Google Pixel 11 Pro Fold | గూగుల్ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్.. మైండ్ బ్లాక్ అయ్యే ధర..
Google Pixel 11 Pro Fold | గూగుల్ తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ శ్రేణిలోకి కొత్తగా పిక్సల్ 11 ప్రొ ఫోల్డ్‌ను తీసుకొచ్చింది. పిక్సల్ 11 సిరీస్ ఫోన్లతోపాటు ఈ కొత్త డివైస్‌ను కూడా భారత్‌లో విడుదల చేసింది. టెన్సర్ జి6 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో నిర్మాణపరమైన మార్పులు, డిస్‌ప్లే అప్‌గ్రేడ్‌లు, బహుళ ఉపయోగాలతో కూడిన ఎల్‌ఈడీ నోటిఫికేషన్ వ్యవస్థ, ప్రత్యేక సాఫ్ట్‌వేర్ యాక్సెసిబిలిటీ టూల్స్‌ను అందించింది.
Technology | Published On Aug 13, 2026, 2.34 pm IST
Google Pixel 11 Pro Fold | గూగుల్ తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ శ్రేణిలోకి కొత్తగా పిక్సల్ 11 ప్రొ ఫోల్డ్‌ను తీసుకొచ్చింది. పిక్సల్ 11 సిరీస్ ఫోన్లతోపాటు ఈ కొత్త డివైస్‌ను కూడా భారత్‌లో విడుదల చేసింది. టెన్సర్ జి6 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో నిర్మాణపరమైన మార్పులు, డిస్‌ప్లే అప్‌గ్రేడ్‌లు, బహుళ ఉపయోగాలతో కూడిన ఎల్‌ఈడీ నోటిఫికేషన్ వ్యవస్థ, ప్రత్యేక సాఫ్ట్‌వేర్ యాక్సెసిబిలిటీ టూల్స్‌ను అందించింది. మునుపటి తరం పిక్సల్ 10 ప్రొ ఫోల్డ్‌తో పోలిస్తే పిక్సల్ 11 ప్రొ కెమెరా మాడ్యూల్‌లో కీలకమైన భౌతిక మార్పుగా హైలైట్‌ను అందించారు. ఫ్లాష్ చుట్టూ అమర్చిన ఎల్‌ఈడీ రింగ్‌గా ఇది పనిచేస్తుంది. ప్రాధాన్యత ఉన్న కాంటాక్టుల నుంచి వచ్చే నోటిఫికేషన్లను రంగుల ఆధారిత లైట్ ప్యాటర్న్‌లతో హైలైట్ చేయడంతోపాటు, హ్యాండ్స్-ఫ్రీ జెమిని సెషన్ల సమయంలో రియల్‌టైమ్ ఫీడ్‌బ్యాక్‌ను అందిస్తుంది. భవిష్యత్తులో మెసేజింగ్ అలర్ట్‌లకు కూడా హైలైట్ సపోర్ట్ అందించనుంది.
డ్యూరబిలిటీ, డిస్‌ప్లేలో మార్పులు..
గూగుల్ కొత్త మెటీరియల్స్, భాగాలను ఉపయోగించి ఫోన్ నిర్మాణ దృఢత్వాన్ని మెరుగుపరిచింది. వెనుక ప్యానెల్‌ను అధిక ప్రభావ నిరోధకత కలిగిన గ్లాస్ ఫైబర్ కాంపోజిట్‌తో రూపొందించారు. హింజ్‌లో గేర్‌లెస్ డిజైన్‌తోపాటు పెద్ద బెండ్ రేడియస్‌ను ఉపయోగించారు. దీంతో లోపలి డిస్‌ప్లేలో ఏర్పడే క్రీజ్ పనితీరు మెరుగుపడుతుంది. ఔటర్ స్క్రీన్‌లో సూపర్ యాక్చువా డిస్‌ప్లే టెక్నాలజీని ఉపయోగించగా, దానికి సిరామిక్ కవర్ గ్లాస్ రక్షణగా ఉంటుంది. ఈ ఫోన్ ఐపీ68 రేటింగ్‌తో నీరు, దుమ్ము నుంచి రక్షణను అందిస్తుంది. లోపలి, బయటి రెండు స్క్రీన్‌లు గరిష్ఠంగా 3600 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తాయి. ఇది గత మోడల్‌తో పోలిస్తే 20 శాతం అధికం. సాధారణ వినియోగంలో ఈ ఫోన్ 24 గంటలకు పైగా బ్యాటరీ లైఫ్‌ను అందించేలా రూపొందించారు. వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వ్యవస్థల్లోనూ అప్‌గ్రేడ్‌లు చేశారు. వైర్డ్ ఛార్జింగ్ ద్వారా 30 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉంటుంది. సుమారు 30 నిమిషాల్లో బ్యాటరీని 50 శాతానికి ఛార్జ్ చేయవచ్చు. వైర్‌లెస్ ఛార్జింగ్‌లో ఇంటర్నల్ క్యూఐ2.2 సపోర్ట్‌తో గరిష్ఠంగా 25 వాట్ల ఛార్జింగ్ అందుతుంది. ఇది గత తరం మోడల్‌తో పోలిస్తే 20 శాతం వేగవంతమైనది.
![]()
పనితీరు, ఏఐ, సాఫ్ట్‌వేర్ ఫీచర్లు..
కొత్త టెన్సర్ జి6 చిప్‌సెట్‌తో పాటు 16 జీబీ ర్యామ్‌ను అందించారు. రెండు స్క్రీన్‌లపై మల్టీటాస్కింగ్‌తోపాటు స్థానిక ఏఐ ప్రాసెసింగ్ కోసం పిక్సల్ 11 ప్రొ ఫోల్డ్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. డెఫ్ కమ్యూనిటీ సహకారంతో సైన్-టు-టెక్స్ట్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను అభివృద్ధి చేశారు. ముందు కెమెరా ద్వారా అమెరికన్ సైన్ లాంగ్వేజ్‌ను ప్రాసెస్ చేసి, లైవ్ ట్రాన్స్‌క్రైబ్, జీబోర్డ్ సహాయంతో రియల్‌టైమ్ అనువాదాలను బయటి స్క్రీన్‌పై చూపిస్తుంది. అన్‌ఫోల్డ్ చేసిన డిస్‌ప్లే కోసం ఫ్లోటింగ్ యాప్ బబుల్స్‌ను ఆప్టిమైజ్ చేశారు. వీటి ద్వారా యాప్‌ల మధ్య వేగంగా మారవచ్చు. స్ప్లిట్ స్క్రీన్, డ్రాగ్ అండ్ డ్రాప్, ఇన్‌స్టంట్ వ్యూ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పిక్సల్ కెమెరాలోనే మెరుగుపరిచిన సర్కిల్ టు సెర్చ్ ఫంక్షనాలిటీని అందించారు. ప్రొ-యాక్టివ్ ఏఐ అసిస్టెన్స్‌తోపాటు పిల్లల ఫొటోగ్రఫీ కోసం అప్‌డేటెడ్ మేడ్ యు లుక్ యానిమేషన్లను కూడా ఇందులో అందించారు.
కెమెరా..
వెనుక కెమెరా విభాగంలో అప్‌గ్రేడ్ చేసిన సెన్సర్ వ్యవస్థతోపాటు కొత్త సాఫ్ట్‌వేర్ ఫీచర్లను అందించారు. ఇందులో 48 మెగాపిక్సల్ మెయిన్ సెన్సర్‌తోపాటు గరిష్ఠంగా 30ఎక్స్ సూపర్ జూమ్‌కు సపోర్ట్ చేసే టెలిఫొటో లెన్స్ ఉంటుంది. మ్యాజిక్ క్యాప్చర్ ఫీచర్ కదులుతున్న సబ్జెక్ట్‌లను షార్ప్‌గా క్యాప్చర్ చేసేందుకు రూపొందించారు. కెమెరా లుక్స్ ఫీచర్ ద్వారా కెమెరా యాప్‌లోనే కస్టమైజ్ చేసుకునే కలర్ ప్రొఫైల్స్, స్టైల్ ప్రి-సెట్లను అందించారు. పిక్సల్ 11 ప్రొ ఫోల్డ్‌లో 8 ఇంచుల, 2076 * 2152 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగిన క్యూహెచ్‌డీ ప్లస్ సూపర్ యాక్చువా ఫ్లెక్స్ ఓఎల్‌ఈడీ ఎల్‌టీపీఓ డిస్‌ప్లే ఉంది. ఇది 1 నుంచి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను, హెచ్‌డీఆర్‌లో గరిష్ఠంగా 2000 నిట్స్, పీక్ బ్రైట్‌నెస్‌గా గరిష్ఠంగా 3600 నిట్స్‌ను అందిస్తుంది. డిస్‌ప్లేకు అల్ట్రా థిన్ గ్లాస్ రక్షణ ఉంది.
![]()
బయటి డిస్‌ప్లే 6.5 ఇంచుల, 1080 * 2342 పిక్సల్స్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ యాక్చువా ఎల్‌టీపీఓ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే. ఇది 1 నుంచి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తోపాటు హెచ్‌డీఆర్‌లో గరిష్ఠంగా 2000 నిట్స్, పీక్ బ్రైట్‌నెస్‌గా 3600 నిట్స్ వరకు అందిస్తుంది. దీనికి అల్ట్రా-డ్యూరబుల్ గ్లాస్-సిరామిక్ కవర్ గ్లాస్ రక్షణ ఉంటుంది. ఈ ఫోన్ గూగుల్ టెన్సర్ జి6 ప్రాసెసర్, టైటాన్ ఎం3 సెక్యూరిటీ చిప్‌తో పనిచేస్తుంది. ఇందులో 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యుయల్ సిమ్, నానో సిమ్, ఈసిమ్‌కు సపోర్ట్ ఉంది. ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, యూఎస్‌బీ టైప్-సి ఆడియో, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, వైఫై 7 802.11బీఈ, బ్లూటూత్ 6 ఎల్‌ఈ, అల్ట్రా-వైడ్‌బ్యాండ్ చిప్, డ్యుయల్ బ్యాండ్ జీఎన్‌ఎస్ఎస్, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్‌ఎస్‌ఎస్, బీడూయ్, నావిక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యూఎస్‌బీ టైప్ సి 3.2, ఎన్‌ఎఫ్‌సీ కూడా ఉన్నాయి.
ధర, లభ్యత..
భారత్‌లో గూగుల్ పిక్సల్ 11 ప్రొ ఫోల్డ్ సింగిల్ 512 జీబీ మోడల్ ధరను రూ.1,86,999గా నిర్ణయించారు. ఇది ఆలివ్ రంగులో మాత్రమే అందుబాటులో ఉంది. పిక్సల్ 11 ప్రొ ఫోల్డ్ కోసం ప్రీ ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. గూగుల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. సాధారణ విక్రయాలు ఆగస్టు 20 నుంచి ప్రారంభమవుతాయి. గూగుల్ ఇండియా స్టోర్‌లో లాంచ్ ఆఫర్లలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ కొనుగోళ్లపై రూ.10వేల వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ అందిస్తున్నారు. 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎక్స్ఛేంజ్ బోనస్‌గా రూ.9వేల వరకు పొందే అవకాశం ఉంది.
తాజావార్తలు
- ●Monsoon Session | 12 బిల్లులకు ఆమోదం.. ఒక్క దానిపైనే చర్చ
- ●Advanced Tip | క్యాబ్ సంస్థలకు కేంద్రం ఝలక్.. ఇకపై ముందస్తు టిప్ కుదరదు..
- ●ATM Robbery | ఎట్టకేలకు దొరికారు.. బీదర్‌లో ఏటీఎంను కొల్లగొట్టి.. కూకట్‌పల్లిలో షెల్టర్ తీసుకున్నారు..
- ●Mallikarjun Kharge | ఆ ఘటన చాలా అవమానంగా అనిపించింది.. హల్ద్వానీలో వేదిక శుద్ధిపై ఖర్గే భావోద్వేగం
- ●Ponnam Prabhakar | ఇంటింటా ఇందిరమ్మ కుట్టుమిషన్లు.. 100 శాతం సబ్సిడీతో బీసీ మహిళలకు: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Google Pixel 11 | గూగుల్ పిక్సల్ 11 సిరీస్ వచ్చేసింది.. అదిరిపోయిన ఫీచర్లు..

Monsoon Session | 12 బిల్లులకు ఆమోదం.. ఒక్క దానిపైనే చర్చ

Advanced Tip | క్యాబ్ సంస్థలకు కేంద్రం ఝలక్.. ఇకపై ముందస్తు టిప్ కుదరదు..

ATM Robbery | ఎట్టకేలకు దొరికారు.. బీదర్‌లో ఏటీఎంను కొల్లగొట్టి.. కూకట్‌పల్లిలో షెల్టర్ తీసుకున్నారు..

Mallikarjun Kharge | ఆ ఘటన చాలా అవమానంగా అనిపించింది.. హల్ద్వానీలో వేదిక శుద్ధిపై ఖర్గే భావోద్వేగం


