రధాని మోదీపై భౌతిక దాడికి కాంగ్రెస్ ఎంపీలు ప్రయత్నించారంటూ ఇటీవలే ఆరోపించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోని కూడా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు ఎక్స్‌లో షేర్ చేశారు. ఫిబ్రవరి 4న లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎంపీలు.. ప్రధాని కుర్చీ వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. బ్యానర్ ప్రదర్శించి నిరసన తెలిపారు. ఆ వీడియోకూడా ఇప్పటికే పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఇప్పుడు తాజాగా లోక్‌సభ స్పీకర్‌ను కాంగ్రెస్ ఎంపీలు బెదిరించిన వీడియో బయటకు రావడం చర్చకు దారితీస్తోంది.
https://x.com/KirenRijiju/status/2021812385460420837
సంబంధిత వార్తలు

Justice Yashwant Verma Case | న్యాయమూర్తి యశ్వంత్ వర్మ కేసు.. లోక్‌సభ స్పీకర్‌కు నివేదిక..
మే 19, 2026

Kanimozhi | కాంగ్రెస్‌తో పొత్తు ముగిసింది.. సభలో వారిపక్కన కూర్చోం.. ఓంబిర్లాకు డీఎంకే లేఖ
మే 8, 2026

AAP MPs join BJP | ఏడుగురు ఆప్ ఎంపీలకు బీజేపీ స్వాగతం.. ‘తుక్డే తుక్డే’ కూటమికి గుడ్‌బై అంటూ కిరెన్ రిజిజు సెటైర్లు
ఏప్రిల్ 27, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



